ఎలక్షన్ కోసం 56 ఏళ్లకు పెళ్లి... టిక్కెట్ దక్కిందా?

ఎన్నికల వేళ అఫిడవిట్ లు, హామీలూ, ప్రచారాలు ఇలా చాలా విషయాల్లో ఎన్నో రకాల సిత్రాలు చోటు చేసుకుంటాయనేది తెలిసిన విషయమే

Update: 2024-05-09 05:49 GMT

ఎన్నికల వేళ అఫిడవిట్ లు, హామీలూ, ప్రచారాలు ఇలా చాలా విషయాల్లో ఎన్నో రకాల సిత్రాలు చోటు చేసుకుంటాయనేది తెలిసిన విషయమే. ఇందులో భాగంగా వందల కోట్లు ఉండి కారు లేని వారుంటారు.. తన భార్యకు, తల్లి కోట్ల రూపాయల అప్పులు ఉన్నవారూ ఉంటారు.. ఇలా రకరకాలా సిత్రాలు తెరపైకి వస్తుంటాయి. ఈ క్రమంలో అనూహ్యంగా ఎలక్షన్ లో టిక్కెట్ కోసం జరిగిన ఒక పెళ్లి తెరపైకి వచ్చింది.

అవును... బీహార్ లోని నవాదా జిల్లాలోని కోనన్ పుర్ గ్రామానికి చెందిన అశోక్ మహతా (56) అనే వ్యక్తి.. షేక్ పురా జేడీయూ ఎమ్మెల్యే రణధీర్ కుమార్ సోనీపై హత్యాయత్నం ఆరోపణలతో పాటుగా.. జైలు గోడలు బద్దలుగొట్టిన కేసులోనూ నేరస్థుడిగా ఉన్నాడు. ఫలితంగ... సుమారు 17 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు. ఈ క్రమంలో గత ఏడాదిలోనే జైలు నుంచి విడుదలయ్యాడు.

ఇలా సుమారు 17 ఏళ్ల పాటు జైలు జీవితం అనుభవించిన అశోక్ మహతాకూ రాజకీయాల్లోకి రావాలని అనిపించిందంట. ప్రజాసేవ చేయాలని పరితపించిపోవడం మొదలుపెట్టాడంట. ఇందులో భాగంగా లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసి పార్లమెంట్ కు వెళ్లాలని ఫిక్సయ్యాడంట. అయితే చట్టప్రకారం అది సాధ్యం కాకపోవడంతో... లాలూ ప్రసాద్ యాదవ్ ని కలిసి పరిష్కారం అడిగారంట.

దీంతో... తనదైన రాజకీయ, సామాజిక అవగాహన, అనుభవంతో స్పందించిన లాలూ ప్రసాద్ యాదవ్... అశోక్ కు ఒక కీలక సలహా ఇచ్చారంట. ఇందులో భాగంగా నీకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాసం లేదు కాబట్టి.. పెళ్లి చేసుకుని నీ భార్యను ఎన్నికల్లో నిలబెట్టాలని సూచించారంట. దీంతో... లాలూ ప్రసాద్ యాదవ్ సూచన మేరకు పెళ్లి చేసుకోవాలని ఫిక్సయ్యారంట మహతా.

Read more!

అనుకున్నదే తడవుగా... లాలూ సూచనలతో పాట్నా భక్తియార్ పుర్ లోని కరౌటా జగదాంబ ఆలయంలో తన మద్దతుదారుల సమక్షంలో అశోక్ మహతా.. అనితా దేవి (46) అనే మహిళను వివాహం చేసుకున్నాడట. ముంగేర్ బరియార్ పూర్ గ్రామానికి చెందిన ఆమె గతంలో ఢిల్లీలో పనిచేసేదని చెబుతున్నారు. ఇప్పుడు ఆమె అశోక్ మహతాకి భార్య అవ్వడంతో ఎంపీగా బరిలోకి దిగుతున్నారు!

ఇందులో భాగంగా అశోక్ మహత తన భార్యను ముంగేర్ లోక్ సభ స్థానం నుంచి ఆర్జేడీ అభ్యర్థిగా పోటీలోకి దింపారు. మరోపక్క ఇదే స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ, జేడీ(యూ) నేత లాలన్ సింగ్ పోటీచేస్తున్నారు. దీంతో... ఈ పోటీ ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో... ఈ గ్యాంగ్ స్టర్ వివాహ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది!

Tags:    

Similar News