పల్లెల్లో ప్రగతి... జనసేనకు పల్లె వెలుగులు..!
దేశ ప్రగతికి పల్లెలే పట్టుకొమ్మలు.. అన్న మహాత్మాగాంధీ స్ఫూర్తిని నిలువెల్లా పుణికి పుచ్చుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పల్లెల బాగుచేతకు నడుం బిగించారు.
దేశ ప్రగతికి పల్లెలే పట్టుకొమ్మలు.. అన్న మహాత్మాగాంధీ స్ఫూర్తిని నిలువెల్లా పుణికి పుచ్చుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పల్లెల బాగుచేతకు నడుం బిగించారు. పల్లెలు బాగుంటేనే ప్రజలు బాగుంటారని.. తద్వారా దేశం కూడా బాగుంటుందని భావిస్తున్న ఆయన.. చెప్పేదానికంటే కూడా చేసేదే ఎక్కువగా కనిపిస్తోంది. ప్రస్తుతం పల్లె ల్లో ఒక మహోద్యమం కొనసాగుతోంది. అదే.. పల్లెల బాగు!. రాష్ట్ర వ్యాప్తంగా పల్లెలు నేడు కళకళలాడుతున్నాయి!. నిజానికి ఒకప్పుడు పల్లెల నుంచి పట్టణాలకు వలస వచ్చేవారు.
కానీ.. నేడు పల్లెల నుంచి పట్టణాలకు వలస వెళ్తున్నకుటుంబాలు కనిపిస్తున్నాయి. మీ గ్రామంలో అమ్మే భూమి ఉంటే చెప్పు.. అని ఉద్యోగులు చర్చించుకునే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం.. గత రెండు సంవత్సరాలుగా పల్లెలపై ప్రభుత్వం.. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి ఫోకస్ పెంచడమే. దీంతో రిటైర్మెంట్ కోసం వేచి చూస్తున్న ఉద్యోగులు తమ తమ పల్లెలకు వలస బాటపడుతున్నారు. అంతేకాదు.. స్థానికంగా చేసుకునేందుకు ఉపాధి మార్గా లుగా కూడా పల్లెలు ఉపకరిస్తున్నాయి.
స్థానిక ఎన్నికల నేపథ్యంలో పలు చానెళ్లు పల్లెల తీరుతెన్నులను అధ్యయనం చేయగా.. ఈ విషయాలు వెలుగు చూశాయి. ఒకప్పుడు చెరువు అంటే.. కనిపించే పరిస్థితి లేదు. పోనీ.. ఉన్నా.. చుట్టూ కంప, ముళ్లు, చెత్తతో నిండి పోయిన పరిస్థితి ఉండేది . కానీ, నేడు.. పల్లెల్లో చెరువులు.. `ఆహా ఏం అద్భుతం` అనిపించే ఫైవ్ స్టార్ హోటళ్లలోని కొలనుల(స్విమ్మిగ్ పూల్) మాదిరిగా సర్వాంగ సుందరంగా దర్శనమిస్తున్నాయి. దీనికిగాను .. అటు ఉపాధి హామీ(ప్రస్తుతం రాంజీ)నిధులతోపాటు.. 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులను నేరుగా కేటాయిస్తున్నారు.
స్థానికంపై ప్రభావం..
త్వరలోనే స్థానికంగా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పల్లెల బాగుచేత వ్యవహారం.. జనసేనకు కలిసి వచ్చే అవ కాశం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. రహదారుల నుంచి ఇంటింటికీ కుళాయి వరకు.. చెరువుల నుంచి .. పశువుల కు ప్రత్యేక వైద్య శాలల దాకా.. అనేక విషయాల్లో పల్లెలు నేడు.. ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. పవన్ కల్యాణ్ పనితీరు.. ఆయన దూరదృష్టికి నిదర్శనంగా మారుతున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే..జనసేనకు పల్లెవెలుగులు.. స్థానికంగా కనిపించడం ఖాయమన్నది టాక్. ఇది కూటమికి మేలు చేస్తుందని అంటున్నారు.