రేవంత్ సొంత టీంలో భాగంగా మరో బిగ్ వికెట్ పడింది

అదే సమయంలో తన సొంత టీంకు తుది రూపు ఇచ్చే క్రమంలో మరో పెద్ద అడుగు వేశారు.

Update: 2023-12-18 04:22 GMT

వాయు వేగంతోనిర్ణయాలు తీసుకోవటం ఒక ఎత్తుగడ. స్లో అండ్ స్టడీ అన్నట్లుగా నిర్ణయాలు తీసుకోవటం మరో స్టైల్. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి రెండో విధానాన్ని ఫాలో అవుతున్నారు. ఒకటి తర్వాత ఒకటి చొప్పున తన సొంత టీంను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా.. తనకు తాను ఆయాఅంశాల మీద అవగాహన పెంచుకొని నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా కీలక అధికారులపై బదిలీ వేటు వేశారు. అదే సమయంలో తన సొంత టీంకు తుది రూపు ఇచ్చే క్రమంలో మరో పెద్ద అడుగు వేశారు.

కేసీఆర్ సర్కారులో కీలక పాత్ర పోషించి.. హైదరాబాద్ మహానగర ముఖ చిత్రానికి కొత్త షేప్ తెచ్చిన ఘనత మాజీ మంత్రి కేటీఆర్ ఖాతాలో పడినప్పటికీ.. నిజానికి దానికి సంబంధించిన మాస్టర్ మైండ్ ఎవరిదంటే.. పురపాలక శాఖ కమిషనర్ గా వ్యవహరించిన అర్వింద్ కుమార్ ది. ఆయన ప్రత్యేక శ్రద్ధతోనే హైదరాబాద్ లో భారీ ఎత్తున బ్రిడ్జిలు.. అండర్ పాస్ లు.. కనెక్టింగ్ రోడ్డులు లాంటివి అందుబాటులోకి వచ్చాయి.

తాజాగా ఆయన్ను మారుస్తూ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన పురపాలక శాఖస్పెషల్ చీఫ్ సెక్రటరీ.. హెచ్ఎండీఏ కమిషనర్ (అదనపు).. మున్సిపల్ ఆడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ (కమిషనర్) బాధ్యతల నుంచి ఆయన్ను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ బాధ్యతలను ప్రస్తుతం జలమండలి ఎండగా వ్యవహరిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి దానకిశోర్ కు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో అర్వింద్ కుమార్ ను విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అధికార వర్గాల మాటల్లో చెప్పాలంటే దీన్నో అప్రాధాన్యత శాఖగా పరిగణిస్తారు. తాజా బదిలీతో గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఒక పెద్ద వికెట్ పడినట్లుగా పేర్కొంటున్నారు.

Read more!

తాజాగా మొత్తం పదకొండు మంది సీనియర్ అధికారుల్ని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ జాబితాలోకి చూస్తే..అధికారి పేరు ఏ శాఖ నుంచి ఏ శాఖకు బదిలీ అంటే అర్వింద్ కుమార్ ఎంఏయూడీ నుంచి డిజాస్టర్ మేనేజ్ మెంట్ బుర్రా వెంకటేశం బీసీ సంక్షేమం నుంచి సాంకేతిక విద్యాశాఖ వాణీ ప్రసాద్ రవాణా శాఖ నుంచి అటవీ పర్యావరణ శాఖ దానకిశోర్ జలమండలి ఎండీ నుంచి ఎంఏయూడీ ముఖ్యకార్యదర్శి.. హెచ్ఎండీఏ ఎండీ కేఎస్ శ్రీనివాసరాజు రోడ్డు భవనాల శాఖ నుంచి రవాణా శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా సీఎంవో సెక్రటరీ నుంచి జీఏడీ సెక్రటరీ. అదనంగా ఎస్సీ డెవలప్ మెంట్ క్రిస్టినా చొంగ్తు వాణిజ్య పన్నుల శాఖ నుంచి కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శిగా సుదర్శన్ రెడ్డి ఎంఏయూడీ సెక్రటరీ నుంచి జలమండలి ఎండీ టీకే శ్రీదేవి ఆర్థిక శాఖ కార్యదర్శి నుంచి వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ వాకాటి కరుణ మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్ నల్గొండ కలెక్టర్ నుంచి హెల్త్.. కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్

Tags:    

Similar News