వైసీపీకి అన్ని వైపులా బిగ్ ట్రబుల్స్ !

అదేంటో కానీ శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఏదీ అసలు కలసిరావడం లేదు అని అంటున్నారు. నాయకులు అనేకమంది ఉన్నా వారంతా ఇలాగే ఇబ్బందులో వివాదాలలో ఉంటున్నారు.

Update: 2026-07-18 02:53 GMT

అదేంటో కానీ శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఏదీ అసలు కలసిరావడం లేదు అని అంటున్నారు. నాయకులు అనేకమంది ఉన్నా వారంతా ఇలాగే ఇబ్బందులో వివాదాలలో ఉంటున్నారు. ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇప్పటికే సస్పెండ్ అయ్యారు. అలాగే మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పెద్దగా సౌండ్ చేయడం లేదు. మరో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అపుడపుడు మీడియా ముందుకు వస్తున్నారు. ఈ నేపధ్యంలో పెద్ద గొంతుకగా జిల్లాలో సీదరి అప్పలరాజు ఉన్నారు. ఆయనే ఎక్కువగా కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇపుడు ఆయనే చిక్కుల్లో పడ్డారు. దాంతో జిల్లా టీడీపీకి కూడా ఇది షాకింగ్ గా మారుతోంది అని అంటున్నారు. జిల్లాలో మూడు పార్టీలతో కూటమి పటిష్టంగా ఉంటే వైసీపీ మాత్రం ఎప్పటికపుడు ట్రబుల్స్ తో సతమతం అవుతోంది అని అంటున్నారు.

మాజీ మంత్రికి ఇరకాటం :

ఇదిలా ఉంటే వైసీపీకి చెందిన మాజీ మంత్రి సీదరి అప్పలరాజు ఇపుడు బిగ్ ట్రబుల్స్ లో పడ్డారు. అధికారంలో ఉన్నపుడు విపక్షంలోనూ దూకుడుగా వ్యవహరించే ఆయన ఇపుడు చిక్కుల్లో పడిపోయారు. దాంతో ఆయన చుట్టూ ఉచ్చు గట్టిగానే బిగుసుకుంటోంది అని అంటున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సీదరి అప్పలరాజు కి సన్ స్ట్రోక్ తగిలింది అని అంటున్నారు. తన కుమారుడు అతి వేగంగా నిర్లక్ష్యంగా బైక్ నడిపి ఏకంగా ఒకరి దుర్మరణానికి కారకుడు అయ్యారని అంటున్నారు. అయితే ఇక్కడ కుమారుడు చేసిన తప్పుని గుర్తించి వెంటనే పోలీసులకు అప్పగించి ఉంటే మాజీ మంత్రి పరువు గౌరవం అన్నీ నిలిచేవని ఇబ్బందులు పడేవారు కాదని అంటున్నారు. కానీ తన కుమారుడు అన్న ప్రేమతో ఆయన సాక్ష్యాల తారుమారుకు ప్రయత్నం చేశారు అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో ఇపుడు కొడుకుతో పాటు తండ్రికి కూడా ఈ బైక్ యాక్సిడెంట్ ఉచ్చుగా మారుతోంది అని అంటున్నారు.

ఆయన్ని అరెస్టు చేస్తారా :

ఇదిలా ఉంటే సీదరి అప్పలరాజుని అరెస్టు చేస్తారు అని ప్రచారం అయితే ఆయన సొంత నియోజకవర్గం పలాసలో గట్టిగా వినిపిస్తోంది. ఆయన సాక్ష్యాల తారుమారుకు ప్రయత్నించినట్టుగా ఆధారాలు అన్నీ పోలీసులు సేకరించారని అంటున్నారు. ఈ విధంగా స్పష్టంగా మ్యాటర్ ఉండడంతో సీదరిని కూడా అరెస్ట్ చేయవచ్చు అని అంటున్నారు. ఇక బైక్ యాక్సిడెంట్ కేసులో ఇప్పటికే సీదరి అప్పలరాజు కొడుకు ఆరవ్ వర్మను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఇక ఇపుడు మాజీ మంత్రి అప్పలరాజు మీద బీఎన్‌ఎస్‌లోని 61(2), 238, 240, 242, 249, 49 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు అని అంటున్నారు. ఈ సెక్షన్ల మేరకు ఆయనను అరెస్టు చేయవచ్చు అని అంటున్నారు

మౌనముద్రలో మాజీ మంత్రి :

ఇదిలా ఉంటే కుమారుడు బైక్ ని నడిపి ఒకరి ప్రాణం తీశారు అని పోలీసులు కేసు ఫైల్ చేసి అరెస్టు చేసిన ఉదంతం మీద సీదరి అప్పలరాజు అయితే ఇప్పటిదాకా ఎక్కడా మాట్లాడలేదు, ఆయన మౌనంగానే ఉంటున్నారు. మరో వైపు సీదరి పలాసలోనే ఉంటున్నారు అని చెబుతున్నారు. పోలీసులు కూడా ఆయన కదలికల మీద నిఘా పెట్టారు అని అంటున్నారు. ఈ కేసులో సీదరి అరెస్టు అని శుక్రవారం రోజంతా పలాసలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. దాంతో సీదరి న్యాయవాదులతో ఇదే విషయం మీద సంప్రదింపులు చేస్తున్నారు అని అంటున్నారు.

Tags:    

Similar News