కమలనాధులు... ఇలాగే సర్దుకుపోవాల్సిందే !

ఏపీలో కమలనాధులు పూర్తి నైరాశ్యంలో కూరుకుని పోయారని అంటున్నారు. మూడు పార్టీల పొత్తుతో ఏపీలో అధికారంలోకి వచ్చామన్న ఆనందం వారికి ఎక్కడా లేకుండా పోయింది అని అంటున్నారు.;

Update: 2025-05-15 03:36 GMT

ఏపీలో కమలనాధులు పూర్తి నైరాశ్యంలో కూరుకుని పోయారని అంటున్నారు. మూడు పార్టీల పొత్తుతో ఏపీలో అధికారంలోకి వచ్చామన్న ఆనందం వారికి ఎక్కడా లేకుండా పోయింది అని అంటున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వంలో పెద్దన్నగా టీడీపీ ఉంటే జనసేన రెండవ ప్లేస్ లో ఉంది. ఇక బీజేపీ విషయం తీసుకుంటే జూనియర్ పార్టనర్ మాదిరిగా ఉంది అని అంటున్నారు.

నామినేటెడ్ పదవుల పంపిణీలో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది అని అంటున్నారు. మేజర్ షేర్ ఎటూ టీడీపీకి వెళ్ళినా ఆ తరువాత జనసేనకు రావాల్సిన వాటా దక్కుతోందని ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ముగ్గూరు ఎంపీలు ఉన్న బీజేపీకి దానికి తగిన వాటా అయితే దక్కడంలేదు అని అంటున్నారు.

ఇప్పటికి అనేక విడతలుగా పదవుల పంపిణీ జరిగింది. కానీ బీజేపీ నుంచి ఆశావహులకు మాత్రం పెద్దగా దక్కలేదు అని చెబుతున్నారు. తాజాగా డీసీసీబీ డీసీఎంఎస్ చైర్మన్ల పోస్టుల భర్తీ విషయం తీసుకున్నా ఇతర కీలకమైన నామినేటెడ్ పదవుల తీరు చూసినా బీజేపీ దాకా వచ్చేసరికి ఒకటీ అరా పదవులు ఇస్తున్నారు అని అంటున్నారు.

దానికి కారణం ఉందని అంటున్నారు. కేంద్రంలో బీజేపీకి కావాల్సిన రాజ్యసభ ఎంపీల పదవులు ఇస్తున్నారు. అలాగే టీడీపీ ఎంపీల మద్దతుతో కేంద్ర ప్రభుత్వం నడుస్తోంది. దాంతో కేంద్ర పెద్దలను సంతృప్తి పరిస్తే చాలు అని భావిస్తున్నారు అని అంటున్నారు. దాంతో ఏపీలో లోకల్ లీడర్స్ కి ఏ పదవులూ దక్కడంలేదు అని అంటున్నారు.

ఇక ఈ విషయంలో కేంద్రం ప్రత్యేకంగా జోకయం చేసుకుంటేనే తప్ప ఎవరికైనా పదవులు దక్కుతాయి తప్ప ఏపీలో కూటమిలో బీజేపీ ఉంది అన్నది మాత్రం ఎవరికీ తెలియకుండా పోతోంది అని అంటున్నారు. పదవుల కోసం ఆశలు పెట్టుకున్న మాజీ ఎంపీ జీవీఎల్ నరసిం హారావు, అలాగే విష్ణు వర్ధన్ రెడ్డి లాంటి వారి విషయం తీసుకుంటే ఇపుడు పూర్తిగా సైలెంట్ మోడ్ లోకి వెళ్ళారని అంటున్నారు.

ఏడాది కూటమి పాలనలో ప్రాధాన్యతలు ఎవరికి ఏమిటి అన్నది బాగా తెలిసిందని అంటున్నారు. దాంతో కేంద్రంలో బీజేపీకి ఏపీ కూటమి పార్టీలతో అవసరాలు ఉన్నాయని అలాగే ఏపీ కూటమి నేతలు తమ వద్ద ఉన్న పదవుల విషయంలో తమ అవసరాలను చూసుకుంటూ ఎంపిక చేస్తున్నారు అని అంటున్నారు.

దాంతో ఏపీ బీజేపీ నేతలు ఇక పదవుల మీద పెద్దగా ఆశలు అయితే పెట్టుకోవడం లేదు అనే అంటున్నారు. మరో విషయం ఏమిటి అంటే బీజేపీలో గట్టిగా నిలబడి పదవులు కావాలని అడిగే నాయకుడు కూటమి పెద్దలను ఒప్పించే వారు రాష్ట్ర స్థాయిలో లేకపోవడం కూడా ఒక లోటుగా ఉందని వాపోతున్నారు. మొత్తానికి ఇలాగే సర్దుకుపోవాల్సిందే అన్న ఆలోచనకు కమలనాధులు వచ్చేసారని టాక్.

Tags:    

Similar News