• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అండమాన్ నికోబార్ గగనతలం...

అండమాన్ నికోబార్ గగనతలం మూసివేత.. భారత్ కీలక పరీక్షలు!

| అవును... అండమాన్ నికోబార్ గగనతలం మూసివేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

By - Tupaki Desk
Update: 2025-05-23 10:32 GMT

అండమాన్ నికోబార్ దీవుల చుట్టూ ఉన్న ప్రాంతంలోని గగనతలాన్ని మే 23, 24 మధ్య మూడు గంటల పాటు మూసివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. ఈ సమయంలో ఏ పౌర విమానమూ ఈ గగనతలాన్ని ఏ ఎత్తులోనూ ఉపయోగించకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు భారత అధికారులు జారీ చేసిన నోటీస్ టు ఎయిర్ మెన్ (ఎన్.ఓ.టీ.ఏ.ఎం) తెలిపింది.

అవును... అండమాన్ నికోబార్ గగనతలం మూసివేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా... మే 23-24 తేదీల్లో ఈ ప్రాంతంలో భారత క్షిపణి పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ రెండు రోజుల్లోనూ ఉదయం 7 గంటల నుంచి మూడు గంటల పాటు క్షిపణి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని వెల్లడించారు.

వాస్తవానికి అండమాన్ నికోబార్ దీవుల ప్రాంతాన్ని భారత్ తన క్షిపణి పరీక్షల కోసం తరచూ ఉపయోగించుకుంటోంది. ఇందులో భాగంగా.. ఈ ఏడాది జనవరిలో సాల్వో మోడ్ లో బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణిని పరీక్షించింది. గత ఏడాది ఏప్రిల్ లోనూ బాలిస్టిక్ క్షిపణిని.. 2022 మార్చిలో బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది.

కాగా.. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్, పీవోకే లోని ఉగ్రస్థావరాలపై భారత్ క్షిపణులను ప్రయోగించిన సంగతి తెలిసిందే. అవి ఫుల్ సక్సెస్ రేటుతో లక్ష్యాలపై దాడి చేశాయి. దీంతో.. ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో.. భారత్ పెద్ద ఎత్తున ఆయుధాలను సమకూర్చుకుంటున్నట్లు చెబుతున్నారు.

ఇదే సమయంలో.. స్వదేశీ ఆయుధాల తయారీని వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే.. పలు క్షిపణి పరీక్షలను సైతం నిర్వహించనుంది. ఇందులో భాగంగానే... ఈ నెల 23-24 తేదీల్లో అండమాన్ నికోబార్ దీవుల గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

Tags:    
  • AndamanAirspace 
  • MissileTestIndia 
  • DefenseAlert 
  • NOTAMIndia 
  • AndamanNicobar 
  • IndianAirDefense 
  • IndiaMilitary 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS