అసద్ కొత్త నినాదం.. బాబు.. పవన్ ను ఓడిద్దాం?

కేవలం మతం ఆధారంగా రాజకీయాలు చేసే అసదుద్దీన్ ఓవైసీ.. ఏపీలోని ముస్లింలకు అయినా ఏమైనా చేశారా?అన్నది ప్రశ్న.;

Update: 2025-07-01 07:30 GMT

కొందరు అధినేతల తీరు భిన్నంగా ఉంటుంది. ఏపీ ప్రయోజనాలు.. ఏపీ అవసరాలు పట్టవు. వ్యక్తిగత ఎజెండాను అమలు చేసేందుకు మాత్రమే ఏపీ ప్రజలు గుర్తుకు వస్తారు. ఆ కోవలోకే వస్తారు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓఎవైసీ. విభజన వేళ ఏపీ పట్టని ఆయనకు.. ఇప్పుడు హటాత్తుగా ఏపీ గుర్తుకు వస్తోంది. అంతేకాదు.. చంద్రబాబు.. పవన్ కల్యాణ్ నేత్రత్వంలోని కూటమి సర్కారును ఓడించటమే తన లక్ష్యమంటూ కొత్త నినాదాన్ని తెర మీదకు తీసుకొస్తున్నారు.

విభజన వేళ ఏపీ ప్రయోజనాలు.. విభజన తర్వాత ఏపీ పడుతున్న ఇబ్బందుల గురించి జాతీయ స్థాయిలో ఒక్కసారంటే ఒక్కసారి కూడా మాట్లాడని అసదుద్దీన్ కు.. ఏపీ గురించి.. ఏపీ ప్రజల గురించి.. ఏపీరాజకీయాల గురించి మాట్లాడే నైతిక హక్కు ఉంటుందా? అన్నది ప్రశ్న. తాజాగా కర్నూలులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన ఓవైసీ.. వక్ఫ్ బోర్డు బిల్లుకు మద్దతు ఇచ్చి మైనార్టీలను చంద్రబాబు మోసం చేసినట్లుగా మండిపడ్డారు.

టీడీపీలో పని చేస్తున్న ముస్లింలు.. ప్రజాప్రతినిధులు.. నాయకులు బయటకు రావాలన్న అసద్.. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం వక్ఫ్ బోర్డు సవరణల్ని వ్యతిరేకించినట్లుగా పేర్కొనటం గమనార్హం. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు.. ఏపీలో వచ్చే ఏ ఎన్నికల్లో అయినా టీడీపీ.. జనసేన.. బీజేపీ కూటమిని ఓడించాలంటూ పిలుపునిచ్చారు.

కేవలం మతం ఆధారంగా రాజకీయాలు చేసే అసదుద్దీన్ ఓవైసీ.. ఏపీలోని ముస్లింలకు అయినా ఏమైనా చేశారా?అన్నది ప్రశ్న. ఆయన చేతిలో పవర్ లేనప్పుడు ఏం చేయగలడని కొందరు ప్రశ్నించొచ్చు. ఆ మాటకే వద్దాం. కరోనా టైంలో ఏపీ నుంచి హైదరాబాద్ కు వైద్య సాయం కోసం వస్తున్న వారిని సరిహద్దుల్లో అడ్డుకున్న వేళ.. మానవత్వంతో అలా చేయకూడదని ఎందుకు మాట్లాడలేదు? అప్పట్లో అసద్ కు జానీ జిగర్ లాంటి కేసీఆర్ కు ఎందుకు చెప్పలేదు? అది కూడా ఎందుకు.. ఏపీకి చెందిన ముస్లింలు ఎవరికైనా వైద్య సాయం అవసరమైతే.. తన ఆసుపత్రుల్లో వైద్యం చేస్తానని ఎందుకు ప్రకటించలేదు?

సాయం చేసేందుకు చేతులు మాత్రమే కాదు.. మాట కూడా రాని అసద్ ను ఏపీలోని మైనార్టీ వర్గాలు నమ్మాలా? ఈ విషయాన్ని ఏపీకి చెందిన మైనార్టీలు నిలదీసి ప్రశ్నించాలి కదా? తన దరిద్రపుగొట్టు రాజకీయాల్ని ఏపీలోని మైనార్టీల మీద ప్రయోగించే అసద్ లాంటోళ్లను అడ్డుకోవాల్సి అవసరం ఉంది. ఈ విషయంపై కూటమి సర్కారు సైతం సీరియస్ గా ఆలోచించాల్సిందే. ఏపీ మైనార్టీల మనసుల్లో విషాన్ని నింపే అసద్ లాంటోళ్లను అడ్డుకోవాల్సిందే.

Tags:    

Similar News