• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  తగ్గేదేలే.. సమయం...

తగ్గేదేలే.. సమయం వచ్చినప్పుడు సమాధానం చెప్తా : హోంమంత్రి అనిత స్ట్రాంగ్ రియాక్షన్

| దీంతో మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ విమర్శలు రేపిన కాక ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదని అంటున్నారు.

By - Tupaki Political Desk
Update: 2026-06-16 11:24 GMT

హోంమంత్రి అనితపై మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమరనాథ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. హోంమంత్రి అనితను మాత్రమే కాకుండా యావత్ మహిళాలోకాన్ని అవమానించేలా అమరనాథ్ విమర్శలు ఉన్నాయని కూటమి నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. ఇక ఈ అంశంపై మంగళవారం ఉప ముఖ్యమంత్రి పవన్ ట్వీట్ చేయగా, హోంమంత్రి అనిత కూడా ‘ఎక్స్’లో తన అధికారిక అకౌంట్ నుంచి మాజీ మంత్రి విమర్శలపై విరుచుకుపడుతూ పోస్ట్ పెట్టారు. దీంతో మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ విమర్శలు రేపిన కాక ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదని అంటున్నారు.

‘‘ఒక బహిరంగ సభలో, కెమెరా ముందు ఒక వైఎస్సార్‌సీపీ నాయకుడు నా గురించి అన్న మాటలు కేవలం నన్ను అవమానించడం మాత్రమే కాదు. రాజ్యాంగ పదవిలో ఉన్న ఒక మహిళను, ఒక దళితురాలిని అవమానించే లక్ష్యంతో చేసిన నీచమైన, కులతత్వ దాడి’’ అంటూ హోంమంత్రి అనిత ట్వీట్ చేశారు. మాజీ మంత్రి వాడిన భాష అవమానకరమైనదంటూ మండిపడ్డారు. ఇలాంటి సంస్కృతిని వైఎస్సార్‌సీపీ పెంచి పోషిస్తోందని విమర్శించారు. ‘‘ఒక మహిళ తన సొంత కష్టంతో, దృఢ సంకల్పంతో, ప్రజా సేవతో పైకి వచ్చినప్పుడు కొంతమంది పురుషులు ఇలాంటి దాడులు చేస్తారు’’ అంటూ ఆ ట్వీట్ లో హోంమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.

తనను రాజకీయంగా ఎదుర్కోలేక దూషణలు, బెదిరింపులకు పాల్పడతారన్నారని ధ్వజమెత్తారు. తన జీవితంలో ఇలాంటి దాడులను ఎన్నో చూశానని పేర్కొన్నారు. ఇలాంటి దాడులు తన సంకల్పాన్ని మరింత బలపరుస్తాయని స్పష్టం చేశారు. మాజీ మంత్రి చేసిన విమర్శలతో తన గొంతు నొక్కేయలేరని, ఎవరికీ తలవంచే రకం కాదని మంత్రి తేల్చిచెప్పారు. ఇలాంటి బెదిరింపులకు బెదిరేది లేదంటూ స్పష్టం చేశారు. తన ట్వీట్ లో మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ పేరు ఎక్కడా ప్రస్తావించకుండానే తనపై చేసిన వ్యాఖ్యలను ఎండగట్టే ప్రయత్నం చేశారు మంత్రి అనిత.

ఇక కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో హోంశాఖ సాధించిన పురోగతిపైనా మంగళవారం మంత్రి అనిత మీడియాతో మాట్లాడారు. ఈ సమయంలోనే మాజీ మంత్రి విమర్శలపై స్పందించాల్సిందిగా మీడియా ప్రతినిధులు కోరారు. అయితే ప్రభుత్వ విజయాలు, పోలీసుల గొప్ప పనితీరును చెప్పేందుకు తాను వచ్చానని, ఇలాంటి సందర్భంలో విజ్ఞత లేని వారి కోసం మాట్లాడి తనను తాను తగ్గించుకోలేనని వ్యాఖ్యానించారు. కానీ, ఆయన మాటలపై కచ్చితంగా స్పందిస్తానని, ఆ సమయం దగ్గరలోనే ఉందని అనిత స్పష్టం చేశారు.

వైసీపీ ఎదురుదాడి

కాగా, కూటమి నేతలు, మంత్రులు మాజీ మంత్రి గుడివాడను టార్గెట్ చేయడంపై వైసీపీ రియాక్ట్ అయింది. ఆ పార్టీకి చెందిన మహిళా నేతలు ఈ విషయంపై వరుసగా స్పందిస్తూ హోంమంత్రి అనితపై మాటల దాడి ముమ్మరం చేస్తున్నారు. అనిత కంటే ముందుగా మంత్రి పదవి చేపట్టి ఆరు శాఖలను సమర్థంగా నిర్వహించిన మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ ను వాడు, వీడు అంటూ హోంమంత్రి వ్యాఖ్యానించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పదవులు శాశ్వతం కాదని హోంమంత్రి గుర్తుంచుకోవాలని, మాజీ మంత్రిపై అమర్యాదగా మాట్లాడటం మానేయాలని హితవుపలకారు. మొత్తానికి మాజీ మంత్రి అమరనాథ్ చేసిన కామెంట్లు రాష్ట్ర రాజకీయాల్లో సంచలన చర్చనీయాంశంగా మారాయని అంటున్నారు.


What a YSRCP leader said about me on camera, at a public meeting was not merely an insult. It was a vile, casteist attack aimed at humiliating a woman and a Dalit holding a constitutional office.

The language he used is so disgraceful that it cannot even be repeated in public.… pic.twitter.com/dm7znnCeS3

— Anitha Vangalapudi (@Anitha_TDP) June 16, 2026


Tags:    
  • andhrapradesh 
  • politics 
  • homeminister 
  • anitha 
  • ysrcp 
  • tdp 
  • pawankalyan 
  • politicalnews 
  • andhrapolitics 
  • warofwords 
  • gudivadaamarnath 

Similar News

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

నాన్న‌గారి ఆశ‌యాలు నెర‌వేరుస్తా: రాధా ఫ‌స్ట్ స్పీచ్‌

2026-11-04 13:00 GMT

నియంతలు ట్రంప్, నెతన్యాహు ఔట్ అట.. ‘సీజేపీ‘ నేతలు హ్యాపీ.. టార్గెట్ మోడీయేనా?

2026-11-04 12:57 GMT

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

2026-11-04 11:17 GMT

భారతీయులతో పెట్టుకున్నాడు.. ట్రంప్ అనుభవిస్తున్నాడు..

2026-11-04 10:57 GMT

టికెట్ ధ‌ర‌ల‌పై CM విజ‌య్ ముందు చూపు మనవాళ్ల‌కు ఏదీ?

2026-11-04 09:39 GMT

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల పోరు..!

2026-11-04 09:22 GMT

రాప్తాడు నిందితుడిపై కాల్పుల కేసులో కీలక పరిణామం

2026-11-04 09:14 GMT

ఎలా గెలవాలో చెప్పారు...జగన్ కంగ్రాట్స్ !

2026-11-04 09:06 GMT

Copyright @2026

Powered by Blink CMS