రాజ్య‌స‌భ బాట‌లో ఎస్సీలు.. చంద్ర‌బాబు ఏం చేస్తారో ..!

దేశ‌వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 24 రాజ్య‌స‌భ స్థానాల ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ వ‌చ్చేసింది. ఏపీలోనూ నాలుగు స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

Update: 2026-05-22 10:30 GMT

దేశ‌వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 24 రాజ్య‌స‌భ స్థానాల ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ వ‌చ్చేసింది. ఏపీలో నూ నాలుగు స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలోనే ఇద్ద‌రు కీల‌క ఎస్సీ నాయ‌కులు రాజ్య‌స‌భ రేసులో ముందున్నట్టు టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా నాలుగు స్థానాలు ఏపీ నుంచి భ‌ర్తీ అవుతుండ‌డంతో ఆశావాహుల ప్ర‌య‌త్నాలు ముమ్ముం చేశారు. వీటిలో ఒక‌టి ఆల్రెడీ క‌న్ఫ‌ర్మ్ అయింద‌న్న వాద‌న ఉండ‌గా.. మూడు స్థానాలలోనూ ఒక‌టి బీజేపీకి, ఒక‌టి జ‌న‌సేన‌కు ఇవ్వ‌డం కూడా ఖాయ‌మ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక‌, మిగిలేది.. ఒకే ఒక్క‌స్థానం. కానీ, ఈ ఒక్క స్థానానికి ప‌దుల సంఖ్య‌లో నాయ‌కులు పోటీ ప‌డుతున్నారు.

ఈ క్ర‌మంలో నాయ‌కుల ప‌రంగా పోటీ ఎలా ఉన్నా.. సామాజిక‌వ‌ర్గాల ప‌రంగా చూస్తే కూడా.. అంతే పోటీ నెల‌కొంది. బీసీల‌కు ఇవ్వాల‌ని.. బీసీల‌ను బ‌లోపేతం చేయాల‌ని ఆ వ‌ర్గం నాయ‌కులు డిమాండ్ చేస్తున్నారు. మ‌రోవైపు.. ఎస్సీలు కూడా ఇదే వాద‌న వినిపిస్తున్నారు. రాజ్య‌స‌భ‌కు ఇప్ప‌టి వ‌ర‌కు ఎస్సీల‌ను పంపించ‌లేద‌ని కొంద‌రు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో త‌మ‌కు ఛాన్స్ ఇవ్వాల‌ని ఆ వ‌ర్గం నాయ‌కులు కోరుతున్నారు.

వీరిలో ఎస్సీ సామాజిక‌ వ‌ర్గానికి చెందిన ఇద్ద‌రు కీల‌క నాయ‌కులు చంద్ర‌బాబును స్వ‌యంగా క‌లిసి..తమ వాద‌న‌ను వినిపించారు. వీరిలో గ‌తంలో రాజ్య‌స‌భ‌కు పోటీ చేసి ప‌రాజ‌యం పాలైన వ‌ర్ల రామ‌య్య కీల‌కంగా ఉన్నారు. వైసీపీ హ‌యాంలో జ‌రిగిన రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో వ‌ర్ల పోటీ చేశారు. కానీ, సంఖ్యా బ‌లం లేక పోవ‌డంతో ఆయ‌న ప‌రాజ‌యం పాల‌య్యారు. అప్ప‌టి నుంచి ఆయ‌న ఆశ పెట్టుకున్నార‌న్న‌ది వాస్త‌వం. దీంతో త‌న‌కు ఇప్పటికైనా ఛాన్స్ ఇవ్వాల‌ని కోరుతున్నారు.

ఇక‌, మ‌రో కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి కేఎస్ జ‌వ‌హ‌ర్‌. ఈయ‌న కూడా ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడే. దీంతో ఆయ‌న కూడా.. కోరుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో టికెట్ వ‌దులుకున్న ఈయ‌న‌.. తిరువూరులో కొలిక పూడి శ్రీనివాస్‌కు.. స‌హ‌కారం అందించారు. పైగా.. పార్టీని గెలిపించేందుకు.. పార్టీ అధినేత చెప్పింది చేశారు. ఆ త‌ర్వాత నామినేటెడ్ ప‌ద‌వి వ‌చ్చినా ఇప్పుడు రాజ్య‌స‌భ ఆశిస్తున్నారు. దీంతో త‌న విధేయ‌త‌కు వీర‌తాడు వేయాల‌ని ఆయ‌న కోరుకుంటున్నారు. నిజానికి ఇద్ద‌రూ అర్హులే. కానీ, ఉన్న పోటీని దృష్టిలో పెట్టుకుంటే..చంద్ర‌బాబు ఇప్పుడు ఉన్న ప‌రిస్థితిలో ఏమేర‌కు.. అవ‌కాశం ఇస్తార‌న్న‌ది చూడాలి.

Tags:    

Similar News