• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జగన్ ఫ్యామిలీపై పూనమ్...

జగన్ ఫ్యామిలీపై పూనమ్ ట్వీట్... ఇంతలోనే ఎంత మార్పు?

| ప్రముఖ నటి పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని సంగతి తెలిసిందే

By - Tupaki Desk
Update: 2024-06-07 14:22 GMT

ప్రముఖ నటి పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని సంగతి తెలిసిందే! గతంలో తెలుగులో పలు హిట్ సినిమాల్లో నటించిన ఆమె ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే సినిమాయేతర విషయాలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలో గతంలో టాలీవుడ్ లో ఒక స్టార్ హీరోని, ఒక దర్శకుడిని టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టే ఆమె తాజాగా ఎన్నికల ఫలితాల అనంతరం మరోసారి జగన్ పై ట్వీట్ చేశారు.

అవును... ప్రముఖ నటి పూనమ్ కౌర్ తెలుగు ప్రేక్షకులకు సినిమా నటిగానే కాకుండా... పలు అంశాలపై ఆన్ లైన్ వేదికగా స్పందించే సెలబ్రెటీ నెటిజన్ గానూ బాగా పరిచయం అనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఒకానొక సమయంలో వైసీపీ అధినేత జగన్ సర్కార్ కు అనుకూలంగానూ ఆమె పలు పోస్టులు పెట్టారు. కోవిడ్ సమయంలో జగన్ సర్కార్ పెర్ఫార్మెన్స్ పై ఆమె ప్రశంసల జల్లులు కురిపించారు.అవి వైరల్ గా మారాయి.

ఈ క్రమంలో తాజాగా ఏపీ ఎన్నికల ఫలితాలపై ఇప్పటికే స్పందించిన ఆమె... వైసీపీ అధినేత జగన్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులపైనా స్పందించారు. ఇందులో భాగంగా... గత ఎన్నికల్లో జగన్ విజయానికి భార్య భారతి, తల్లి విజయమ్మ, సోదరి షర్మిళ కీలక పాత్ర పోషించారు అని తెలిపిన పూనమ్... వారు తమదైన మార్గంలో సహనం, పట్టుదల నేర్పారని అన్నారు.

ఈ సమయంలో జగన్ కుటుంబ సభ్యులంతా ప్రేమ, శాంతితో ఉండాలని కోరుకుంటున్నట్లు పూనమ్ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

కాగా... ఇప్పటికే ఏపీలో ఎన్నికల ఫలితాలపై స్పందించిన పూనమ్... వైసీపీ ఎలక్షన్ నినాదం "వైనాట్ 175" పై సెటైరికల్ గా స్పందించారు! ఇందులో భాగంగా... "వై నాట్ 175 అనే విషయాన్ని ఏపీ ప్రజలు చాలా సీరియస్ గా తీసుకున్నట్లున్నారు" అని ఇన్ స్టాలో స్పందిస్తూ... #ఆంధ్రప్రదేశ్ ను జోడించారు.

The architects of #ysjaganmohanreddy garu’s previous success were the three important women of his life , his mother , his sister , his wife YS Bharathi garu who truly teaches patience and perseverance in her own ways , I wish the entire family togetherness , love and peace ✌️ 🙏

— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) June 7, 2024
Tags:    
  • Poonamkaur 
  • Jaganmohanreddy 
  • Appolitics 
  • Jagan 
  • YSRCP 
  • Ysvijayamma 
  • Sharmila 
  • Ysbharathi 
  • Ysavinashreddy 
  • Pawankalyan 
  • Actresspoonamkaur 

Similar News

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

Copyright @2026

Powered by Blink CMS