2027లో ఏఐకి మించిన ఏజీఐ ఎంట్రీ.. దెబ్బకు అరాచకమేనట
ఇదే విషయాన్ని తాజాగా లూయిస్ విల్లే వర్సిటీ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ రోమన్ యాంపోల్స్కీ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.;
ఆ రంగం ఈ రంగం అన్న తేడా లేకుండా ప్రతి రంగంలోనూ ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఎంట్రీతో ఉద్యోగవకాశాలు భారీగా దెబ్బ తింటాయన్న ఆందోళన అన్ని రంగాల్లోనూ నెలకొని ఉంది. ఇలాంటి వేళ.. ఏఐకి మించిన మరో టెక్నాలజీ తెర మీదకు వస్తే? దాని ఎఫెక్టు ఎంతలా ఉంటుంది? ఇప్పటికే ఏఐ దెబ్బకు హడలిపోతున్న వేళ.. ఇప్పుడు కొత్తగా వచ్చే సాంకేతికతతో చోటు చేసుకునే పరిణామాల మీద చర్చ ఇప్పటికే మొదలైంది.
ఇదే విషయాన్ని తాజాగా లూయిస్ విల్లే వర్సిటీ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ రోమన్ యాంపోల్స్కీ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్న ఏఐకి మిన్నగా ఏజీఐ (ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్) అందుబాటులోకి వస్తుందని చెప్పారు. దీంతో.. ఆ రంగం ఈ రంగం అన్న తేడా లేకుండా అన్నింటిని ఆక్రమించేసి.. ఉద్యోగాలు లేకుండా చేస్తుందంటూ ఉలిక్కి పడి టెన్షన్ తెచ్చుకునే వ్యాఖ్యలు చేస్తున్నారు.
2030 నాటికి 99 శాతం మంది కార్మికులు కొత్త టెక్నాలజీ పుణ్యమా అని నిరుద్యోగులుగా మారుతారని అంచనా వేశారు. ప్రపంచంలోని చాలా కంపెనీలు తమ ఖర్చుల్ని తగ్గించుకోవటానికి.. ఆదాయాన్ని పెంచుకోవటానికి వీలుగా ఏఐ వ్యవస్థను వాడేస్తుంటాయని పేర్కొన్నారు. కోడింగ్ ఉద్యోగులు.. ప్రాంప్ట్ ఇంజనీర్లు మాత్రమే కాదు.. వివిద రంగాల్లోని వారు కూడా నిరుద్యోగులుగా మారుతారని పేర్కొన్నారు.
ఏఐజీ ఎంట్రీతో ఇప్పటివరకు ప్రపంచం చూడని నిరుద్యోగాన్ని చూడాల్సి వస్తుందన్న హెచ్చరిక చేసిన ఆయన.. తాను పది శాతం నిరుద్యోగం గురంచి మాట్లాడటం లేదని.. 99 శాతం మంది ఉద్యోగాలు కోల్పోతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2027 నాటికి ఏజీఐ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఏఐజీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన మూడేళ్లకు ఏఐ వస్తువులు.. హ్యుమానాయిడ్ రోబోలు అందుబాటులోకి వస్తాయని.. కంపెనీలు మనుషులకు ప్రత్యామ్నాయంగా వాటిని వినియోగించిన వైనం కాస్త కొత్తగా ఉంటుందననారు.
ఈ పరిణామాలతో పలు కంపెనీలు మనుషులకు ప్రత్యమాయాల్ని గుర్తించి.. వారికి పని అప్ప జెప్పే వీలుందన్నారు. ఏజీఐ ఎంట్రీతో కార్మిక మార్కెట్ కూలిపోతుందని.. అన్ని ఉద్యోగాలు ఆటోమేటెడ్ అవుతాయని.. అప్పుడు ప్లాన్ బీ అంటూ ఏమీ ఉందన్నారు. అన్ని ఉద్యోగాలు ఆటోమేటెడ్ అవుతాయని.. అప్పుడు ప్లాన్ బీ అంటూ ఏమీ ఉండదంటూ చేసిన వ్యాఖ్యలు ఫ్యూచర్ మీద సరికొత్త భయాన్ని.. పూర్తిస్థాయిలో చెప్పటం ద్వారా భవిష్యత్ అంటేనే భయపడేలాంటి పరిస్థితులు తన మాటలతో ప్రపంచానికి అర్థమయ్యేలా చెప్పారని చెప్పక తప్పదు.