నిముషానికి 475 అడుగుల వేగంతో కుప్పకూలింది !

ఇదిలా ఉంటే ఇక ఫ్లైట్ రాడార్ 24కి అహమదాబాద్ విమానం చివరి డేటా 625 అడుగుల ఆల్టిట్యూడ్ లో దొరికింది అని అంటున్నారు.;

Update: 2025-06-12 13:08 GMT
నిముషానికి 475 అడుగుల వేగంతో కుప్పకూలింది !

అహ్మదాబాద్ లో భారీ విమాన ప్రమాదానికి సంబంధించిన తొలి రిపోర్టు రికార్డు అయింది. రాడార్ డేటాను ఫ్లైట్ రాడార్ 24 తాజాగా విడుదల చేసింది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ నుంచి ఏ విమానానికి సంబంధించిన సమాచారం అయినా ఫ్లైట్ రాడార్ 24 ఆటోమేటిక్ గా రికార్డు చేస్తుంది. స్వీడన్ లోని స్టాక్ హోం ప్రధాన కేంద్రంగా ఈ ఫ్లైట్ రాడార్ 24 పనిచేస్తుంది.

అహ్మదాబాద్ లో కుప్ప కూలిన విమానం గురించిన సమాచారం కూడా ఫ్లైట్ రాడార్ 24 లో రికార్డు అయింది. విమానాల రాకపోకలకు సంబంధించి లైఫ్ రికార్డింగ్ ఆటోమేటిక్ గా ఇక్కడ నమోదు అవుతుంది. దాంతో అహ్మదాబాద్ విమానం కుప్పకూలిన దాని మీద తొలి రిపోర్టుని ఫ్లైట్ రాడార్ 24 విడుదల చేసింది.

ఏడీఎస్-బ, ఎం ఎల్ ఏటీ, శాటిలైట్, రాడార్ ఆధారంగా ఈ డేటాను తీసుకుంటారు. దీంతో ఈ ఫ్లైట్ రాడార్ 24 డాట్ కాంలో ప్రతీ విమానానికి సంబంధించిన లైఫ్ రిపోర్ట్ ని ఎప్పటికపుడు తీసుకోవచ్చు. ఇదిలా ఉంటే ఇక ఫ్లైట్ రాడార్ 24కి అహమదాబాద్ విమానం చివరి డేటా 625 అడుగుల ఆల్టిట్యూడ్ లో దొరికింది అని అంటున్నారు. ఈ రిపోర్ట్ ని కనుక చూస్తే ఈ విమానం టేకాఫ్ అయిన నిమిషం లోపే ఏటీసీతో సంబంధాలను పూర్తిగా కోల్పోయినట్లుగా తెలుస్తోంది. ఇక ఫ్లైట్ రాడార్ 24 రిపోర్ట్ ప్రకారం చూస్తే విమాన ప్రమాదం మధ్యాహ్నం ఒంటిగంట 38 నిముషాలలో జరిగినట్లుగా చెబుతున్నారు.

మరో వైపు చూస్తే అహమదాబాద్ ఎయిర్ పోర్టు సముద్ర మట్టానికి 200 అడుగుల ఎత్తున ఉంటుంది. ఇక విమానం కూలిపోవడానికి ముందు చూస్తే 625 అడుగుల ఎత్తున ఉంది. అంటే అంత ఎత్తు నుంచి కిందకు ఈ విమానం మైనస్ 425 అడుగుల వేగంతో నిట్టనిలువుగా కుప్పకూలినట్లుగా చెబుతున్నారు. దీంతో ఇది అతి భయంకరమైన ప్రమాదంగానే అభివర్ణిస్తున్నారు. టెక్నికల్ గా చూసినా విమానం ఇబ్బందులో ఉందా అన్న చర్చ అయితే వస్తోంది మొత్తానికి ఈ విమానం ప్రమాద వేగం చూసినా లేక ఎత్తు చూసినా అత్యంత భయంకరమైన తీరులో దుర్ఘటన జరిగింది అని అంటున్నారు.

Tags:    

Similar News