అమరావతి ఐకానిక్ బ్రిడ్జి గ్రాఫిక్స్ నా.. మళ్ళీ మొదలైంది రచ్చ !
రాజధాని అమరావతి అంతా గ్రాఫిక్స్ మయం. అంతా కళ్ళకు కనికట్టు, ఉన్నవన్నీ భారీ కాన్వాస్ మీద స్కెచ్ లే తప్ప వాస్తవంగా ఏమీ లేవు.;
రాజధాని అమరావతి అంతా గ్రాఫిక్స్ మయం. అంతా కళ్ళకు కనికట్టు, ఉన్నవన్నీ భారీ కాన్వాస్ మీద స్కెచ్ లే తప్ప వాస్తవంగా ఏమీ లేవు. ఇలా 2014 నుంచి 2019 మధ్యలో అధికార టీడీపీని అప్పటి విపక్షంలో ఉన్న వైసీపీ దారుణంగా విమర్శిస్తూ ఉండేది. బయట జనాలలో ఇదే చర్చ పెడుతూ వచ్చేది. సోషల్ మీడియాలో అయితే పోస్టుల మీద పోస్టులు పెడుతూ రచ్చ చేస్తూండేది. దానికి కౌంటర్ గా టీడీపీ వైపు నుంచి కూడా భారీగానే పోస్టులు పడేవి. మొత్తానికి చూస్తే అమరావతిలో చేసిన దాని కంటే గ్రాఫిక్స్ నే ఎక్కువ అన్నది జనంలోకి వెళ్ళిపోయింది. అది 2019 ఎన్నికల్లో టీడీపీని దెబ్బ కొట్టింది. కట్ చేస్తే మళ్ళీ గ్రాఫిక్స్ అంటూ రచ్చ స్ట్రార్ట్ అయిపోయింది అంటున్నారు.
గ్రాఫిక్స్లో ఐకానిక్ వంతెన :
అమరావతి రాజధానిలో నిర్మించ తలపెట్టిన ఐనాకికి వంతెనకు సంబంధించిన ఒక మోడల్ ని ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ఎంపిక చేశారు. ఈ వంతెనకు సంబంధించి నాలుగు షేపులతో గ్రాఫిక్ డిజైన్లు చేయించి వెబ్ సైట్లలో ఉంచగా అందులో అత్యధిక ఓటింగ్ వచ్చిన రెండవ డిజైన్ ని బాబు ఎంపిక చేశారు. ఈ డిజైన్ కి పద్నాలుగు వేల దాకా ఓట్లు వచ్చాయని చెబుతున్నారు. ఏకంగా రెండు వేల అయిదు వందల కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఐకానిక్ వంతెనను నిర్మాణం చేయబోతున్నారు. ఈ వంతెన కనుక అందుబాటులోకి వస్తే హైదరాబాద్ అమరావతిల మధ్య దూరం ఏకంగా 35 కిలోమీటర్ల దాకా తగ్గుతుంది. అంతే కాదు గంటన్నర సమయం కూడా ఆదా అవుతుంది ఇక ఈ నమూనాను కూచిపూడి డ్యాన్స్ లోని స్వస్తిక హస్త భంగిమగా తీసుకున్నారు.
వైసీపీ ఎటాక్ స్టార్ట్ :
ఇక ప్రభుత్వమే ఇపుడు గ్రాఫిక్స్ తో జనం ముందుకు వచ్చింది. పైగా ఒక ఐకానిక్ వంతెన విషయంలో ఇలా చేసింది. దాంతో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులకు ఇది అందివచ్చిన అవకాశంగా మారుతోంది అని అంటున్నారు వారంతా మళ్ళీ గట్టిగానే తగులుకుంటున్నారు. ఇదంతా గ్రాఫిక్స్ నా బాబూ అంటూ మొదలెట్టేసారు. అంతే కాదు ఒకసారి ఫ్లాష్ బ్యాక్ ని కూడా గుర్తు చేస్తున్నారు. 2014 నుంచి 2019 దాకా బాబు అమరావతి రాజధానిని జనాలకు చూపించింది అంతా గ్రాఫిక్స్ లోనే కదా అని కూడా సెటైర్లు వేస్తున్నారు. ఇపుడు మళ్ళీ గ్రాఫిక్స్ ని మొదలెట్టారు అని అంటున్నారు.
బెదిరించడమెందుకు :
ఇక మరో వైపు చూస్తే ప్రభుత్వం సోషల్ మీడియాలో పోస్టుల మీద నియంత్రణ విధిస్తామని బెదిరిస్తోంది అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాను కట్టడి చేయాలని అనుకుంటోంది అని వారు అంటున్నారు. ఆ రకంగా బెదిరింపులు ఎందుకు అని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వమే గ్రాఫిక్స్ ని రిలీజ్ చేసి వదిలినప్పుడు తాము కూడా వాటి మీద కౌంటర్ కామెంట్స్ చేస్తామని అంటున్నారు. నిజానికి నిర్మాణాలు అన్నీ వాస్తవంగా ఉండాలని వాటిని కట్టాల్సిన చోట కడితే అందరికీ బాగుంటుంది అని అంటున్నారు. ముందు ఆ దిశగా అభివృద్ధి కార్యక్రమాలలో స్పీడ్ పెంచాలని వారు సూచిస్తున్నారు.
రియాలిటీలో కూడా మెరవాలీ :
గ్రాఫిక్స్ లో అయిదు నిమిషాల్లో అంతా చూపించవచ్చు. కానీ ఆ కట్టడాలు రియల్ గా పూర్తి అయ్యే దానికి చాలా కాలం పడుతుందని అంటున్నారు. అందువల్లనే టెంపరరీగా జనాలకు ఆనందం కలిగించేందుకు ఈ గ్రాఫిక్స్ ని ముందుకు తెస్తున్నారని ఈ రోజున కన్నుల విందుగా ఉన్న ఈ గ్రాఫిక్స్ డిజైన్లు రియాలిటీలో కూడా మెరవాలీ అంటే స్పీడ్ గా సర్కార్ పనిచేయాలని అంటున్నారు. ఏది ఏమైనా ఏపీలో మరో మారు గ్రాఫిక్స్ మీద రచ్చ అయితే మొదలైంది మరి కౌంటర్ గా వైసీపీ నుంచి కూడా కొత్త గ్రాఫిక్స్ కొత్త డిజైన్లు మరిన్ని వచ్చినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.