మంత్రివర్గంలో మార్పులు...టీడీపీ క్లారిటీ ఇచ్చేసిందిగా !
ఈ తరహా ప్రచారానికి టీడీపీ చెక్ పెట్టేసింది. మంత్రి వర్గ వస్తరణ కానీ మార్పులు కానీ జరిగేది లేదని కూడా ఫుల్ క్లారిటీగా చెప్పేసింది.;
ఏపీలో మంత్రివర్గ విస్తరణ అంటూ గత కొన్నాళ్ళుగా మీడియాలో పుంఖానుపుంఖాలుగా వార్తలు వస్తున్నాయి. వారు ఇన్ అని వీరు అవుట్ అని కూడా పెద్ద హెడ్డింగులు పెట్టి మరీ న్యూస్ రాస్తున్నారు. ఇక ఎవరు ఎందుకు మాజీలు అవుతారో ఎవరు ఎందుకు కాబోయే మంత్రులుగా ముందుకు వస్తారో కూడా విశ్లేషిస్తున్నారు.
ఇవన్నీ పీక్స్ కి వెళ్ళిపోయాయి. ఇక ముహూర్తాలు సైతం ఫిక్స్ చేసేశారు. ఆగస్టు నెలలో 6 నుంచి 15 మధ్యలో మంత్రివర్గంలో మార్పులు ఖాయమని ఆరు నుంచి ఎనిమిది మంత్రుల దాకా మాజీలు అవుతారని కూడా ప్రచారం సాగింది.
ఈ తరహా ప్రచారానికి టీడీపీ చెక్ పెట్టేసింది. మంత్రి వర్గ వస్తరణ కానీ మార్పులు కానీ జరిగేది లేదని కూడా ఫుల్ క్లారిటీగా చెప్పేసింది. వచ్చే నెల 6 న మంత్రివర్గ విస్తరణ ఉంటుందని వస్తున్న వార్తలు కానీ జరుగుతున్న ప్రచారం కానీ తప్పు అని టీడీపీ అధికారికంగా ఖండించింది. కూటమి ప్రభుత్వం మంత్రి వర్గ విస్తరణ చేస్తుందని ఊహాగానాలు చేస్తున్నారు అని మండిపడింది.
అభూతకల్పన తో రాసే కధనాలు పూర్తిగా అబద్ధాలు అని వ్యాఖ్యానించింది. సుపరిపాలనలో తొలి అడుగు ఏడాది పూర్తి అయిన శుభ సందర్భంగా ప్రభుత్వం ఉత్సాహంగా ముందుకు సాగుతూంటే ఇటువంటి తప్పుడు కధనాలతో తప్పు దారి పట్టించేందుకు కొనరు ప్రయత్నిస్తున్నారు అని ఫైర్ అయింది.
ముఖ్యమంత్రి నేతృత్వంలో మంత్రులు అంతా పూర్తి కో ఆర్డినేషన్ తో పనిచేస్తున్నారు అని కూడా స్పష్టం చేసింది. దాంతో మంత్రివర్గంలో ఇక మార్పులు కానీ చేర్పులు కానీ ఉండవని అర్ధం అయింది. అదే సమయంలో ఆగస్టు ముహూర్తాలు లేవు, గండాలు అంతకంటే లేవు అని కూడా అంటున్నారు.
తెలుగుదేశం పార్టీ అధికారికంగా ఈ విధంగా ఖండించడంతో తరచూ వస్తున్న ఈ తరహా వార్తలను చూసి ఆలోచనలో పడిన కొందరు మంత్రులు కానీ వారి అనుచరులు అభిమానులు కానీ ఫుల్ ఖుషీ అవుతున్నారు ఇదిలా ఉంటే గతసారి జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రుల తీరు మీద ముఖ్యమంత్రి ఆగ్రహించినట్లుగా వార్తలు వచ్చాయి.
కొత్త వారు వస్తారు అని అన్నట్లుగా ప్రచారం సాగింది. దాంతోనే పెద్ద ఎత్తున ఈ విధంగా వార్తలు వచ్చాయి. ఇపుడు చూస్తే మంత్రివర్గంలో ఏ మార్పులు లేవని కూటమి పెద్దన్న తెలుగుదేశమే చెప్పినందువల్ల అంతా హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు అని అంటున్నారు. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ ఆలోచనలు ఎపుడూ మీడియాకు అందవు. మీడియాలో వచ్చినవి అక్కడ జరగవు. పైగా ఏడాది మాత్రమే పూర్తి అయింది కాబట్టి లాజికల్ గా ఆలోచిస్తే ఇప్పట్లో మంత్రివర్గంలో మార్పులు ఉండకపోవచ్చనే అంటున్నారు.