ఆళ్లగడ్డలో పొలిటికల్ హీట్.. నేతల రాజకీయ సవాళ్లు
దీంతో ఈ వ్యవహారం తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీసింది. తనపై చేసిన ఆరోపణలను బ్రిజేంద్రరెడ్డి నిరూపించాలని అఖిల ప్రియ సవాల్ చేశారు. ఆరోపణలు నిజమైతే.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. ప్రస్తుత ఎమ్మెల్యే, టీడీపీ నాయకురాలు భూమా అఖిల ప్రియ, వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బ్రిజేంద్రరెడ్డి మధ్య రాజకీయ వివాదం నెలకొంది. దీంతో ఈ వ్యవహారం తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీసింది. తనపై చేసిన ఆరోపణలను బ్రిజేంద్రరెడ్డి నిరూపించాలని అఖిల ప్రియ సవాల్ చేశారు. ఆరోపణలు నిజమైతే.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు.
ఆరోపణలు నిరూపించలేక పోతే.. బ్రిజేంద్రరెడ్డి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని అఖిల ప్రియ సవాల్ రువ్వారు. దీంతో ఇరువురు నాయకులు అహోబిలం కేంద్రాన్ని ఎంచుకుని సవాళ్లను నిరూపించుకునేం దుకు రెడీ అయ్యారు. బుధవారం సాయంత్రం ఆళ్లగడ్డ నుంచి అహోబిలానికి వచ్చిన ఎమ్మెల్యే.. ఇక్కడే ఉంటానని పేర్కొన్నారు. మరోవైపు బ్రిజేంద్ర కూడా ఇంటి నుంచి బయలు దేరేందుకు ప్రయత్నించగా.. పోలీసులు ఆయనను గృహనిర్బంధం చేశారు.
ఏం జరిగింది?
ఆళ్లగడ్డ రాజకీయాలు ఎప్పుడూ వేడివేడిగానే సాగుతుంటాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ అవినీతి పాల్పడుతున్నారని బ్రిజేంద్ర రెడ్డి ఆరోపించారు. ముఖ్యంగా అహోబిలంలో తల నీలాల నుంచి కానుకల వరకు అవినీతి జరగిందని.. దీనివెనుక అఖిల ప్రియ ఉన్నారని ఆయన ఆరోపించారు. నెలా నెలా ముడుపులు దక్కుతున్నాయని పేర్కొన్నారు. దీనిపై అంతే సూటిగా స్పందించిన అఖిల ప్రియ.. తనకుఅంత ఖర్మ పట్టలేదని తెలిపారు.
తన కుటుంబం నుంచి తన నుంచి కూడా మఠాలకు విరాళాలు వెళ్తాయే తప్ప.. మఠాలు, గుడులను దో చుకునే సంస్కృతి తనకు లేదన్నారు. గతంలో దోచుకున్నవారే ఇప్పుడు తనపై ఆరోపణలు చేస్తున్నార ని బ్రిజేంద్రపై ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలోనే ఆరోపణలు నిరూపించాలని.. నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించడం గమనార్హం. ఇక, బ్రిజేంద్ర రెడ్డి సైతం తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని.. నిరూపిస్తానని ప్రకటించారు. దీంతో ఇరు పక్షాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు పెరగడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.