కాక్రోచ్‌కు మ‌రింత బ‌లం.. రీజ‌నేంటి?

సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి.. చేసిన కాక్రోచ్ వ్యాఖ్య‌ల అనంత‌రం.. ఆవిర్భ‌వించిన‌.. ఆన్‌లైన్ కాక్రోచ్ జ‌న‌తా పార్టీ.. నేడు దేశంలోనే కీల‌క చ‌ర్చ‌గా మారింది.

Update: 2026-06-16 07:50 GMT

సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి.. చేసిన కాక్రోచ్ వ్యాఖ్య‌ల అనంత‌రం.. ఆవిర్భ‌వించిన‌.. ఆన్‌లైన్ కాక్రోచ్ జ‌న‌తా పార్టీ.. నేడు దేశంలోనే కీల‌క చ‌ర్చ‌గా మారింది. వాస్త‌వానికి ఆదిలో వ్యంగ్యాస్త్రాలు ఈ పార్టీని వెంటా డాయి. పైగా.. వ్య‌వ‌స్థాప‌కుడు అభిజిత్ దీప్కే కూడా.. అమెరికాలో ఉండి.. దీనిని ఏర్పాటు చేయ‌డం కూడా .. పెద్ద‌గా క‌ల‌సి రాద‌ని కొంద‌రు రాజ‌కీయ పండితులు అనుకున్నారు. కానీ, అనూహ్యంగా రాత్రికి రాత్రి ఈ పార్టీకి మ‌ద్ద‌తు పెరిగింది.

ఒక‌ర‌కంగా.. పార్టీ ఆవిర్భావ స‌మ‌యానికి ఒక ల‌క్ష్యం లేదు. స‌మాజంలోని అవినీతి, అక్ర‌మాలు లేకుండా చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. కానీ, ఇది సాధార‌ణ ప్ర‌క‌ట‌నే. అనేక పార్టీలు ఇలా ప్ర‌క‌టిస్తూనే ఉన్నాయి. కానీ.. ఆ త‌ర్వాత‌.. నిర్వ‌హించిన నీట్ ప‌రీక్ష పేప‌ర్ లీక్‌కావ‌డం.. దీనిని కేంద్ర ప్ర‌భుత్వం పెద్ద‌గా సీరియ‌స్‌గా తీసుకోలేద‌న్న వాద‌న వినిపించ‌డంతో కాక్రోచ్ జ‌న‌తా పార్టీ దీనిని అందిపుచ్చుకుంది. తొలి ఉద్య‌మంగా నీట్ పార‌ద‌ర్శ‌క‌త‌నే ఎంచుకుంది.

ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద నిర్వ‌హించిన తొలి నిర‌స‌న‌కు భారీ స్పంద‌న వ‌చ్చింది. అనేక ఇబ్బందు లు ఎదురైనా.. కాక్రోచ్ ముందుకే సాగింది. ఈ క్ర‌మంలో సోష‌ల్ మీడియాను బ్లాక్ చేశారు. అయినా.. వేరే వేదిక‌ను ఏర్పాటు చేసుకుని ఉద్య‌మాన్ని కొన‌సాగించింది. తాజాగా రాజ‌స్తాన్‌లో జ‌రిగిన నిర‌స‌న‌లో అభిజిత్ దీప్కేపై దాడి జ‌రిగింది. అయినా.. త‌మ ఉద్య‌మం ముందుకే సాగుతుంద‌ని.. దాడుల‌ను లెక్క‌చేయ‌బోమ‌ని.. వీటిని ముందుగానే ఊహించామ‌ని దీప్కే తెలిపారు.

మ‌రింత సానుభూతి..

తాజాగా జ‌రిగిన దాడి త‌ర్వాత‌.. కాక్రోచ్ జ‌న‌తా పార్టీపై మ‌రింత సానుభూతి పెర‌గ‌డం గ‌మ‌నార్హం. నిన్న‌టి వ‌రకు 2 కోట్ల మంది ఫాలోవ‌ర్లు ఉంటే.. తాజాగా ఇది దాదాపు 3 కోట్ల‌కు చేరింది. అంతేకాదు.. వివిధ రాష్ట్రాల నుంచి కూడా కాక్రోచ్‌కు ఆహ్వానాలు అందుతున్నాయి. త‌మ రాష్ట్రంలో ఉద్య‌మాలు చేయండి.. అంటూ.. యువ‌త ఆన్‌లైన్‌వేదిక‌గా పిలుపునిస్తున్నారు. దీనిని బ‌ట్టి.. కాక్రోచ్ మ‌రింత బ‌ల‌ప‌డుతున్న సంకేతాలు వ‌స్తున్నాయి.

ప్ర‌తిఘ‌ట‌న ఎదురైన ప్ర‌తిసారీ..

ప్ర‌తిఘ‌ట‌న ఎదురైన ప్ర‌తిసారీ.. దేశంలో ఉద్య‌మాల‌కు మ‌రింత ద‌న్ను ఏర్ప‌డుతోంది. గ‌తంలో తెలంగాణ ఉద్య‌మం, ఆ త‌ర్వాత‌.. అన్నాహ‌జారే చేప‌ట్టిన లోక్‌పాల్ విప్ల‌వం.. వంటివి దీనికి ప్ర‌ధాన ఉదాహ‌ర‌ణ‌లు. ఇప్పుడు కాక్రోచ్ పార్టీపై అప్ర‌క‌టిత నిర్బంధాలు.. ఎదుర‌వుతున్న ద‌రిమిలా.. మ‌రింతగా ప్ర‌జ‌ల నుంచి స్పంద‌న రావ‌డంతోపాటు.. తాజాగా కాక్రోచ్ పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడిపై జ‌రిగిన దాడిని మెజారిటీ ప్ర‌జ‌లు ఖండించ‌డం దీనికి ఉదాహ‌ర‌ణ‌.

Tags:    

Similar News