AI-171 విషాదానికి ఏడాది : ఒళ్లు గగుర్పొడిచే వైరల్ వీడియో

భారత విమానయాన చరిత్రలోనే బ్లాక్ డేగా మిగిలిపోయిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా (AI-171) విమాన ప్రమాదం జరిగి సరిగ్గా ఏడాది పూర్తయింది.

Update: 2026-06-12 17:42 GMT

భారత విమానయాన చరిత్రలోనే బ్లాక్ డేగా మిగిలిపోయిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా (AI-171) విమాన ప్రమాదం జరిగి సరిగ్గా ఏడాది పూర్తయింది. 2025 జూన్ 12న అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ బయలుదేరిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ విమానం నగరంలోని బి.జె. మెడికల్ కాలేజీ హాస్టల్, క్యాంటీన్ భవనాలపైకి దూసుకెళ్లడంతో 241 మంది ప్రయాణికులతో పాటు మెడికల్ కాలేజీలోని మరో 19 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు.

నిర్మానుష్యంగా డెత్ జోన్

ఈ ఘోర ప్రమాదం జరిగి ఏడాది గడిచిన సందర్భంగా ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ ఘటనా స్థలాన్ని సందర్శించి, అక్కడి భీతావహ దృశ్యాలను తన కెమెరాలో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతూ నెటిజన్లను కన్నీరు పెట్టిస్తోంది. ఇన్‌ఫ్లుయెన్సర్ షేర్ చేసిన వీడియో ప్రకారం ప్రమాద స్థలమంతా ప్రస్తుతం పూర్తిగా నిర్మానుష్యంగా శ్మశానాన్ని తలపిస్తోంది. విమానం నేరుగా ఢీకొట్టిన బి.జె. మెడికల్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్, క్యాంటీన్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. క్యాంటీన్ కిచెన్ లోపలి దృశ్యాలు ఇప్పటికీ నాటి ప్రమాదాన్ని కళ్లకు కట్టినట్లు చూపుతున్నాయి.

ప్రమాదం జరిగిన సమయంలో కిచెన్‌లో వండిన రొట్టెలు, నిత్యావసర సరుకులు, పగిలిన పాత్రలు ఏడాది గడిచినా ఇప్పటికీ అలాగే చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. కాలం అక్కడే ఆగిపోయిందా అన్నట్లుగా ఉన్న ఆ దృశ్యాలు ప్రమాదం నాటి భయానక తీవ్రతను కళ్లకు కడుతున్నాయని అంటున్నారు. ఇక ప్రమాదం జరిగిన అతుల్యం హాస్టల్ బ్లాక్‌లో ఉంటున్న అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ పీజీ మెడికల్ విద్యార్థి చెప్పిన సమాచారం ఇప్పటికీ అక్కడివారు ఎంతలా భయపడుతున్నారో బయటపెట్టిందని అంటున్నారు. తాను ఓ రావడంతో అక్కడి నుంచి వెళ్లిపోయానని, అలా వెళ్లిన 4 నిమిషాలకే భవనంపై విమానం పడిందని సదరు విద్యార్థి తెలిపాడు.

ఆ ఫోన్ కాల్ రాకపోయి ఉంటే తాను కూడా బూడిదలో కలిసిపోయేవాడిని అంటూ గతాన్ని గుర్తు చేసుకుంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. అక్కడ 260 మంది చనిపోయారు, అది ఇప్పుడు ఒక హంటెడ్ ప్లేస్‌లా మారింది. ప్రభుత్వం అక్కడ రూ.105 కోట్లతో మళ్లీ హాస్టల్ కట్టాలని చూస్తోంది, కానీ అక్కడ విద్యార్థులు ఎవరూ ఉండలేరు" అని తన భయాన్ని పంచుకున్నాడు. ఇక శిథిలాలు, వైరల్ వీడియోలను చూసిన వారు విమానప్రమాదం తీరని గుండెకోతను నిరంతరం గుర్తు చేస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు "సమయం ఎంత విలువైనదో, ప్రాణం ఎంత క్షణభంగురమో ఈ దృశ్యాలు చూస్తే అర్థమవుతోంది" అంటూ కామెంట్లు పెడుతున్నారు.



Tags:    

Similar News