అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా ?
అస్సాం రాష్ట్ర ఎన్నికలు ఏప్రిల్ 9న జరిగాయి. 2016 నుంచి అధికారంలో ఉంటూ వస్తున్న బీజేపీ ఎన్నికల బరిలో నిలుచుకుని మరోసారి జనం తీర్పు కోరింది.;
అస్సాం రాష్ట్ర ఎన్నికలు ఏప్రిల్ 9న జరిగాయి. 2016 నుంచి అధికారంలో ఉంటూ వస్తున్న బీజేపీ ఎన్నికల బరిలో నిలుచుకుని మరోసారి జనం తీర్పు కోరింది. ఇక బీజేపీకి హిమంత బిశ్వ శర్మ రూపంలో బలమైన నాయకుడు ఈ రాష్ట్రంలో దొరికారు. ఆయన 2021 నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన నాయకత్వంలో బీజేపీ ఈసారి ఎన్నికల్లో తలపడింది. దాంతో ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపిస్తున్నారు అని ప్రీ పోల్ సర్వే నివేదికలు వచ్చాయి ఎగ్జిట్ పోల్స్ కూడా అవే చెబుతున్నాయి. ఇక ప్రీ పోల్ సర్వే నివేదికలలో చూస్తే బీజేపీకి ఈసారి గెలుపు దక్కుతున్నా సీట్లు తగ్గుతాయని పేర్కొన్నాయి. కానీ ఎగ్జిట్ పోల్స్ చూస్తే సీట్లు మరింత ఎక్కువగా రావడమే కాదు. ఏకంగా 100 మార్క్ కి కూడా రీచ్ అవుతుందని సర్వేలు కొన్ని చెబుతున్నాయి. అంటే మూడింట రెండు వంతుల సీట్లు అన్న మాట.
కాషాయం కోటగా :
అదే జరిగితే కనుక అస్సాం కూడా ఒక గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల సరసన నిలవడం ఖాయమని అంటున్నారు. ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ రాజకీయం ఇపుడు జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన హిమంత బిశ్వ శర్మ తన చాణక్య రాజకీయంతో ఈ పరిస్థితికి కమలం పార్టీకి తెచ్చారని అంటున్నారు. ఇక అస్సాంలో చూస్తే హిమంత బిశ్వ శర్మ చరిష్మా టిక్ లీడర్ షిప్ ఈ ఎన్నికల్లో ఆ పార్టీ విజయానికి దోహదపడుతుందని అంటున్నారు. గౌరవ్ గొగోయ్ కాంగ్రెస్ తరఫున గట్టి పోటీ ఇస్తారని ప్రీ పోల్ సర్వేలు చెప్పాయి. తీరా చూతే కాంగ్రెస్ కి 30 నుంచి 35 దాకా సీట్లు మాత్రమే దక్కుతాయని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. దీనిని బట్టి చూస్తే కమలం ప్రభావం అస్సాం లో గట్టిగా ఉందని అంటున్నారు.
బీజేపీకి రాచబాట :
అస్సాంలో ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగా చూస్తే కనుక బీజేపీకి రాచబాట పరచినట్లే అని అంటున్నారు. కమలం పార్టీకి ఎదురులేని రాష్ట్రంగా అస్సాం మారుతోంది అని కూడా చెప్పాల్సి ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాలకు దిక్సూచిగా రాజకీయంగా బీజేపీకి అతి పెద్ద పునాదిగా అస్సాం ఉంది. అక్కడ బీజేపీ ఎంత బలంగా మారుతుందో అంతటికి అంతగా ఇతర ఈశాన్య రాష్ట్రాలలో సైతం కమల వికాసం జరుగుతుంది. అదే జరిగితే ఈశాన్య భారతం అంతటా బీజేపీకి తిరుగులేని పట్టు దొరుకుతుంది. గతంలో ఇక్కడ కాంగ్రెస్ అలాగే వామపక్ష రాజకీయం సాగుతూ వచ్చేది. దానికి పదేళ్ళ నుంచి బ్రేక్ చేస్తూ వచ్చిన కాషాయం పార్టీకి అస్సాంలో హ్యాట్రిక్ విక్టరీ దక్కితే మరింత బలంగా దూసుకుని పోవడానికి ఆస్కారం ఏర్పడుతుందని అంటున్నారు. అయితే ఈసారి తాము తప్పకుండా గెలుస్తామని కాంగ్రెస్ అంటోంది. ఆ పార్టీ అసలు ఫలితాల మీదనే నమ్మకం పెట్టుకుంది బీజేపీ ఇంటికి తాము అధికారంలోకి అని అస్సాం కాంగ్రెస్ నేతలు గట్టిగా బల్లగుద్దుతున్నారు. దాంతో మే 4న వచ్చే ఫలితాల మీద ఉత్కంఠ అయితే పెరిగిపోతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.