యూఎస్ సె*క్స్ కుంభకోణం... ట్రంప్ యూటర్న్ సంచలనం!

అవును... అగ్రరాజ్యాన్ని కుదిపేసిన ఎప్ స్టీన్ ఫైల్స్ సెక్స్ కుంభకోణంకు సంబంధించిన విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.;

Update: 2025-11-17 11:37 GMT

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమి చేసినా సంచలనమే అని చెప్పాలా.. లేక, ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చెప్పడం అసాధ్యం అని భావించాలో తెలియదు కానీ... తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా.. అగ్రరాజ్యాన్ని కుదిపేసిన సెక్స్ కుంభకోణం ఎప్ స్టీన్స్ ఫైల్స్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు.. ఇది గత నిర్ణయాలకు పూర్తి భిన్నం కావడం గమనార్హం.

అవును... అగ్రరాజ్యాన్ని కుదిపేసిన ఎప్ స్టీన్ ఫైల్స్ సెక్స్ కుంభకోణంకు సంబంధించిన విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా... ఈ కేసుకు సంబంధించిన ఫైల్స్ ను బహిర్గతం చేసే బిల్లును ఇంతకు ముందు వ్యతిరేకించిన ఆయన.. ఇప్పుడు ఆ బిల్లుకు మద్దతు ఇవ్వాలని హౌస్ రిపబ్లికన్లను కోరారు. దీంతో.. ఈ నిర్ణయం సంచలనంగా మారింది.

తాజాగా ఈ విషయంపై ట్రూత్ సోషల్ మీడియా వేదికా స్పందించిన ట్రంప్... "ఎప్ స్టీన్ ఫైల్స్ ను విడుదల చేయడానికి హౌస్ రిపబ్లికన్లు ఓటు వేయాలి.. ఎందుకంటే.. దాచడానికి ఏమీ లేదు" అని రాశారు. ఇదే సమయంలో... రిపబ్లికన్ పార్టీ విజయాల నుంచి దృష్టి మరల్చడానికే "రాడికల్ లెఫ్ట్ డెమోక్రాట్లు" సృష్టించిన తప్పుడు ప్రచారమే ఈ ఎఫ్ స్టీన్ ఫైల్స్ కేసు అని అన్నారు!

ఈ సమయంలో 30 రోజుల్లోగా ఫైళ్లను విడుదల చేయాలనే బిల్లుపై ఫ్లోర్ ఓటింగ్ ను బలవంతం చేయడానికి డెమోక్రాట్లు, కొంతమంది రిపబ్లికన్లు ఇటీవల 218 మంది సంతకాలు చేశారు. ఈ సందర్భంగా బిల్లుకు కో-స్పాన్సర్ గా ఉన్న రిపబ్లికన్ ప్రతినిధి థామస్ మాస్సీ మాట్లాడుతూ.. కనీసం 100 మంది రిపబ్లికన్లు అనుకూలంగా ఓటు వేయొచ్చని అన్నారు.

మరోవైపు ఈ బిల్లుపై సంతకం చేసిన ఇద్దరు రిపబ్లికన్ చట్ట సభ్యులను ట్రంప్ సంప్రదించారని.. వారిలో కొలరాడొ ప్రతినిధి లారెన్ బోబర్ట్ ఉన్నారని కథనాలొచ్చాయి. వాస్తవానికి.. ట్రంప్ – ఎప్ స్టీన్ మధ్య ఉన్న సంబంధాలను మరోసారి పరిశీలించేలా చేసిన ఈమెయిల్ గత వారం విడుదలైంది.. ఇందులో 2019లో ఎప్ స్టీన్ ఒక జర్నలిస్టుకు.. ‘ట్రంప్ కు ఆ అమ్మాయిల గురించి తెలుసు’ అని మెయిల్ పంపారు.

ఏమిటీ సెక్స్ కుంభకోణం..?:

ఎప్ స్టీన్ సెక్స్ కుంభకోణం అమెరికాను కుదిపేసిన సంగతి తెలిసిందే. పేద, మధ్యతరగతి బాలికలు, యువతులకు పెద్ద మొత్తంలో ఆశ చూపించి న్యూయార్క్, ఫ్లోరిడా, వర్జిన్ ఐలండ్స్, మెక్సికోలోని నివాసాలకు పిలిపించి అఘాయిత్యాలకు పాల్పడ్డారనేది ఇందులోని ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది.

ఇది సుమారు రెండు దశాబ్ధాల పాటు సాగగా.. 2005లో బట్టబయలైంది. దీంతో.. నిందితుడిని అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు. ఈ క్రమంలో 2019 ఆగస్టులో ఎప్ స్టీన్ జైల్లోనే అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అయితే.. దీన్ని పోలీసులు ఆత్మహత్యగా తేల్చారు. ఈ క్రమంలో ట్రంప్, ఎప్ స్టీన్ కలిసి ఉన్న ఫోటోలు బయటకు రావడంతో వ్యవహారం మరింత హీటెక్కింది!

Tags:    

Similar News