ఏపీ కొత్త రికార్డు...భారీగా వృద్ధి రేటు జోరు

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ళకు పై దాటింది. ఈ క్రమంలో పన్నుల వసూళ్ళు గతానికి కంటే కూడా ఇపుడు అధికంగా వసూలు అవుతున్నాయి.

Update: 2026-09-01 23:30 GMT

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ళకు పై దాటింది. ఈ క్రమంలో పన్నుల వసూళ్ళు గతానికి కంటే కూడా ఇపుడు అధికంగా వసూలు అవుతున్నాయి. ఏ నెలకు ఆ నెలకు వాటిలో పెరుగుదల కనిపిస్తోంది. దానికి కారణాలు ఉన్నాయి. ప్రభుత్వం తీసుకున్న చర్యలు టెక్నాలజీని జోడించి మరీ పన్నుల వసూలులో జోరు పెంచడంతో ఇది సాధ్యపడుతోంది అని అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేవలం ఒకే ఒక్క నెల ఆగస్టులో కూటమి ప్రభుతం పన్నుల రాబడిలో దూకుడునే ప్రదర్శించింది. తాజాగా వచ్చిన లెక్కలు చూస్తే వృద్ధి రేటులో కొత్త అంకెలను నమోదు చేసి మరీ శభాష్ అనిపించింది. ఆ వివరాలు చూస్తే ఇలా ఉన్నాయి.

అధికంగా వసూళ్ళు :

ఇదిలా ఉంటే నిన్నటితో ముగిసిన ఆగ‌స్టులో 18.05 శాతం వృద్ధి న‌మోదు చేయడం ద్వారా ఏపీలో కూటమి ప్రభుత్వం ఆశాజనకమైన పరిస్థితిని కళ్ల ముందు ఉంచింది. ఈ ధోరణి ఆర్థిక రంగానికి చోదక శక్తిగా పనిచేసి రానున్న కాలంలో మరిన్ని కొత్త అంకెల నమోదుకు కూడా దారి తీసే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఇక ఒక్కసారి కనుక విశ్లేషించుకుంటే గ‌త ఏడాది ఇదే ఆగ‌స్టు నెల‌లో రూ.21,558.09 కోట్ల ప‌న్నుల రాబ‌డితో ఏపీ ఉంది. ఈసారి దానికి అదనంగా మరో నాలుగు వేల కోట్లకు పైగా వసూళ్ళు అందుకుంది. ఆ విధంగా ఈ ఏడాది ఇదే ఆగ‌స్టులో రూ.25,449.80 కోట్ల ఆదాయం లభించింది.

నిక‌ర వ‌సూళ్ల‌లోనూ జోరు :

ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే నికర వసూళ్లలోనూ 18 శాతం వృద్ది రేటు నమోదు చేయడం. దాంతో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్థిక వృద్ధి భారీగా పెరగడమే కాకుండా ఒక దారిలో పడింది అని అంటున్నారు. అదే విధంగా ఈ విషయంలో వాణిజ్య‌ప‌న్నుల శాఖ సాంకేతిక పరంగా తీసుకున్న చ‌ర్య‌లు పూర్తిగా మంచి ఫలితాలు ఇస్తున్నాయని చెబుతున్నారు. వాణిజ్య ప‌న్నుల శాఖ‌లో విప్త‌వాత్మ‌కంగా ఏఐ ఆధారిత స్క్రూటినీ కూటమి ప్రభుత్వం ప్ర‌వేశ‌పెట్టింది. దాంతో పాటు ప‌న్నుల చెల్లింపు విధానాన్ని మ‌రింత స‌ర‌ళ‌త‌రం చేయ‌డంతోనే ఆదాయం భారీగా పెరుగుతోంది అని అంటున్నారు.

సాంకేతిక సంస్కరణలు :

ఏపీలో పన్నుల వసూళ్లలో పారదర్శకత పెంచడానికి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్క్రూటినీతో పాటు అధునాతన సాంకేతిక పద్ధతులు వ్ల్లనే .ఆర్థిక పురోగతి సాధ్యపడింది అని అంటున్నారు. అంతే కాకుండా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న అనేక చర్యల మూలంగా రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు వేగంగా పుంజుకోవడం జరిగింది అని అంటున్నారు. అలాగే పన్ను ఎగవేతలను అరికట్టడం పన్ను చెల్లింపుదారులలో మెరుగైన క్రమశిక్షణ తీసుకురావడం మరో ముఖ్య కారణంగా చెబుతున్నారు. ఈ విధంగా ఆదాయాల పెరుగుదలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు మౌలిక వసతుల కల్పనకు మరింత ఊతం ఇవ్వనుందని భావిస్తున్నారు

Tags:    

Similar News