• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అన్నమయ్య జిల్లాలో...

అన్నమయ్య జిల్లాలో దారుణం.. రెచ్చిపోయిన ప్రేమోన్మాది

| ప్రేమికుల దినోత్సవం రోజున దారుణం జరిగింది. తన ప్రేమను అంగీకరించలేదని పగబట్టిన దుర్మార్గుడు.. యువతిపై కత్తితో దాడి చేసి యాసిడ్ పోశాడు.

By - Tupaki Desk
Update: 2025-02-14 09:42 GMT

ప్రేమికుల దినోత్సవం రోజున దారుణం జరిగింది. తన ప్రేమను అంగీకరించలేదని పగబట్టిన దుర్మార్గుడు.. యువతిపై కత్తితో దాడి చేసి యాసిడ్ పోశాడు. ఏపీలో అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంటున్న ఈ సంఘటన సంచలనంగా మారింది. బాధితురాలికి ఈ మధ్యనే పెళ్లి కుదిరింది. మరో నెల రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఆమె చావుతో ఆస్పత్రిలో పోరాడటం కలిచివేస్తోంది.

అన్నమయ్య జిల్లాలోని గుర్రంకొండ మండలం ప్యారంపల్లికి చెందిన యువతి మదనపల్లెలో డిగ్రీ చదువుకుంది. చదువు పూర్తయ్యాక ఖాళీగా ఉండక, మదనపల్లెలోనే బ్యూటీ పార్లర్ నిర్వహిస్తూ ఉపాధి పొందుతోంది. ఈ నెల 7న ఆమెకు వివాహం నిశ్చయమైంది. ఏప్రిల్ లో పెళ్లి చేసేందుకు ముహూర్తాలు కూడా తీశారు. త్వరలో కొత్త జీవితం ప్రారంభించాల్సిన ఆమెపై ఓ ఉన్మాది పగపట్టాడు. మదనపల్లె అమ్మచెరువు మిట్టకు చెందిన గణేశ్ అనే యువకుడు ప్రేమించమని ఆ యువతి వెంటపడుతూ వేధిస్తున్నాడు. దీనిపై పలుమార్లు ఆమె హెచ్చరించినా, ఉన్మాది గణేశ్ ప్రవర్తనలో మార్పు రాలేదు.

ఈ క్రమంలో ఆమెకు వివాహం కుదరడాన్ని సహించలేకపోయాడు. తన ప్రేమను అంగీకరించని ఆమెపై ప్రతీకరాం తీర్చుకోవాలని భావించి శుక్రవారం ఉదయం బాధితురాలి తల్లిదండ్రులు ఇంటి వద్ద లేని సమయంలో వచ్చాడు. బాధితురాలి తలపై కత్తితో దాడిచేశాడు. ఆ తర్వాత తన వెంట తెచ్చిన యాసిడ్ ను ఆమె ముఖంపై వేశాడు. ఈ దాడిలో యువతి తీవ్రంగా గాయపడింది. మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. యువతి ఆరోగ్యం పట్ల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అన్నమయ్య జిల్లాలో యువతిపై యాసిడ్ పోసిన ప్రేమోన్మాది

ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడ్డ గుర్రంకొండ మండలం ప్యారం పల్లెకు చెందిన గౌతమిని ఆసుపత్రికి తరలింపు.#TeluguNews #NewsUpdate #Tupaki pic.twitter.com/9Qf5vOB3xw

— Tupaki (@tupaki_official) February 14, 2025
Tags:    
  • Valentinesday 
  • ValentinesDayHorror 
  • AcidAttack 
  • LoveTurnedViolence 
  • AndhraPradesh 
  • AnnaMayaDistrict 
  • BrutalAttack 
  • JusticeForVictim 

Similar News

మల్లారెడ్డి కోడలు.. మాట మార్చింది..

2026-11-13 07:17 GMT

'నమస్తే వరల్డ్'తో మంచు మనోజ్, భూమా మౌనిక దంపతుల కొత్త ప్రయాణం!

2026-11-13 07:06 GMT

రూ.10 లక్షల నుంచి రూ.18 కోట్లకు.. హార్దిక్ పాండ్యా ఐపీఎల్ సంపాదన ఎంతో తెలుసా?

2026-11-13 06:53 GMT

మైక్రోసాఫ్ట్ సేవల్లో భారీ అంతరాయం.. ఔట్‌లుక్, టీమ్స్, కోపైలట్ యూజర్లకు ఇబ్బందులు!

2026-11-13 06:51 GMT

కూటమిపై చంద్రబాబు స్పష్టమైన సంకేతాలు.. స్థానికంలో వైసీపీ గెలుపుపై సీఎం కీలక వ్యాఖ్యలు!

2026-11-13 06:51 GMT

రూ.130 కోట్లకు అమ్ముడైన గోల్కొండ వజ్రం.. 70 ఏళ్ల తర్వాత సంచలనం!

2026-11-13 04:43 GMT

విజయ్ మామ గిఫ్ట్.. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్! దళపతి మాస్టర్ మైండ్ ఇదేనా?

2026-11-13 04:43 GMT

ముచ్చటగా మూడో ఎఫైర్ బయటకు.. ఎన్విడియో 'హువాంగ్' ఏంటయ్యా ఈ యవ్వారాలు..

2026-11-13 04:11 GMT

మీ తాత మా తాత గ్రేట్...లోకేష్ తో ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !

2026-11-13 04:06 GMT

డీలిమిటేషన్ బిల్లు ఆమోదం....బీజేపీ ధీమా వెనక ?

2026-11-13 04:02 GMT

సోనియా ఆత్మ కధ....కాంగ్రెస్ కి ఎంత మేలు చేస్తుంది ?

2026-11-13 04:02 GMT

కొత్త పార్టీలు...వారికి అదో తుత్తి !

2026-11-13 04:01 GMT

Copyright @2026

Powered by Blink CMS