బోయింగ్ 787-8కు ఇదే తొలి భయానక ప్రమాదం
అహ్మదాబాద్‌లో ప్రమాదానికి గురైన ఈ బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ ఏయిర్ క్రాఫ్ట్ 13,530 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.;
అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్‌పటేల్ విమానాశ్రయం నుంచి లండన్ బయలుదేరిన కొన్ని సెకన్లలలోనే ఏరియిర్ ఇండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఏయిర్ క్రాఫ్ట్‌లో 242 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలలోనే సాంకేతిక సమస్య తలెత్తడంతో ఓ భవనంపై కూలిపోయింది. మొత్తం ప్రయాణికుల్లో 169 మంది భాయతీయులు ఉన్నట్టుగా తెలుస్తోంది. కాగా 53 మంది బ్రటన్ పౌరులు, ఏడుగురు పోర్చుగల్, ఒకరు కెనడాకు చెందిన వారున్నారు.
అహ్మదాబాద్‌లో ప్రమాదానికి గురైన ఈ బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ ఏయిర్ క్రాఫ్ట్ 13,530 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఖండాంతర ప్రయాణాలకు దీన్ని వాడుతారు. ఏవియేషన్ చరిత్రలో అత్యధికంగా అమ్ముడైన వైడ్ బాడీ ఏయిర్ క్రాఫ్ట్‌గా దీనికి పేరుంది. ఇంధన వినియోగాన్ని 25 శాతం వరకు తగ్గిస్తుంది. ఒకేసారి 248 మంది ప్రయాణికులని మోసుకెళ్తుంది.
2011లో అరంగేట్రం నుంచి ఇప్పటి వరకు ఇదే తొలి భయానక ప్రమాదంగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఈ ఏయిర్ ఇండియా బోయింగ్ ఏయిర్ క్రాఫ్ట్ బీజె మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై ప్రమాద వశాత్తు సాంకేతిక కారణాల వల్ల కూలింది. ఈ ప్రమాదం కారణంగా హాస్టల్ భవనంలో ఉన్న విద్యార్థుల్లో కొంత మంది మరణించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. విమాన ఘటనపై ఏయిర్ ఇండియా చంద్రశేఖరన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అంతే కాకుండా పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు సహాయక చర్యలని పర్యవేక్షిస్తున్నారు.