బాంబు పేలుడు ఎఫెక్ట్ : అల్ ఫలాహ్ వర్శిటీకి బిగ్ షాక్
ఏఐయూ తీసుకున్న ఈ నిర్ణయం తక్షణం అమలులోకి వస్తుందని ప్రధాన కార్యదర్శి పంకజ్ మిట్టల్ వెల్లడించారు.;
విశ్వవిద్యాలయం అంటే ఉన్నత విద్యావంతులను చేయాలి. అన్ని విధాలుగా వారిని పరిపూర్ణులను చేయలై. కానీ ఆశ్చర్యకరంగా దిగ్భ్రాంతికరంగా ఒక విశ్వవిద్యాలయంలో ఉగ్ర కుట్రలు చేసే వారు ఉండడం అంతే కాదు ఆ విధంగా అడ్డాగా ఉందని చెడ్డ పేరు రావడం విశేషం. అందుకే ఏకంగా అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయాని సభ్యత్వాన్నే రద్దు చేస్తూ అఖిల భారత విశ్వవిద్యాలయాల సంఘం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా ఈ వర్శిటీ విషయం ఏమిటి, దానికి వచ్చే నిధుల సంగతేంటి అన్న దాని మీద దర్యాప్తు చేయాలని ఈడీని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
తక్షణం అమలులోకి :
ఏఐయూ తీసుకున్న ఈ నిర్ణయం తక్షణం అమలులోకి వస్తుందని ప్రధాన కార్యదర్శి పంకజ్ మిట్టల్ వెల్లడించారు. భవిష్యత్తులో ఈ విశ్వవిద్యాలయం అఖిల భారత విశ్వవిద్యాలయాల సంఘం గుర్తింపుని కానీ లోగోని కానీ వాడరాదని స్పష్టం చేశారు. దాంతో ఈ వర్శిటీకి బిగ్ షాక్ తగిలింది. ఇదిలా ఉంటే తాజాగా ఢిల్లీలో జరిగిన భారీ పేలుడు ఘటన వెనక ఉన్న డాక్టర్ ఉమర్ నబీ ఫరీదాబాద్లోని అల్-ఫలా యూనివర్సిటీలో రెసిడెంట్ డాక్టర్‌గా కొంతకాలం పనిచేశారు. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ లో ఆయనదే కీలక పాత్ర. అంతే కాదు ఇదే వర్సిటీలో ఇంకో ఇద్దరు వైద్యులు అయిన ముజమ్మిల్, షాహిన్‌లను కూడా తాజాగా పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి దాదాపుగా మూడు వేల కిలోల పేలుడు పదార్థాలని స్వాధీనం చేసుకున్నారు.
తప్పుడు తడకలతో :
ఇక ఈ వర్శిటీకి తప్పుల తడక చరిత్ర చాలానే ఉంది అని అంటున్నారు. వర్శిటీకి ఈ మేరకు నేషనల్ సెస్‌మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ నాక్ కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నాక్ గుర్తింపు కూడా ఈ వర్శిటీకి లేదు, అయినా తన వెబ్ సైట్లలో గుర్తింపు ఉన్నట్లుగా బాహాటంగానే వాటిని ప్రచారం చేసుకుంటోంది. ఈ విధంగా ఇక్కడ చదివే విద్యార్ధులను వారి తల్లి తండ్రులను వర్శిటీ యాజమాన్యం తప్పుదోవ పట్టించింది అని అంటున్నారు.
నిధులు వెల్లువగా :
ఈ వర్శిటీకి నిధులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయి ఏమిటి అన్న దాని మీద కూడా ఈడీనే విచారణకు కేంద్రం రంగంలోకి దింపుతోంది. ఈ వర్శిటీలో రెసిడెంట్ డాక్టర్ గా పనిచేసిన ఉమర్ నబీ బాంబు పేలుడు చేశాడు. మరో ఇద్దరు వైద్యులు అరెస్టు అయ్యారు. అనుమానితులుగా ఇంకొందరిని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ వర్శిటీలో చదువుతున్న విద్యార్ధులు వారి తల్లిదండ్రులలో భయం ఏర్పడింది. ఈ నేపధ్యమో దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా గుర్తింపు రద్దు ఈడీ విచారణ నాక్ ఇచ్చిన షాక్ ఇవన్నీ కూడా మరింతగా ఆందోళన పెంచుతున్నాయని అంటున్నారు.
మూడు దశాబ్దాల క్రితం :
ఇదిలా ఉంటే మూడు దశాబ్దాల క్రితం ఒక చిన్న ఇంజనీరింగ్ కళాశాలగా మొదలైన అల్ -ఫలాహ్ యూనివర్సిటీ ప్రయాణం ఆ తర్వాత ఏకంగా వర్శిటీ స్థాయి దాకా సాగింది. ఈ వర్శిటీని హర్యానా ప్రభుత్వ ప్రైవేట్ వర్శిటీల చట్టం మేరకు ఏర్పాటు చేశారు. ఇది ఫరీదాబాద్ జిల్లాలోని దౌజ్ గ్రామంలో ఏకంగా డెబ్బై ఆరు ఎకరాల విశాల ప్రాంగణంలో ఉంది.