పేదల కోసం ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం పేదలు మధ్యతరగతి వర్గాల సంక్షేమం కోసం మరో అడుగు ముందుకు వేసింది.

Update: 2026-05-13 03:52 GMT

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం పేదలు మధ్యతరగతి వర్గాల సంక్షేమం కోసం మరో అడుగు ముందుకు వేసింది. వారికి క్రమం తప్పకుండా అన్ని సంక్షేమ పధకాలు అందాలన్న లక్ష్యంతో కొత్త విధానం దిశగా సాగుతోంది. అందులో భాగమే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు విధానంగా ఉంది. అర్హత కలిగిన ప్రతీ కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా కూటమి ప్రభుత్వం అందించే ప్రతీ పథకం ఆ కుటుంబంలో లబ్దిదారులకు అందుతుందా లేదా అన్నది ప్రభుత్వానికి తెలుస్తుందని అలాగే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ద్వారా ఆ కుటుంబం కూడా పూర్తి అవగాహన ఉంటుందని భావిస్తున్నారు.

ప్రతీ కుటుంబానికి సంక్షేమం :

రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతీ పేద మధ్యతరగతి కుటుంబానికి సంక్షేమం అందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. కూటమి ప్రభుత్వానికి అభివృద్ధి సంక్షేమం అన్నది రెండు కళ్ళుగా చెప్పారు. వాటిని బ్యాలెన్స్ చేస్తూ పాలన చేస్తున్నామని చెప్పారు అందుకే త్వరలో ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులను రూపొందిస్తున్నామని బాబు చెప్పారు. అదే విధంగా ఏపీలో ఉన్న అన్న క్యాంటీన్ల ద్వారా పేదలు మధ్యతరగతి తమ ఆకలి తీర్చుకుంటున్నారు అని బాబు అన్నారు.

పేదలకు డబ్బు ఆదా :

అక్కడ పరిస్థితుల మీద కూడా అధికారులు ప్రతీ రోజూ తెలుసుకోవాలని బాబు కోరారు రోజూ తనిఖీలు చేస్తూనే ఉండాలని అన్నారు. అన్న క్యాంటీన్ల విషయంలో ఒక్క ఫిర్యాదు కూడా రాకుండా చూసుకోవాలని ఆదేశించారు. పేదలు సంతృప్తిగా భోజనం చేసేలా ఏర్పాట్లు చేశామని బాబు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు డబ్బు ఆదా అవుతోందని బాబు చెప్పారు. వారికి మూడు పూటలా కడుపు నిండా ఆహారాన్ని అందిస్తున్నామని బాబు గుర్తు చేశారు.

తప్పు చేయాలంటే భయపడాలి :

రాష్ట్రంలో మహిళలపై నేరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఊపేక్షించవద్దని బాబు పోలీసు అధికారులకు సూచించారు. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడే వారికి కఠిన శిక్షలు పడేలా చూడాలని అన్నారు. తప్పు చేయాలంటేనే వారు వణికిపోయే పరిస్థితి రావాలని అన్నారు. ఆ పరిస్థితి వచ్చేలా పోలీసింగ్ ఉండాల్సిన అవసరం ఉందని బాబు అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో తగిన ఫోకస్ ఉండాలని ఏపీలో లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉండాలని కోరారు.

ఉద్యాన పంటల వల్ల లాభాలు :

ఇక రాష్ట్రంలోని రైతాంగానికి ఉద్యాన వన పంటల విషయంలో అవగాహన్ ఆసక్తి ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి కోరారు. ఉద్యాన పంటల వైపు రైతులను మళ్లించడంతో పాటు ఉద్యాన పంటల వల్ల కలిగే లాభాలను రైతులకు వివరించాలని అన్నారు. అదే విధంగా రైతులు తమ వ్యవసాయ క్షేత్రాలలో ఏయే పంటలు వేసుకోవాలనే అంశం మీద అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని బాబు కోరారు. వ్యవసాయంలో ఆధునిక పద్దతులను అవలంభించేలా రైతులలో మరింత అవగాహన కల్పించాలని అన్నారు. వ్యవసాయంలో రీసెర్చ్ వర్క్ మరింత పెంచాలని కూడా ఆయన దిశా నిర్దేశం చేశారు.

Tags:    

Similar News