• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అంబ‌టికి గుంటూరు...

అంబ‌టికి గుంటూరు 'వెస్ట్‌'.. పొలిటిక‌ల్ రోస్ట్ ..!

| నిజానికి సత్తెనపల్లి నియోజకవర్గ నుంచి రేపల్లెకు మార్చి ఉంటే ఆ ఫలితం వేరేగా ఉండేదని పార్టీ నాయకులు అంటున్నారు.

By - Tupaki Desk
Update: 2025-06-27 04:00 GMT

తాజాగా మాజీ మంత్రి, సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబును.. గుంటూరు వెస్ట్‌ నియోజకవర్గానికి ఇన్చార్జిగా నియమిస్తూ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి సత్తెనపల్లి నియోజకవర్గ నుంచి రేపల్లెకు మార్చి ఉంటే ఆ ఫలితం వేరేగా ఉండేదని పార్టీ నాయకులు అంటున్నారు. ఎందుకంటే రేపల్లె లో గతంలో అంబటి రాంబాబు రాజకీయాలు చేశారు. ఇక సత్తెనపల్లిలో ఆయన గెలిచారు కాబట్టి ఈ రెండు నియోజకవర్గాలకు ఆయనకు అవకాశం ఉండేదని చెబుతున్నారు. కానీ.. ఇప్పుడు గుంటూరు వెస్ట్ కు తీసుకురావడం ద్వారా ఇబ్బందేన‌ని అంటున్నారు.

బలమైన కమ్మ సామాజిక వర్గం ఉన్న ఈ నియోజకవర్గంలో అంబటి రాంబాబు రాజకీయాలు సాగడం కష్టమే అన్నది నాయకులు చెబుతున్న మాట. ఇది ఎవరో ప్రత్యర్థులు గిట్ట‌ని వారు చెబుతున్న మాట‌ కాదు. వైసిపిలోని సీనియర్లు గుంటూరు వెస్ట్ కి చెందిన నాయకులే కొందరు చెబుతున్నారు. గతంలో కావ‌టి మనోహర్ నాయుడుకు మేయర్ పదవి ఇచ్చారు. ఆయన కోరకుండానే చిలకలూరిపేటకు పంపించారు. వాస్తవానికి ఆయన గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయాలనుకున్నారు. ఇక్కడ కమ్మ- కాపు సామాజిక వర్గాలు ఉండటంతో అది లాభిస్తుందని భావించారు.

కానీ, జగన్ బీసీ సామాజిక వర్గానికి చెందిన విడద‌ల రజనీని తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేయించారు. ఆమె పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత ఆమెను తిరిగి చిలకలూరిపేటకు పంపించారు. దీంతో మనోహర్ నాయుడు పార్టీకి రాజీనామా చేశారు. ఈ పరిణామాలతో వెస్ట్ నియోజకవర్గంలో వైసిపి ప్రయోగాలు ఫలించడం కష్టంగానే మారింది అన్నది పరిశీలకులు చెబుతున్న మాట. అంతేకాదు వెస్ట్ లో సత్తెనపల్లి నుంచి వచ్చిన నాయకుడికి ఏ మేరకు స్థానిక నేతలు సహకరిస్తారని కూడా ప్రధాన సమస్య.

ఏదేమైనా ఇప్పుడున్న సంక్లిష్ట పరిస్థితులు పార్టీని వెంటాడుతూనే ఉన్నాయి. మ‌రోవైపు ఫైర్ బ్రాండ్ వంటి గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే కూడా అంబ‌టికి సెగ పెంచే అవ‌కాశం ఉంది. ఎమ్మెల్యే గ‌ల్లా మాధ‌వి దూకుడుగానే ఉన్నారు. మ‌రి ఆమెను తట్టుకుని అంబటి రాంబాబు ముందుకు సాగడం ఏమేర‌కు సాధ్య‌మో చూడాలి. ఆయన దూర దృష్టికి విజ్ఞతతో పాటు ఆయన రాజకీయ దూకుడుకు ఒక పరీక్షేన‌న్న‌ది పరిశీలు చెబుతున్న మాట. ఏదేమైనా ఈ మార్పు స‌క్సెస్ అవుతుందా? విఫ‌ల‌మ‌వుతుందా? అనేది చూడాలి.

Tags:    
  • AmbatiRambabu 
  • GunturWest 
  • YSRCP 
  • AndhraPolitics 
  • JaganLeadership 
  • PoliticalStrategy 
  • APAssemblyElections 
  • CasteEquations 
  • YSRCPMoves 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS