ఎవరికి వారే యమునా తీరే.. వైసీపీ తీరూ ఇంతే.. !
ఇప్పుడు ఆ 11 నియోజకవర్గాల్లో జగన్ నియోజకవర్గం పులివెందులను పక్కన పెడితే.. పది నియోజకవర్గా ల్లోనూ నాయకుల తీరు.. ఒకింత వివాదంగానే ఉందన్న సంకేతాలు వస్తున్నాయి.;
రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో 164 కూటమి పార్టీల నాయకులే ఉన్నారు. మిగిలిన 11 మంది మాత్రమే వైసీపీకి చెందిన నాయకులు ఉన్నారు. దీంతో రాష్ట్రంలో ఏ పని జరిగినా.. అది మంచైనా చెడైనా కూడా.. కూటమి పార్టీల ఎమ్మెల్యేలకే చెందుతుంది. అందుకే.. పదే పదే చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలను హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో బీజేపీ నాయకత్వం ఎలాంటి హెచ్చరికలు చేయడం లేదు. కానీ.. నాయకుల పనితీరును మాత్రం గమనిస్తున్నారు.
ఇక, జనసేన ఎమ్మెల్యేలపై కొన్ని వివాదాలు.. విమర్శలు వచ్చాయి. దీంతో పార్టీ నాయకత్వం నివేదికలు తెప్పించుకునే పనిచేపట్టిన విషయం తెలిసిందే. దీంతో జనసేనలో నాయకులు.. మార్పు దిశగా అడుగు లు వేస్తున్నారు. ఈ మూడు పార్టీల పరిస్థితి ఇలాఉంటే.. వైసీపీ లో నాయకులు ఇంకా జగన్ భజనలోనే ఆరి తేరుతున్నారు. ప్రధాన ప్రతిపక్షం హోదా ఇవ్వలేదన్న కారణంగా..జగన్ అసెంబ్లీకి రాకపోతే.. నాయకులు నియోజకవర్గాలను బాయికాట్ చేశారు.
ఇప్పుడు ఆ 11 నియోజకవర్గాల్లో జగన్ నియోజకవర్గం పులివెందులను పక్కన పెడితే.. పది నియోజకవర్గా ల్లోనూ నాయకుల తీరు.. ఒకింత వివాదంగానే ఉందన్న సంకేతాలు వస్తున్నాయి. నాయకులు ఎవరూ బయటకు రావడం లేదు. కనీసం పార్టీ కార్యకర్తలను కూడా పట్టించుకోవడం లేదు. జగన్ పిలుపునిస్తే.. ఆయా కార్యక్రమాలకు మొక్కుబడిగా హాజరు కావడంతోనే సరిపెడుతున్నారు. ఇది పార్టీకి మేలు చేసే కార్యక్రమం కాదని పలువురు చెబుతున్నా.. ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు.
ఇక, టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు కలివిడి సాగుతున్న నియోజకవర్గాలు పట్టుమని 10 కూడా కనిపించడం లేదని అంటున్నారు. ఆ పది నియోజకవర్గాల్లో మాత్రమే నాయకులు కలిసి ఉంటున్నారు. మిగిలిన చోట్ల మాత్రం ఎవరికి వారుగా ఉంటున్నారు. దీనిపై మూడు పార్టీలూ చర్చించుకుని పరిస్థితిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. కానీ, ఆ దిశగా అడుగులు వేస్తారా? అనేది చూడాలి. ప్రస్తుతం కర్నూలు, అనంతపురం, విజయవాడ సహా విశాఖలోనూ ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తుండడం గమనార్హం.