ఏపీలో 'ఎన్ ఎస్‌డీ' ఏర్పాటు చేస్తాం: పవన్ కల్యాణ్
ఏపీలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా(ఎన్ ఎస్‌డీ)ను ఏర్పాటు చేయనున్నట్టు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలి పారు.;
ఏపీలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా(ఎన్ ఎస్‌డీ)ను ఏర్పాటు చేయనున్నట్టు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలి పారు. దీని వల్ల ఔత్సాహిక యువతకు సినీ రంగంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు అవకాశం ఏర్పడుతుందని చెప్పా రు. ఫలితంగా తెలుగు సినీ రంగానికి నిపుణులపైన సాంకేతిక సిబ్బందితోపాటు.. నటులు కూడా లభిస్తారని, అప్పు డు తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచ స్థాయికి ఎదుగుతుందని వివరించారు. ఏపీలో ఎన్ ఎస్ డీని ఏర్పాటు చేసేందు కు తనకు ప్రత్యేక ప్రణాళిక ఉందన్న పవన్ కల్యాణ్.. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబుతో చర్చించనున్నట్టు తెలిపారు.
``ఏపీలో ఎన్ ఎస్‌డీ ఏర్పాటుతో అనేక మంది యువతకు తెలుగు సినీ పరిశ్రమలో ఉపాధి లభిస్తుంది. వారిలోని టాలెంట్ బయటకు వస్తుంది. సమాజం కూడా బాగుంటుంది.`` అని అన్నారు. కళలను ప్రోత్సహించేందుకు, కళా కారులను వెలుగులోకి తెచ్చేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తోందిన పవన్ కల్యాణ్ తెలిపారు. కళలు విలసిల్లిన చో ట... నేరాలు జరగవని తెలిపారు. అందుకే.. ఏపీలో ఎన్ ఎస్‌డీని ఏర్పాటు చేయడం ద్వారా కళలకు, కళాకారుల కు కూడా ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చేందుకు ప్రయత్నించనున్నట్టు తెలిపారు.
ఈ విషయంపై సీఎం చంద్రబాబుతో త్వరలోనే చర్చించి.. ఎన్ ఎస్ డీని అమరావతిలోనే ఏర్పాటు చేయించే ప్రయత్నం చేయనున్నట్టు వివరించారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న పవన్ కల్యాణ్.. శుక్రవారం జరిగిన ఉప రాష్ట్రపతి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. అనంతరం.. ఢిల్లీలోని జాతీయ నటనా పాఠశాలను ఆయన సందర్శిం చారు. తన గురువు సత్యాననంద్ అనేక సందర్భాల్లో ఎన్ ఎస్ డీ గురించి గొప్పగా చెప్పారని తెలిపారు. తాజాగా ఎన్ ఎస్ డీ సందర్శించిన తనకు.. మినీ ఇండియాలో పర్యటించిన అనుభూతి కలిగిందన్నారు. ఇలాంటిదే అమరావతిలో ఏర్పాటు చేసే యోచన ఉందని.. దీనిపై సీఎంతో చర్చిస్తానని.. అన్నారు.