• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ‘థార్’ వాహనానికి పానీపూరి...

‘థార్’ వాహనానికి పానీపూరి బండి.. ఆనంద్ మహీంద్రా రియాక్షన్ ఇదే

| తాజాగా తన పానీపూరి బండిని ఒక చోటు నుంచి మరో చోటుకు తరలించేందుకు మహీంద్రా సంస్థకు చెందిన 'థార్' కారును వినియోగిస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2024-01-25 04:18 GMT

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వ్యాపారవేత్తల్లో ఆనంద్ మహీంద్రా ముందుంటారు. ఎక్కడెక్కడి వీడియోల్ని పోస్టు చేస్తూ.. వాటిపై రియాక్టు అవుతూ అందరి మనసుల్ని గెలుచుకునే ఆయన.. తాజాగా ఒక చిట్టి వీడియోను పోస్టు చేశారు. తమ కంపెనీకి చెందిన 'థార్' కారుకు పానీపూరి బండిని తగిలించుకొని వెళ్లే ఢిల్లీ మహిళా వ్యాపారవేత్త వైనాన్ని తాజాగా పోస్టు చేశారు.

ఆమె ప్రయత్నాన్ని అభినందించారు. అదే సమయంలో ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల తాప్సీ ఉపాధ్యాయ్ బీటెక్ పూర్తి చేసి.. మోటార్ వాహనంపై పానీపూరీ అమ్ముతూ.. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారు.

బీటెక్ పానీపూరీ వాలీగా పేరు తెచ్చుకున్న ఆమె.. దేశ వ్యాప్తంగా 40కు పైగా స్టాల్స్ ను ఏర్పాటు చేసి యువ వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. తొలుత స్కూటీ నుంచి ఇప్పుడు కారు కొనే స్థాయికి చేరుకున్న ఆమె.. తాజాగా తన పానీపూరి బండిని ఒక చోటు నుంచి మరో చోటుకు తరలించేందుకు మహీంద్రా సంస్థకు చెందిన 'థార్' కారును వినియోగిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసిన మహీంద్రా సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా ఆమెను అభినందించారు.

ఆఫ్ రోడ్.. అడ్వెంచర్ వాహనాలను ఇలా ఎందుకు ఉపయోగిస్తారు? అన్న ప్రశ్నను సంధిస్తూనే.. దానికి సమాధానాన్ని ఇచ్చేశారు. సులువుగా వెళ్లేందుకు వీలుగా వాహనదారులు ఈ వాహనాన్ని వాడొచ్చన్న మాటను చెబుతూ.. ''అసాధ్యాన్ని సుసాధ్యం చేయొచ్చు.

ప్రజలు తమ కలను సాకారం చేసుకోవటానికి మా వాహనాలు ఉపయోగపడటం ఆనందకరమైన విషయం. ఈ వీడియో నాకెందుకు నచ్చిందో మీకు అర్థమై ఉంటుంది' అంటూ పోస్టు చేసిన ఈ వీడియోను తక్కువ సమయంలోనే ఐదు లక్షల మందికి పైగా చూడటం ఆసక్తికరంగా మారింది.


What are off-road vehicles meant to do?

Help people go places they haven’t been able to before..

Help people explore the impossible..

And in particular we want OUR cars to help people Rise & live their dreams..

Now you know why I love this video…. pic.twitter.com/s96PU543jT

— anand mahindra (@anandmahindra) January 23, 2024
Tags:    
  • Panipuri 
  • Thar 
  • Anandmahendra 
  • Socialmediaviral 
  • Adventurevechile 
  • Taapseeupadhyay 
  • Btech 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS