• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఆ ఊర్లో ఒకటే కిడ్నీ.....

ఆ ఊర్లో ఒకటే కిడ్నీ.. అసలు స్టోరీ తెలిస్తే షాక్!

| అఫ్గానిస్తాన్‌లోని ఒక పల్లెటూరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా "ఒక మూత్రపిండం గ్రామం" (వన్ కిడ్నీ విలేజ్) గా పిలవబడుతోంది. అక్కడ జరుగుతున్న గుండెను పిండేసే నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం.

By - Madhu Reddy
Update: 2026-05-29 14:30 GMT

కడుపు కోతను మించిన బాధ లేదు. కానీ, కట్టుకున్న పిల్లల ఆకలి కేకలు వినలేక, చేతిలో చిల్లిగవ్వ లేక, అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ అభాగ్యులు ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. బతకడం కోసం తమ శరీరంలోని ఒక ముఖ్యమైన అవయవాన్ని అమ్మేసుకుంటున్నారు. అఫ్గానిస్తాన్‌లోని ఒక పల్లెటూరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా "ఒక మూత్రపిండం గ్రామం" (వన్ కిడ్నీ విలేజ్) గా పిలవబడుతోంది. అక్కడ జరుగుతున్న గుండెను పిండేసే నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఆకలి తెచ్చిన అపసోపాలు:

అఫ్గానిస్తాన్‌లోని హెరాత్ నగరం శివార్లలో ఉండే ఒక చిన్న ప్రాంతం 'సైషాన్బా బజార్'. ఇక్కడి ప్రజల పరిస్థితి చాలా దారుణం. ఇక 2021లో అక్కడ జరిగిన రాజకీయ మార్పుల వల్ల అంతర్జాతీయ సాయం ఆగిపోయింది. దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది. ఇక దీంతో ఇక్కడి జనాభా అంతా ఒక్కసారిగా కటిక పేదరికంలోకి జారిపోయింది. తిండికి కూడా డబ్బులు లేని దుస్థితి ఏర్పడింది.

బతకడానికి అవయవాల అమ్మకం:

కుటుంబంలో అందరూ ఆకలితో అలమటిస్తుంటే చూడలేక, పేరుకుపోయిన అప్పులు తీర్చలేక అక్కడి నివాసితులు ఒక ప్రమాదకరమైన దారిని ఎంచుకున్నారు. ఇక తమ ప్రాణాలను పణంగా పెట్టి అయినా సరే, పిల్లలను సాకాలని ఒక కిడ్నీని అమ్మేస్తున్నారు. కొందరు బ్రోకర్లు ఈ పేదరికాన్ని ఆసరాగా చేసుకుని, వైద్యం కోసం వచ్చే ధనవంతులతో వీళ్ళను ముడిపెట్టి వ్యాపారం సాగిస్తున్నారు.

శరీరం సహకరించని జీవితాలు:

క్షణిక ఆవేశంలోనో, నిస్సహాయతతోనో కిడ్నీ అయితే అమ్మేసుకున్నారు కానీ, ఆ తర్వాత వారి జీవితాలు నరకప్రాయంగా మారాయి. సరైన వైద్యం, విశ్రాంతి లేకపోవడంతో సర్జరీ జరిగిన వారంతా తీవ్రమైన నడుము నొప్పి, నీరసంతో బాధపడుతున్నారు. రోజూ కూలి పనులతో జీవనం సాగించే ఆ పేదలు ఇప్పుడు కనీసం బరువులు కూడా ఎత్తలేని పరిస్థితికి చేరి, పూర్తిగా పనికిరాని స్థితిలోకి వెళ్లిపోతున్నారు.

ఒక వైపు ప్రాణం తీస్తున్న ఆకలి, మరోవైపు బతికించుకోవాలని చేసే పోరాటం మధ్య అఫ్గాన్ ప్రజలు నలిగిపోతున్నారు. కేవలం ఒక పూట కూడు కోసం, తమ శరీర భాగాలను కోల్పోవాల్సి రావడం మానవత్వానికే ఒక పెద్ద మచ్చ. అంతర్జాతీయ సమాజం స్పందించి, తగిన సాయం అందిస్తే తప్ప ఆ 'మూత్రపిండాల గ్రామం' లోని కన్నీళ్లు తుడవటం ఎవరికీ సాధ్యం కాదు.

Tags:    
  • afghanistan 
  • humancrisis 
  • onekidneyvillage 
  • organsale 
  • poverty 
  • worldnews 

Similar News

విదేశీ...స్వదేశీ : మోడీ వర్సెస్ రాహుల్ !

2026-11-03 04:12 GMT

ఎన్నికల రాష్ట్రాలలో భారీగా ఓట్ల కోత... విపక్షాలు గగ్గోలు

2026-11-03 04:11 GMT

ఓటు వేసేందుకు అరవై కిలోమీటర్లు వెళ్ళాల్సిందే !

2026-11-03 04:08 GMT

ఏపీలో జగన్ వద్దా.. రాహుల్ ప్లాన్ ఏంటి ?

2026-11-03 04:08 GMT

నేల మీదకు జగన్...వ్యూహమా అనివార్యమా ?

2026-11-02 18:28 GMT

విశాఖ హెచ్‌పీసీఎల్ లో భారీ పేలుడు

2026-11-02 18:28 GMT

స్పెసిఫైడ్ అథారిటీకి టీటీడీ...కొత్త బోర్డు అప్పుడే ?

2026-11-02 18:27 GMT

రష్యా-ఉక్రెయిన్ పోరులో భారత్ క్రేజ్.. ఉక్రెయిన్ ఆరాటాన్ని ఎద్దేవా చేసిన పుతిన్

2026-11-02 18:27 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ట్రంప్ టవర్స్‌లో షాకింగ్ పరిస్థితులు.. కోట్ల ఫ్లాట్ కొన్నా కర్టెన్లు లేవు.. లిఫ్ట్ లేదు

2026-11-02 18:26 GMT

మెగాస్టార్ చుట్టూ ఊహాగానాలు...మ్యాటర్ మాత్రం ?

2026-11-02 18:25 GMT

Copyright @2026

Powered by Blink CMS