• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  యాపిల్ కు చైనా సెగ... 16...

యాపిల్ కు చైనా సెగ... 16 లక్షల కోట్ల రివేంజ్ ఇది!

| అవును... హీరో, విలన్ కొట్టుకుని మధ్యలో కమెడియన్ ని చంపేసినట్లు ఇప్పుడు అమెరికా – చైనా ల మద్య సాగుతున్న కోల్డ్ వార్ లో యాపిల్ నలిగిపోతుందని తెలుస్తుంది.

By - Tupaki Desk
Update: 2023-09-09 00:30 GMT

ఎదురుపడినప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం, భుజాలు తట్టుకుని అభినందించుకోవడం, ఫోటోలకు నవ్వుతూ ఫోజులివ్వడం వరకూ బాగానే ఉంటుంది కానీ... లోపల మాత్రం ఒకరిపై ఒకరు కుతకుత లాడిపోతుంటారంటూ కామెంట్లు వినిపిస్తుంటాయి. అవి ఏయే దేశాల గురించి అన్నది తెలిసిందే. అగ్రరాజ్యం అమెరికా - మన పొరుగుదేశం చైనా గురించి! ప్రస్తుతం ఈ దేశాల మధ్య రివేంజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అయితే ఈ మధ్యలో యాపిల్ సంస్థ నలిగిపోతుంది.

అవును... హీరో, విలన్ కొట్టుకుని మధ్యలో కమెడియన్ ని చంపేసినట్లు ఇప్పుడు అమెరికా – చైనా ల మద్య సాగుతున్న కోల్డ్ వార్ లో యాపిల్ నలిగిపోతుందని తెలుస్తుంది. ఫలితంగా గతంలో ఎన్నడూ లేనంతగా షేర్ విలువ పడిపోతుందని, ఇదే సమయంలో యాపిల్ లో పెట్టుబడి పెట్టినవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు.

వివరాళ్లోకి వెళ్తే… ఈ ఏడాది తన మిత్రదేశాలైన జపాన్‌, నెదర్లాండ్స్‌ తో కలిసి చైనాకు చిప్‌ టెక్నాలజీ ఎగుమతులను అమెరికా కంట్రోల్ చేసింది. దీనికి రివేంజ్ గా తమదేశం నుంచి పశ్చిమ దేశాలకు సరఫరా అయ్యే రెండు కీలక పదార్థాల ఎగుమతులను చైనా నిలువరించింది. ఇదే సమయంలో దేశీయ చిప్‌ పరిశ్రమను బలోపేతం చేయడానికి ఏకంగా 40 బిలియన్‌ డాలర్లను కేటాయించింది.

ఇదే సమయంలో అగ్రరాజ్యంపై మరింత కక్ష గట్టిన చైనా... తాజాగా ఐఫోన్ - 15 విడుదల నేపథ్యంలో మరో భారీ షాక్ ఇచ్చింది. ఇందులో భాగంగా... సెప్టెంబర్‌ 12న ఐఫోన్‌ - 15 విడుదలకు ముందు యాపిల్‌ పెట్టుబడిదారుల్లో భయాల్ని రేకెత్తించే నిర్ణయాలు తీసుకుంటుంది. దీంతో... యాపిల్ సంస్థ షేర్లు కేవలం రెండు రోజుల్లో 200 బిలియన్‌ డాలర్ల (రూ.16.63 లక్షల కోట్లు) మేర విలువ కోల్పోయాయి.

దానికి కారణం... ఇటీవల చైనాలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ ఆఫీసు పనులకు యాపిల్‌ ఐఫోన్లు సహా ఇతర ఏ విదేశీ బ్రాండ్‌ ఫోన్లూ వాడొద్దని సూచించినట్లు వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీంతో... త్వరలో ప్రభుత్వ ఆధీనంలోని ఇతర కంపెనీల ఉద్యోగులు కూడా యాపిల్‌ ఫోన్లను తీసుకురాకూడదని ఆదేశించే అవకాశం ఉందంటూ కథనాలు వెలువడటం మొదలయ్యాయి.

దీంతో యాపిల్‌ కు ఉన్న అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన చైనా... సుమారు యాపిల్ మొత్తం ఆదాయంలో 18 శాతం ఇచ్చే చైనా... ఉన్నఫలంగా ఇలాంటి నిర్ణయం తీసుకునే సరికి యాపిల్ ఒక్కసారిగా భారీగా 200 బిలియన్‌ డాలర్ల మేర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

మరోపక్క ఇటీవల చైనాకు చెందిన హువావే సంస్థ అత్యాధునిక మేట్‌ 60 ప్రో మొబైల్ ఫోన్‌ ను ఆవిష్కరించింది. దీనిలో చైనా తయారు చేసిన 5జీ కిరిన్‌ 9000ఎస్‌ ప్రాసెసర్‌ ను వాడింది. దీంతో... ఈ పరిణామం చైనా టెక్నాలజీ పరిశ్రమలో మేలిమలుపుగా నిపుణులు పేర్కొంటున్నారు. ఫలితంగా... ఇది కూడా యాపిల్‌ షేర్ల పతనానికి కారణమై ఉంటుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

కాగా... యాపిల్‌ ఫోన్ల ఉత్పత్తి సంస్థ ఫాక్స్‌ కాన్‌ కు చైనాలో అతిపెద్ద తయారీ యూనిట్‌ ఉన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో వాల్‌ స్ట్రీట్‌ లో అతిపెద్ద మార్కెట్‌ విలువ ఉన్న కంపెనీల్లో యాపిల్‌ కూడా ఒకటి. దీని మార్కెట్‌ విలువ సుమారు 2.8 ట్రిలియన్‌ డాలర్లు!

Tags:    
  • America 
  • China 
  • Coldwar 
  • Apple 
  • Iphone 
  • Chinamarket 
  • Sharevalue 
  • Chiptechnology 
  • Billiondollors 
  • Japan 
  • Netherlands 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS