కూటమి కీలక నిర్ణయం...జెడ్పీలు డబుల్ !

విశాఖ చిన్న జెడ్పీ కావడంతో అందులో భీమునిపట్నం, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి మండలాలు చేరనున్నాయి. ఇక 79 గ్రామ పంచాయతీలు ఇందులో ఉంటాయి.

Update: 2026-09-06 03:12 GMT

ఏపీలో జిల్లా పరిషత్తులకు కొత్త చరిత్ర మొదలవబోతోంది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లా పరిషత్తులు కాస్తా ఏకంగా 28 కానున్నాయి. ఏపీలో 28 జిల్లాలు ఏర్పడిన నేపథ్యంలో జెడ్పీల సంఖ్యను పెంచుతూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ప్రస్తుతమున్న 13 జడ్పీల స్థానంలో 28 కొత్త జిల్లా పరిషత్‌లు ఏర్పాటుచేయడమే కాదు వాటి అమలు తేదీని కూడా ప్రకటించారు. ఈ నెల 24 నుంచి ప్రస్తుతం జెడ్పీ పాలక వర్గాల గడువు పూర్తి అవుతుంది. ఆ మరుసటి రోజు నుంచి 13 కాస్తా 28 జెడ్పీలు అవుతాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

అధికారుల నియామకం :

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చెపట్టాక కొత్తగా ఏర్పడిన మార్కాపురం, పోలవరం జిల్లాలకు కూడా నూతన జిల్లా పరిషత్ లను మంజూరు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అంతే కాదు అదనంగా 15 జడ్పీ సీఈఓలు, అలగే 15 డిప్యూటీ సీఈఓపోస్టుల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దాంతో మరో ఇరవై రోజుల్లో ఏపీలో 28 కొత్త జడ్పీలతో పాలనా వ్యవస్థ ఏర్పడనుంది. అలా సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది.

చిన్న జెడ్పీగా విశాఖ :

ఇదిలా ఉండగా కూటమి ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో కొత్త జిల్లాల సంఖ్యకు అనుగుణంగా 28 జిల్లా పరిషత్‌లను అధికారికంగా పునర్వ్యవస్థీకరించింది. ఈ జెడ్పీల పునర్విభజనను ఆయా జిల్లాల్లో ఉన్న మండలాల సంఖ్య పనిభారం ఆధారంగా సిబ్బంది కేటాయింపు కోసం వర్గీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 660 మండలాలను కొత్తగా ఏర్పడిన 28 జిల్లా పరిషత్‌ల పరిధిలోకి సర్దుబాటు చేశారు. ఎక్కువ మండలాలు ఉన్న జెడ్పీలను పెద్దవిగా తక్కువ మండలాలు ఉన్న జెడ్పీలను చిన్నవిగా పరిగణించి అందుకు తగినట్లుగా మినిస్టీరియల్ స్టాఫ్‌ను హేతుబద్ధీకరించి వాటికి కేటాయిస్తున్నారు. ఇక అనకాపల్లి జెడ్పీ పరిధిలో 24 మండలాలు ఉండగా కేవలం 4 మండలాలు మాత్రమే ఉన్న విశాఖపట్నం జెడ్పీ చాలా చిన్న జెడ్పీగా మారుతుంది. అలాగే భౌగోళిక విస్తీర్ణంలో ప్రకాశం జెడ్పీ పెద్దదిగా, విశాఖపట్నం జెడ్పీ చిన్నదిగా ఉంటుంది.

పాలనాపరంగా :

విశాఖ చిన్న జెడ్పీ కావడంతో అందులో భీమునిపట్నం, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి మండలాలు చేరనున్నాయి. ఇక 79 గ్రామ పంచాయతీలు ఇందులో ఉంటాయి. ఇక ఈ నాలుగు మండలాల నుంచి నలుగురు జెడ్పీటీసీలు గెలుస్తారు, వీరిలోనే జెడ్పీ చైర్మన్ వైస్ చైర్మన్ లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. అంటే కేవలం ఇద్దరు మాత్రమే సభ్యులుగా ఉంటారు అన్న మాట. విశాఖ జెడ్పీలో ప్రజా ప్రతినిధులు కంటే అధికారులే ఎక్కువగా ఉంటారని అంటున్నారు. ఒకనాడు శ్రీకాకుళం దాకా విస్తరించి ఉన్న విశాఖ జెడ్పీ ఇపుడు ఏపీలో అతి చిన్న జెడ్పీ కావడం మాత్రం ఒకింత విస్మయంగానే ఉంది అని అంటున్నారు. అయితే విశాఖ కార్పోరేషన్ లో ఈ నాలుగు మండలాలను విలీనం చేయాలన్న డిమాండ్ కూడా తెర ముందుకు వస్తోంది. అదే కనుక జరిగితే మాత్రం విశాఖకు జెడ్పీ అన్నది లేకుండా పోతుంది. అయితే ఆ విధంగా కాకుండా ప్రభుత్వం జెడ్పీని ఏర్పాటు చేయడంతో విలీనం అన్నది ప్రస్తుతానికి లేదనే అంటున్నారు.

Tags:    

Similar News