ఒక్కరోజు లోనే మూడు వేల కోట్లు జనాలకు...గ్రేట్ కదా !

ప్రపంచంలో అస్థిరత్వం ఉంది. యుద్ధ వాతావరణం ఉంది. ఆర్థిక సంక్షోభం ఉంది. ఆర్థిక మాంద్యం వార్తలు కూడా ఉన్నాయి. అయితే కూడా భారత్ మాత్రం వీటిని తట్టుకుని ముందుకు ధీటుగా సాగుతోంది.

Update: 2026-07-18 02:53 GMT

ప్రపంచంలో అస్థిరత్వం ఉంది. యుద్ధ వాతావరణం ఉంది. ఆర్థిక సంక్షోభం ఉంది. ఆర్థిక మాంద్యం వార్తలు కూడా ఉన్నాయి. అయితే కూడా భారత్ మాత్రం వీటిని తట్టుకుని ముందుకు ధీటుగా సాగుతోంది. భారత్ లో ఆర్థిక సంక్షోభం ఉంది అని విమర్శలు చేసేవారికి గట్టి జవాబు అన్నట్లుగా ఒకే ఒక్క రోజులో ఏకంగా మూడు వేల కోట్ల రూపాయలు పైగా రుణాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలసి పంపిణీ చేశాయి. ఇది నిజంగా గ్రేట్ అని అంటున్నారు.

రుణ వితరణలో హైలెట్ :

ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో కేంద్ర ఆర్థిక శాఖ ప్రభుత్వ రంగ బ్యాంకులు సంయుక్తంగా నిర్వహించిన మెగా రుణమేళా కార్యక్రమంలో భాంగా పెద్ద ఎత్తున రుణాల పంపిణీ జరిగింది. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్న ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లాలో ఒక లక్షా 3 వేల 246 మంది లబ్ధిదారులకు ఏకంగా 3 వేల 216 కోట్ల రూపాయల రుణాలను అందజేశారు. ఈ రుణ వితరణ లో భాగంగా 15 వేల మంది డ్వాక్రా మహిళలకు 13,355 మంది పారిశ్రామికవేత్తలకు పెద్ద ఎత్తున రుణాలు పంపిణీ చేశారు.

గ్రామాలకు నేరుగా బ్యాంక్ సేవలు :

దేశంలోని ప్రతి గ్రామంలోనూ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు. తాను ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టే సమయానికి బ్యాంకులు ఎన్‌పీఏల సమస్యలతో ఇబ్బందుల్లో ఉండేవని ఆమె గుర్తు చేశారు. దాంతో చిన్న వ్యాపారులు అప్పులు దొరక్క తీవ్రంగా నష్టపోయేవారని అన్నారు. ఈ నేపధ్యంలో చిన్న వ్యాపారుల ఆర్థిక కష్టాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వమే గ్యారెంటీ ఇచ్చి బ్యాంకుల ద్వారా వారికి సులభంగా రుణాలు అందేలా పథకాలు తెచ్చిందని ఆమె అన్నారు. ఈ రోజున బ్యాంకులు స్వయంగా వ్యాపారుల చెంతకే వచ్చి రుణాలు ఇస్తున్నాయని అంటే ఇది గొప్ప ఆలోచన అన్నారు.

కేంద్రం ఆర్థిక ఊతం :

కేంద్రం ఆర్ధికంగా ఊతమిస్తూ ఏపీని ముందుకు నడిపిస్తోంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. కేంద్ర సహకారంతో అమరావతి, పోలవరం, విశాఖ ఉక్కు కర్మాగారం అభివృద్ధి బాట వంటి ఆకాంక్షలు నెరవేరాయని గుర్తు చేశారు. వీబీజీ రామ్ జీ కింద కేంద్రం నుంచి 7 వేల 707 కోట్ల రూపాయలు రాష్ట్రానికి వస్తుందని ఆయన లెక్క చెప్పారు. అలాగే . రాయలసీమను హార్టీ కల్చర్ హబ్ గా మార్చేందుకు కేంద్రం 40 వేల కోట్ల రూపాయల ఆర్ధిక సహకారం అందిస్తోందని తెలిపారు. ప్రైవేటు పెట్టుబడులతో కలిపి రాయలసీమ ప్రాంతాన్ని ఉద్యాన హబ్ గా మారుస్తామని అన్నారు. అంతే కాదు గత ప్రభుత్వం అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి రాష్ట్రానికి తిప్పలు తెచ్చిందని బాబు విమర్శించారు. కూటమి అధికారంలోకి వచ్చాకే ఆ రుణాల్ని కేంద్ర సహకారంతో రీ -షెడ్యూలు చేసి 1538 కోట్ల రూపాయలు ఆదా చేశామని చెప్పారు. రాష్ట్రాభివృద్ధిలో బ్యాంకులు భాగస్వామ్యం కావాలని బాబు కోరారు.

Tags:    

Similar News