• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఆల్ట్‌ మన్‌, బ్రాక్ మన్ @...

ఆల్ట్‌ మన్‌, బ్రాక్ మన్ @ మైక్రోసాఫ్ట్... సత్యనాదేళ్ల కీలక వ్యాఖ్యలు!

| అవును... ఆల్ట్‌ మన్‌, బ్రాక్‌ మన్‌ కలిసి మైక్రోసాఫ్ట్‌ ఏఐ టీం కు నేతృత్వం వహించనున్నట్లు సత్య నాదెళ్ల పేర్కొన్నారు

By - Tupaki Desk
Update: 2023-11-20 12:23 GMT

ఓపెన్‌ ఏఐ నుంచి ఉద్వాసనకు గురైన శాం ఆల్ట్‌ మన్‌, ఆయనతో పాటు ఓపెన్‌ ఏఐ నుంచి బయటకు వచ్చిన గ్రెగ్‌ బ్రాక్‌ మన్‌ లపై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కీలక ప్రకటన చేశారు. ఇందులో భాగంగా... ఆల్ట్‌ మన్‌ తమ కంపెనీ కొత్త కృత్రిమ మేధ పరిశోధన బృందంలో చేరనున్నారని వెల్లడించారు. అదేవిధంగా... గ్రెగ్‌ బ్రాక్‌ మన్‌ సైతం మైక్రోసాఫ్ట్‌ తో కలిసి పనిచేయనున్నట్లు తెలిపారు. దీంతో ఈ అంశం టెక్ బిజినెస్ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

అవును... ఆల్ట్‌ మన్‌, బ్రాక్‌ మన్‌ కలిసి మైక్రోసాఫ్ట్‌ ఏఐ టీం కు నేతృత్వం వహించనున్నట్లు సత్య నాదెళ్ల పేర్కొన్నారు. ఈ సందర్భంగా... వారి సక్సెస్ కి కావాల్సిన వనరులు సమకూర్చేందుకు తాము వేగంగా చర్యలు చేపడతామని ఆన్ లైన్ వేదికగా వెల్లడించారు. దీంతో... ఓపెన్‌ ఏఐ లో అతిపెద్ద వాటాదారుగా ఉన్న మైక్రోసాఫ్ట్‌... అదే సంస్థ నుంచి ఉద్వాసనకు గురైన వారినికి అవకాశం ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఈ పరిణామాల నేపథ్యంలో ఓపెన్‌ ఏఐ సీఈఓగా శాం ఆల్ట్‌ మన్‌ స్థానంలో ట్విచ్‌ సహ వ్యవస్థాపకుడు ఎమ్మెట్‌ షియర్‌ ను నియమించినట్లు తెలుస్తుంది. దీంతో... ఎమ్మెట్‌ షియర్ సహా ఓపెన్‌ ఏఐ కొత్త నాయకత్వంతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సత్య నాదెళ్ల ప్రకటించారు. ఓపెన్‌ ఏఐతో తమ భాగస్వామ్యం కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చారు.

మరోవైపు వీడియో స్ట్రీమింగ్ సైట్‌ ట్విచ్‌ సహ వ్యవస్థాపకుడు ఎమ్మెట్‌ షియర్‌ ను కొత్త సీఈఓగా ఓపెన్‌ ఏఐ బోర్డు నియమించడానికి ముందు... ఆల్ట్‌ మన్‌ ను తొలగించిన వెంటనే మిరా మురాటిని నియమించిన సంగతి తెలిసిందే. అయితే, ఆమె కూడా ఆల్ట్‌ మన్‌ కు మద్దతు ప్రకటించడంతో తక్షణమే ఎమ్మెట్‌ షియర్‌ ను ఆ పదవిలోకి తీసుకురావడం ఓపెన్‌ ఏఐకి అనివార్యమైంది!

ఈ నేపథ్యంలో ఓపెన్‌ ఏఐ సీఈఓగా శాం ఆల్ట్‌ మన్‌ ను తిరిగి తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు స్పష్టమైందనే భావించాలి. వాస్తవానికి ఆల్ట్ మన్ ఓపెన్ ఏఐ లోకి తిరిగి రావడానికి సిద్ధంగానే ఉన్నానంటూనే.. కండిషన్స్ అప్లై అని అన్నారని కథనాలొచ్చాయి. దీంతో ఆ కండిషన్స్ కి కొంతమంది బోర్డు సభ్యులు అంగీకరించలేదని.. దీంతో ఆల్ట్‌ మన్‌ పునరాగమనం అనే టాపిక్ క్లోజ్ అయిపోయిందని అంటున్నారు!

We remain committed to our partnership with OpenAI and have confidence in our product roadmap, our ability to continue to innovate with everything we announced at Microsoft Ignite, and in continuing to support our customers and partners. We look forward to getting to know Emmett…

— Satya Nadella (@satyanadella) November 20, 2023
Tags:    
  • Samaltman 
  • Satyanadella 
  • Microsoft 
  • Openai 
  • Artificialintelligence 
  • Openaiceo 

Similar News

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

Copyright @2026

Powered by Blink CMS