సీఏఏ అమలుపై ఢిల్లీ సీఎం అరవింద కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు

తాజాగా అదే బాటలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిలిచారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం సహేతుకంగా లేదని కుండ బద్దలు కొట్టారు.

Update: 2024-03-13 10:56 GMT

సార్వత్రిక ఎన్నికలు సమీస్తున్న తరుణంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం సీఏఏ. సిటిజన్ షిప్ అమండ్ మెంట్ ఆక్ట్ ను అంత ఆదరబాదరగా తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందని పలువురు ప్రశ్నిస్తున్నారు. పలు రాష్ట్రాల సీఎంలు సీఏఏను వ్యతిరేకిస్తున్నారు. తాము దాన్ని అమలు చేయమని స్పష్టం చేస్తున్నారు. తాజాగా అదే బాటలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిలిచారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం సహేతుకంగా లేదని కుండ బద్దలు కొట్టారు.

సీఏఏ ఉద్దేశం ఏమిటి?

సీఏఏ అమలు ఉద్దేశం ఏమిటి? ఎందుకు దీన్ని ఆమోదించారంటే దీనిపై ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల వేళ విజయం సాధించాలని వారి ఓట్లు పొందాలని బీజేపీ పథకం రచించినట్లు చెబుతున్నారు. బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్గనిస్థాన్ దేశాల్లో మైనార్టీలు దాదాపు 2.5 కోట్ల మంది నుంచి 3 కోట్ల మంది వరకు ఉన్నారని అంచనా. వారిని ఇక్కడకు తీసుకొచ్చి మన పౌరసత్వం ఇస్తే వారి ఉపాధి అవకాశాలు మనమే కల్పించాల్సిన అవసరం ఏర్పడుతుంది.

Read more!

నిరుద్యోగ నీడలో..

ఇప్పటికే దేశం నిరుద్యోగ సమస్యతో బాధపడుతుంటే ఇప్పుడు కొత్తగా వారిని తీసుకొచ్చి ఏం చేస్తుంది. ఎవరికి ఉపాధి చూపిస్తుంది. ఎవరి బతుకులను తాకట్టు పెడుతుంది. ఇది సాధ్యం కాని సమస్య. కానీ ఓట్ల కోసం బీజేపీ వేస్తున్న ఎత్తుగడగా అభివర్ణిస్తున్నారు. ఈ బిల్లు అమలు చేస్తే మన దేశం ఇంకా పలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే ఉన్న సవాళ్లతో సతమతమవుతుంటే కొత్తగా సమస్యలు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నిస్తున్నారు.

ముఖ్యమంత్రుల ఆగ్రహం

కేరళ, పశ్చిమబెంగాల్, ఢిల్లీ రాష్ట్రాల సీఎంలు పినరయి విజయన్, మమతా బెనర్జీ, అరవింద కేజ్రీవాల్ సీఏఏ అమలుపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. తాము ఆ చట్టాన్ని అమలు చేయమని తేల్చారు. ఈ నేపథ్యంలో బీజేపీ సీఏఏ అమలుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియడం లేదు. సున్నితమైన సమస్యను ప్రజలపై రుద్దుతూ వారి మనోభావాలను దెబ్బతీయడమే పనిగా పెట్టుకుందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

కింకర్తవ్యం?

బీజేపీ తీసుకొచ్చిన చట్టం సీఏఏ అమలు సాధ్యం కాదని తేలిపోయింది. దీంతో ఈ చట్టం అమలుపై ప్రత్యామ్నాయ మార్గాలేవైనా చూస్తుందా? దేశ ప్రజల నెత్తిన భారం మోపే కుట్రలో భాగంగా ఇలాంటి చట్టాలు తీసుకురావడం కొత్తేమీ కాదు. కానీ ప్రజల మనసులను గుర్తించి తెచ్చే చట్టాలు మనుగడ సాధిస్తాయి కానీ ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలను ప్రజలు హర్షించరు. సీఏఏ చట్టం అమలు ఆచరణ సాధ్యం కాదని ఈపాటికి తెలిసిపోయిందని పలువురు భావిస్తున్నారు.

Tags:    

Similar News