• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నిందితులుగా ఆ ముగ్గురు.....

నిందితులుగా ఆ ముగ్గురు.. నేడో రేపో అరెస్టు కూడా..?

| ఏపీ లిక్కర్ స్కాంలో నిందితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. స్కాంలో మరో ముగ్గురికి కూడా పాత్ర ఉందని పేర్కొంటూ సిట్ పోలీసులు తాజాగా కోర్టులో మెమో దాఖలు చేశారు

By - Tupaki Desk
Update: 2025-05-06 12:47 GMT

ఏపీ లిక్కర్ స్కాంలో నిందితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. స్కాంలో మరో ముగ్గురికి కూడా పాత్ర ఉందని పేర్కొంటూ సిట్ పోలీసులు తాజాగా కోర్టులో మెమో దాఖలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ హయాంలో సీఎంవో కార్యదర్శిగా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, ఓఎస్డీ క్రిష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ ప్రతినిధి బాలాజీ గోవిందప్పలను నిందితులుగా చేర్చారు. కేసులో ఏ1 నిందితుడు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వాంగ్మూలంతో ఈ ముగ్గురు ఇరుక్కున్నారు. ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్లినా వారికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో వారిని నిందితుల జాబితాలో చేర్చుతూ మెమో దాఖలు చేశారు. అయితే పోలీసులు దాఖలు చేసిన మెమోను కోర్టు అంగీకరించాల్సివుంది.

ఏపీ లిక్కర్ స్కాంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసులో కీలక నిందితులుగా భావిస్తున్న సీనియర్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి వ్యక్తిగత సహాయకుడు క్రిష్ణమోహన్ రెడ్డి, బారతీ సిమెంట్ ప్రతినిధి బాలాజీ గోవిందప్పలను నిందితులుగా చేర్చారు. కేసు దర్యాప్తులో భాగంగా లిక్కర్ స్కాంలో కమీషన్ కింద వసూలు చేసిన మొత్తం ఈ ముగ్గురికి అందజేశామని ఇప్పటికే అరెస్టు అయిన నిందితులు వాంగ్మూలివ్వడంతో దర్యాప్త వీరి వరకు వచ్చి ఆగింది.

ఈ పరిస్థితుల్లో ఆ ముగ్గురు బెయిల్ కోసం ఏపీ హైకోర్టుతోపాటు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే రెండు చోట్ల వారికి ఎదురుదెబ్బ తగిలింది. అదేసమయంలో ప్రభుత్వం వారిని అరెస్టు చేసే చేసుకోవచ్చంటూ వెసులుబాటు కల్పించింది. ఇదే అనువుగా తీసుకున్న సిట్ అధికారులు సీనియర్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి ఏ31గా గుర్తించారు. అదేవిధంగా ఏ32గా జగన్ పీఏ క్రిష్ణమోహన్ రెడ్డి, ఏ33గా బాలాజీ గోవిందప్పలకు నంబర్లు కేటాయించారు. దీంతో ఈ ముగ్గురిని ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉందంటున్నారు.

ముందస్తు బెయిల్ కోసం ధనుంజయరెడ్డితోపాటు మిగిలిన నిందితులు దాఖలు చేసుకున్న పిటిషన్ పై రేపు (మే7 బుధవారం) ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. వారి పిటిషన్లపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు కూడా హైకోర్టును ఆదేశించింది. అదేసమయంలో 8న సుప్రీంకోర్టు కూడా ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారించనుంది. అయితే కోర్టు తీర్పు వచ్చే వరకు అరెస్టు చేయకుండా రక్షణ ఇవ్వనందున విచారణకు ముందే వారిని అరెస్టు చేస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ విచారణకు ముందే అరెస్టు చేస్తే ముందస్తు బెయిల్ పిటిషన్లు నిరర్థకమవుతాయని అంటున్నారు. ప్రధానంగా ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డిని అరెస్టు చేయాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సివుంది. ఈ ప్రక్రియకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున ఆయనకు ఇప్పట్లో ముప్పు ఉండదని అంటున్నారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి జగన్ ఓఎస్డీగా వ్యవహరించిన ఆయన వ్యక్తిగత సహాయకుడు క్రిష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ ప్రతినిధి బాలాజీ గోవిందప్ప భవిష్యత్తుపైనే ఆందోళన చెందుతున్నారు.

Tags:    
  • APLiquorScam 
  • IASDhanunjayaReddy 
  • Jagan 
  • BharathiCements 
  • PoliticalCorruption 
  • KrishnamohanReddy 
  • SITProbe 

Similar News

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

Copyright @2026

Powered by Blink CMS