'ఎయిరిండియా విమాన ప్రమాదం ఉద్దేశ్యపూర్వకంగానే'... షాకింగ్ రిపోర్ట్!

ఈ సందర్భంగా నాటి అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదానికి సాంకేతిక సమస్యలు కారణం కాదని.. ఇంజిన్ లో ఇంధనం నిలిచిపోవడం ఉద్దేశ్యపూర్వక చర్య వల్ల జరిగిందని తెలిపింది!;

Update: 2026-02-12 07:44 GMT

గత ఏడాది జూన్ లో అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా నడుపుతోన్న బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం బయలుదేరిన కొన్ని సెకన్ల తర్వాత కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే! ఈ ఘోర ప్రమాదంలో విమానంలో ఉన్న 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బందిలో.. ఒక్క ప్రయాణికుడు మాత్రమే సజీవంగా బయటపడగా.. వీరితో పాటు విమానం కూలిన వైద్య విద్యార్థుల హాస్టల్ భవనంలోని వారు మృతి చెందారు.

దశాబ్ధాలుగా దేశంలో జరిగిన అత్యంత దారుణమైన విమానయాన విపత్తులలో ఒకటైన ఈ ఘోర ప్రమాదంలో మొత్తం 260 మంది మరణించారు! ఈ క్రమంలో దీనిపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అధికారిక నివేదిక వెలువడాల్సి ఉంది! ఈ క్రమంలో.. ఈ ప్రమాదానికి గల కారణాలపై.. న్యూఢిల్లీ - వాషింగ్టన్ మధ్య జరిగిన తాజా చర్చలతో పరిచయం ఉన్న రెండు వర్గాలను ఉంటకిస్తూ ఓ ఇటాలియన్ దినపత్రిక కొరియర్ డెల్లా సెరా షాకింగ్ విషయం వెల్లడించింది!

అవును... అహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా ఘోర విమాన ప్రమాదానికి సంబంధించి డీజీసీఏ తుది నివేదిక వెలువడాల్సి ఉన్న నేపథ్యంలో.. తాజాగా ఓ కొరియన్ పత్రిక సంచలన కథనాన్ని ప్రచురించింది! ఈ సందర్భంగా నాటి అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదానికి సాంకేతిక సమస్యలు కారణం కాదని.. ఇంజిన్ లో ఇంధనం నిలిచిపోవడం ఉద్దేశ్యపూర్వక చర్య వల్ల జరిగిందని తెలిపింది! పైగా దీన్ని భారత దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయని రాసుకొచ్చింది!

ఇదే సమయంలో... ఈ విమాన ప్రమాదానికి సంబంధించిన దర్యాప్తులో సహాయం చేస్తున్న అమెరికా నిపుణులు ఈ ఫలితాలను ఒక ముందడుగుగా అభివర్ణించారని వార్తా పత్రిక జోడించింది! అదేవిధంగా... దర్యాప్తు తుది నివేదికలో పైలట్ల మానసిక ఆరోగ్య పర్యవేక్షణపైనా సిఫార్సులు ఉండే అవకాశం ఉందని వెల్లడించింది! దీంతో... ఈ కథనం తీవ్ర సంచలనంగా మారింది. ఈ సమయంలో.. డీజీసీఏ తుది నివేదికపై మరింత ఉత్కంట నెలకొందని అంటున్నారు.

కాగా... భారత ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) జూలై 2025లో విడుదల చేసిన ప్రాథమిక నివేదికలో.. ఒక పైలెట్ ఫ్యుయల్ కంట్రోల్ స్విచ్ లను ఆపివేయడం గురించి తుది కాక్ పీట్ లో ఇద్దరు మాట్లాడుకున్న విషయాల గురించి ప్రస్థావించబడిన సంగతి తెలిసిందే! ఇందులో భాగంగా... మీరు (ఫ్యుయల్ కంట్రోల్ స్విచ్!) ఎందుకు ఆపేశారు? అని అడగడం వినిపించగా.. నేను అలా చేయలేదు అని మరో పైలెట్ బదులిచ్చినట్లు వినిపించిందని వెల్లడించారు!

ఈ నేపథ్యంలో తాజా కథనంలో ఇటాలియన్ వార్తాపత్రిక ఈ విషయాన్ని కూడా ప్రస్థావించింది! ఇందులో భాగంగా.. పైలెట్లలో ఒకరు ఇంజిన్ ఇంధన నియంత్రణ స్విచ్ లను ఆపివేయడం వల్ల విమానం శక్తిని కోల్పోయి నేలపై పడిపోయిందని దర్యాప్తు అధికారులు ఇప్పుడు నమ్ముతున్నారని పేర్కొంది! కాగా నాడు ఈ విమానంలో కెప్టెన్ సుమీత్ సభర్వాల్ పైలట్ ఇన్ కమాండ్ గా ఉండగా.. ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ కో-పైలెట్ గా ఉన్నారు!

Tags:    

Similar News