• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జమ్మలమడుగులో...

జమ్మలమడుగులో జగడం..వైసీపీకి ఆదినారాయణ రెడ్డి వార్నింగ్!

| మాజీ సీఎం జగన్ సొంత ఇలాకా కడపలో కూడా గత ఎన్నికల్లో వైైసీపీకి ఎదురుగాలి వీచిన సంగతి తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2024-10-10 16:01 GMT

మాజీ సీఎం జగన్ సొంత ఇలాకా కడపలో కూడా గత ఎన్నికల్లో వైైసీపీకి ఎదురుగాలి వీచిన సంగతి తెలిసిందే. జగన్ మినహా సీనియర్, జూనియర్ నేతలలో చాలా మంది ఓటమిపాలయ్యారు. ఈ క్రమంలోనే పులివెందుల సహా కడపలో టీడీపీ, బీజేపీ బలపడడ్డాయి. దీంతో, వైసీపీ-టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ ఫ్యామిలీకి కొరకరాని కొయ్యగా ఉన్న జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి...వైసీపీ నేతలపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆదినారాయణ రెడ్డి వర్సెస్ వైసీపీ ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి అన్న రీతిలో మాటల యుద్ధం పీక్ స్టేజికి చేరింది.

దీంతో, ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళనతో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు ఉన్నారు. ఎవరికి వారు వెనక్కి తగ్గే సమస్యే లేదంటూ మాటల తూటాలు పేలుస్తుండడంతో జమ్మలమడుగులో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. రామసుబ్బారెడ్డి కుటుంబానికి, ఆదినారాయణ రెడ్డి కుటుంబానికి నాలుగు దశాబ్దాలుగా నడుస్తున్న ఫ్యాక్షన్ వార్ కాస్తా ఇపుడు పొలిటికల్ వార్ గా మారింది. దాడులకు ప్రతిదాడులు తప్పవని రామసుబ్బారెడ్డి చేసిన కామెంట్లు కాక రేపాయి. ఒకరు వైడ్ బాల్ అయితే , మరొకరు నోబాల్ అంటూ వైసీపీ నేతలపై ఆదినారాయణ రెడ్డి ఆ కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు.

సూపర్ సిక్స్ పథకాలలంటూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని, గండికోట, రాజోలు ప్రజలకు ఇచ్చిన హామీలు ఇంకా నెరవేర్చలేదని రామ సుబ్బారెడ్డి అన్నారు. సిక్స్ కొట్టడానికి ఆదినారాయణ రెడ్డికి బ్యాట్ లేస్తుందా అంటూ రామసుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ఒకటి కాదు చాలా సిక్సర్లు కొడతానని, తాను ఫుట్బాల్ కూడా ఆడతానని కౌంటర్ ఇచ్చారు ఆదినారాయణ రెడ్డి. తాను తన్నే బంతి వైసీపీ నాయకుల మూతులు పగలగొడుతుందని ఎద్దేవా చేశారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే అడ్డంగా నరుకుతామంటూ వైసీపీ నేతలకు ఆదినారాయణ రెడ్డి డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు.

Tags:    
  • Adinarayanareddy 
  • Subbareddy 
  • Appolitics 
  • YSRCP 
  • BJP 
  • Ycpleaders 
  • Jagan 
  • Apgovernment 
  • Jammalamadugu 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS