మ‌ద్యంలో వీళ్లు చీకులు.. వాళ్లు సొమ్ములు.. నంజేసుకున్నారు!

మందు బాబుకు స్ట‌ఫ్ ఉండాలి. పెగ్గు పెగ్గుకు చీకులు కొరికితే ఆ లెక్కే వేరు.. ఆ కిక్కే వేరు అన్న‌ట్టుగా మందు బాబులు తాగి ఊగుతారు.;

Update: 2025-05-17 03:21 GMT

మందు బాబుకు స్ట‌ఫ్ ఉండాలి. పెగ్గు పెగ్గుకు చీకులు కొరికితే ఆ లెక్కే వేరు.. ఆ కిక్కే వేరు అన్న‌ట్టుగా మందు బాబులు తాగి ఊగుతారు. ఇది మందుబాబుల లెక్క‌. ఇక‌, మందు అమ్మేవారు.. సొమ్ములు చూసు కుంటారు. ఇక‌, వైసీపీ హ‌యాంలో అప్ప‌టి ప్ర‌భుత్వానికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించిన కొంద‌రు జ‌గ‌న్ సానుభూతి ప‌రులు, ఆయ‌న ద‌గ్గ‌ర ప‌నిచేసిన వారు సొమ్ములు భారీగానే నంజుకున్నార‌ని విజ‌య‌వాడ ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం అధికారులు తేల్చి చెబుతున్నారు.

తాజాగా ఈ కేసులో ప్ర‌ధాన ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ధ‌నుజ‌య‌రెడ్డి, కృష్ణ‌మోహ‌న్‌రెడ్డిల‌ను అరెస్టు చేసిన సిట్ అధికారులు వారు ఏవిధంగా సొమ్ములు రాబ‌ట్టిందీ.. లెక్క‌లు స‌హా త‌మ నివేదిక‌లో వివ‌రిం చారు. మ‌ద్యం నుంచి మొత్తంగా ఐదు ర‌కాలుగా సొమ్ములు నంజుకున్నార‌ని తేల్చారు. దీంతో భారీ ఎత్తున నిధులు పోగ‌య్యాయ‌ని.. ఎక్క‌డా రూపాయి కూడా వ‌దిలి పెట్ట‌కుండా.. కోట్ల‌కు కోట్ల సొమ్మును రాబ‌ట్టిన‌ట్టు అధికారులు త‌మ నివేదిక‌లో పేర్కొన్నారు.

సిటి పేర్కొన్న ప్ర‌కారం.. ఇలా దోచేశారు!

1) నాసిర‌కం మ‌ద్యాన్ని అధిక ధ‌ర‌ల‌కు విక్ర‌యించ‌డం: దీనివ‌ల్ల మందు బాబును అడ్డంగా దోచుకున్నా రు. రూ.30 ఖ‌రీదు చేసే మ‌ద్యాన్ని(90 బాటిల్‌/ టెట్రా ప్యాక్‌) రూ.100-120 కి విక్ర‌యించారు. త‌ద్వారా మందు బాబుల జేబులు గుల్ల‌య్యాయి.

2) త‌మ‌కు అనుకూలంగా ఉండే డిస్టిల‌రీల ద్వారా: వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత అప్ప‌టి వ‌ర‌కు ఉన్న వ్యాపారుల‌ను త‌రిమేశారు. త‌మ‌కు అనుకూలంగా ఉండే వారితో మ‌ద్యం త‌యారీ డిపోలు ఏర్పాటు చేసుకుని క‌మీష‌న్లు తీసుకున్నారు.

3) మ‌ద్యం హోల్ సేల్ వ్యాపారుల నుంచి: వైసీపీ హ‌యాంలో ప్ర‌భుత్వ దుకాణాల ద్వారానే వైన్స్ విక్ర‌యించారు. అయితే.. డిస్టిల‌రీల నుంచి హోల్ సేల్‌గా వ్యాపారులు కొని.. దీనిని తిరిగి ప్ర‌భుత్వానికి విక్ర‌యించేవారు. ఈ క్ర‌మంలో వ్యాపారుల నుంచి కూడా భారీగా సొమ్ము చేసుకున్నారు.

4) ప్ర‌ముఖ కంపెనీల నుంచి: ఇక‌, కొన్ని కొన్ని ప్ర‌ముఖ కంపెనీల విక్ర‌యాల విష‌యంలో ఇండెంట్ల‌ను భారీగా త‌గ్గించేశారు. పైగా.. వీటిని స్టార్ హోట‌ళ్ల‌కు మాత్ర‌మే పరిమితం చేశారు. అయిన‌ప్ప‌టికీ.. ఇక్క‌డా సొమ్ములు గుంజార‌ని సిట్ పేర్కొంది. బాటిల్‌కు ఇంత‌ని లెక్క క‌ట్టి వ‌సూలు చేసిన‌ట్టు నివేదిక‌లో పేర్కొన్నారు.

5) యూపీఐ పేమెంట్లు లేకుండా: సాధార‌ణంగా రూపాయి అగ్గిపెట్ట‌కు కూడా.. ఈ రోజు మార్కెట్‌లో ఫేన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటివి అందుబాటులో ఉండ‌గా.. వైసీపీ హ‌యాంలో మద్యం విక్ర‌యాల‌కు ఇలాంటివేవీ లేదు. సో.. నేరుగా వ‌చ్చిన సొమ్ములో లెక్క‌లు ప‌త్రాలు చూప‌కుండా.. కోట్ల సొమ్మును ప‌క్క‌దారి ప‌ట్టించారని సిట్ త‌న నివేదిక‌లో స్ప‌ష్టం చేసింది.

Tags:    

Similar News