'బీసీ' రిజ‌ర్వేష‌న్‌... కూట‌మికి స‌వాళ్లు-లాభాలు.. !

బీసీ రిజర్వేషన్ వ్యవహారం రాష్ట్ర స్థాయిలో ఇంట్రెస్ట్ గా మారింది. ప్రస్తుతం రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్.. క్షేత్రస్థాయిలో బీసీ జనాభా పై అంచనాలు వేస్తుంది.

Update: 2026-05-19 03:00 GMT

బీసీ రిజర్వేషన్ వ్యవహారం రాష్ట్ర స్థాయిలో ఇంట్రెస్ట్ గా మారింది. ప్రస్తుతం రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్.. క్షేత్రస్థాయిలో బీసీ జనాభా పై అంచనాలు వేస్తుంది. గతంలో 33 శాతానికి పైగా బీసీలకు రిజర్వేషన్ అమలు చేసిన టిడిపి.. తర్వాత కాలంలో వచ్చిన వైసిపి దీనిని 30 శాతానికి పరిమితం చేసిందనే వాదన ఉంది. దీంతో వచ్చే ఎన్నికల నాటికి ముఖ్యంగా రెండు నెలల్లో ప్రారంభమయ్యే స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి బీసీలకు 35 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న ఆలోచన ప్రభుత్వంలో ఉంది.

అయితే ఇప్పటికే ఉన్న రిజర్వేషన్లు 50 శాతానికి దాదాపు చేరిపోయాయి. ఎస్సీ, ఎస్టీ ఓబీసీ సహా ఇతర సామాజిక వర్గాలకు కల్పిస్తున్న అన్ని రిజర్వేషన్లు కూడా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50 శాతానికి మించకూడదు. కానీ, బీసీ జనాభా పెరుగుతున్న క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఆ వర్గానికి మరిన్ని మేలు చేయాలని ప్రతిపాదన డిమాండ్లు కూడా తెరమీదకు వచ్చాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో డెడికేటెడ్ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ కమిషన్ విచారణ జరుగుతోంది. త్వరలోనే నివేదిక కూడా ప్రభుత్వానికి అందనుంది.

ఈ క్రమంలో ఏం చేయాలన్న విషయంపై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. గతంలో తెలంగాణ ప్రభుత్వం కూడా బీసీలకు 43% రిజర్వేషన్లు కేటాయించింది. కానీ దీనిని ఆమోదించే విషయంలో అటు గవర్నర్ కానీ రాష్ట్రపతి గాని ముందుకు అడుగు వేయలేదు. ఫలితంగా ఈ ప్రతిపాదన అలానే ఉండిపోయింది. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పులు హైకోర్టు తీర్పులను చూస్తే ఎన్ని ఎంత మందికి రిజర్వేషన్లు ఇచ్చిన 50% లోపే ఉండాలన్న కీలక తీర్పు ఉన్న క్రమంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఆసక్తిగా మారింది.

ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం ముందు రిజర్వేషన్లు ప్రకటించి ఎన్నికలకు వెళ్లి ఆ తర్వాత న్యాయపరంగా లేకపోతే రాజకీయపరంగా ఎదురయ్యే అంశాలను పరిశీలించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. మొత్తంగా ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాదు.. సామాజిక వర్గాల్లో కూడా తీవ్ర ఆసక్తిగా మారింది. బీసీలకు 35 శాతం రిజర్వేషన్ కల్పిస్తే మిగిలిన సామాజిక వర్గాలకు కూడా మరింతగా రిజర్వేషన్ పెంచాల్సి ఉంటుందని ఇటీవల ఆయా సామాజిక వర్గాలు డిమాండ్ చేశాయి.

అంటే మొత్తంగా తమిళనాడులో ఉన్నట్టుగా 65% రిజర్వేషన్లను అమలు చేయాలన్న ప్రతిపాదనను తెరమీదకు తెచ్చాయి. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న క్రమంలో ఎన్డీఏ ప్రభుత్వం తలుచుకుంటే ఇది సాకారం కావచ్చు అనే అభిప్రాయం కూడా ఉంది. మరి ఆ దిశగా అడుగులు వేస్తారా లేకపోతే 50 శాతానికే పరిమితం అవుతారా అనేది చూడాలి.

Tags:    

Similar News