• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అమిత్ షా మాస్టార్ క్లాస్...

అమిత్ షా మాస్టార్ క్లాస్ తీసుకుంటారా ?

| తెలంగాణా మీద కోటి ఆశలు పెట్టుకుంది కమలం పార్టీ. అంతే కాదు, ఎన్నికలు పెడితే తమదే అధికారం అన్నంత ధీమా కనబరుస్తోంది.

By - Tupaki Desk
Update: 2025-06-29 04:16 GMT

తెలంగాణా మీద కోటి ఆశలు పెట్టుకుంది కమలం పార్టీ. అంతే కాదు, ఎన్నికలు పెడితే తమదే అధికారం అన్నంత ధీమా కనబరుస్తోంది. దానికి కారణం 2024 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా ఎనిమిది ఎంపీ సీట్లు దక్కాయి. మరి ఈ ఎనిమిది ఎంపీ సీట్లను అసెంబ్లీ సీట్లతో హెచ్చిస్తే 56 సీట్లు అవుతాయి. దాంతో 2028లో తెలంగాణాలో అధికారం తమదే అని కేంద్ర బీజేపీ నాయకత్వం మురిసిపోతోంది.

అయితే గత ఏడాదిగా చూస్తే తెలంగాణాలో బీజేపీ పరిస్థితి ఏ మాత్రం ఏమంత ఉత్సాహంగా లేదు అని అంటున్నారు. 2024 ఎన్నికల నాటితో పోలిస్తే గ్రాఫ్ బాగా తగ్గిందని నివేదికలు వెళ్ళడిస్తున్నాయి. దానికి కారణం తెలంగాణా బీజేపీ నాయకులు ఎవరికి వారుగా యమునా తీరుగా ఉండడమే అని అంటున్నారు.

నిజానికి బీజేపీకి గతంలో ఎన్నడూ లేని బలం తెలంగాణా ప్రజలు ఇచ్చారు. ఎనిమిది మంది ఎంపీలు అలాగే మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నారు. వీరిలో ఇద్దరికి కేంద్ర మంత్రి పదవిని పార్టీ ఇచ్చింది. ఇంత చేసినా బీజేపీని తెలంగాణా రాష్ట్రంలో పటిష్టం చేసేందుకు నాయకులు పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు అని అంటున్నారు.

అంతే కాదు ప్రతీ వారూ తామే సీనియర్లమనై తామే గొప్ప అని ఫీల్ అవుతున్నారు. దాంతోనే అసలు సమస్య వస్తోంది. ఇక గోషామహల్ ఎమ్మెల్యేగా ఉన్న రాజా సింగ్ వైఖరి కూడా పార్టీకి ఇబ్బందిగానే ఉంది అని అంటున్నారు. ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయినా సొంత దారిలో ఆయన వెళ్తున్నారు అని అంటున్నారు.

ఇక సొంత పార్టీలో ఉండి ప్రత్యర్ధి పార్టీల నేతలను బహిరంగంగా పొగుడుతూ కొంతమంది నేతలు పార్టీ దృష్టిలో పడ్డారు అని అంటున్నారు. ఇలా తెలంగాణా బీజేపీ విషయంలో చూసుకుంటే అంగట్లో అన్నీ ఉన్నాయి అల్లుడి నోట్లో శని ఉందని అన్నట్లుగా తయారు అయింది అని అంటున్నారు.

ఇక ఈ నెల 29న తెలంగాణా బీజేపీ అధ్యక్ష పదవి కోసం నోటిఫికేషన్ రిలీజ్ అవుతుది. జూఅలి 1న ఎన్నిక ఉంది. సరిగ్గా ఈ సమయంలో బీజేపీ పెద్ద కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణాకు వస్తున్నారు. ఆయన నిజమాబాద్ లోని జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం స్థానికంగా జరిగే సభలో పాల్గొంటారు.

అనంతరం తిరిగి హైదారాబాద్ వచ్చి ఎయిర్ పోర్టులోనే కొంత సేపు తెలంగాణా బీజేపీ నేతలతో మాట్లాడుతారు అని అంటున్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణా కొత్త బీజేపీ ప్రెసిడెంట్ ఎవతో జాతీయ నాయకత్వం మదిలో మాట చెబుతారు అని అంటున్నారు. ఈ పదవిని యువతకు ఇస్తారా మహిళలకు ఇస్తారా లేక సీనియర్లకు ఇస్తారా అన్నది చర్చగా ఉంది.

అయితే ప్రధానంగా ఈటెల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ల మధ్యనే పోటీ ఉంటుందని అంటున్నారు. అయితే ఎవరిని ఎంపిక చేసినా వర్గ పోరు లేకుండా పార్టీని ముందుకు తీసుకుని పోవాలని సూచిస్తారు అని అంటున్నారు. అంతే కాదు ఎవరికి వారుగా ఉంటే కుదరదని పెద్దాయన పక్కాగా క్లాస్ తీసుకునే చాన్స్ ఉందని అంటున్నారు.

బీజేపీకి ఎంతో ఆశావహగా ఉన్న రాష్ట్రంలో వాతావరణాన్ని ఎవరు చెడగొట్టాలని చూసినా సహించేది లేదని ఒక హెచ్చరిక కూడా చేస్తారు అని అంటున్నారు. పార్టీ కోసం అంతా అన్నీ మరచి కృషి చేయాలని ఎవరూ ఎక్కువ కాదు తక్కువ కాదని ఒక సందేశం ఇస్తారని అంటున్నారు. హైకమాండ్ కి అన్నీ తెలుసు అన్నీ తాను చూసుకుంటుందని ఎవరికి ఎపుడు ఏమి ఇవ్వాలో ఇస్తుందని కూడా అమిత్ షా చెబుతారు అని అంటున్నారు. మొత్తానికి అమిత్ షా ఈసారి తెలంగాణా టూర్ లో మాస్టార్ అవతారం ఎత్తుతారు అని అంటున్నారు.

Tags:    
  • BJP 
  • TelanganaPolitics 
  • AmitShah 
  • EtelaRajender 
  • DharmapuriArvind 
  • BJP2028 
  • TelanganaBJP 
  • LeadershipCrisis 
  • IndianPolitics 

Similar News

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

Copyright @2026

Powered by Blink CMS