'మంత్రి' అనిపించుకుంటారాట... జాబితా పెద్దదే ..!
దీనిపై ఆన్‌లైన్ ఛానల్ ఒకటి తాజాగా సర్వే చేసింది. సుమారు మూడు ప్రాంతాల్లోనూ కలిపి 30 మంది వరకు ఎమ్మెల్యేలను కలిసిన ఈ చానెల్ వారి అభిప్రాయాలు సేకరించింది.;
సీఎం చంద్రబాబు తన మంత్రి వర్గాన్ని ప్రక్షాళన చేయాలని భావిస్తే..(ప్రస్తుతం ఆ ఆలోచన లేదు) ప్రస్తు తం ఉన్న ఎమ్మెల్యేల్లో ఎవరు ఏమని అనుకుంటున్నారు? ఎవరెవరు మంత్రులు కావాలని కలలు కంటున్నారు? ఆశలు కూడా పెట్టుకున్నారు? అనేది ఆసక్తిగా మారింది. దీనిపై ఆన్‌లైన్ ఛానల్ ఒకటి తాజాగా సర్వే చేసింది. సుమారు మూడు ప్రాంతాల్లోనూ కలిపి 30 మంది వరకు ఎమ్మెల్యేలను కలిసిన ఈ చానెల్ వారి అభిప్రాయాలు సేకరించింది.
ఎక్కువగా మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న ప్రాంతంగా రాయలసీమ నిలిచింది. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు.. ఇక్కడి నుంచి మంత్రి పదవులు కావాలని కోరుతున్నారు. వీరిలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువ నాయకుడు, తొలిసారి ఎమ్మెల్యే అయిన ఉద్యమ నేత ఒకరు.. మంత్రి వర్గంలో సీటును బలంగా కోరుకుంటున్నారు. అయితే.. ఆయనకు మంత్రి వర్గంలో చోటు లభిస్తుందా? అంటే.. కష్టమేనన్నది నియోజకవర్గం టాక్.
ఇక, ఇదే సీమకు చెందిన ఓ ఫైర్ బ్రాండ్ నాయకురాలు, తొలిసారి గెలిచిన రెడ్డి సామాజిక వర్గం నేత కూడా చంద్రబాబు టీంలో చేరాలని భావిస్తున్నారు. అంతేకాదు.. ఆమె తన సత్తా ఏంటో కూడా చూపిస్తాన ని అంటున్నారు. ఇక, ఉమ్మడి చిత్తూరుకు చెందిన ఓ నడివయస్కుడైన ఎమ్మెల్యే కూడా మంత్రి జాబితా లో తన పేరును చూసుకోవాలని భావిస్తున్నారు. ఉత్తరాంధ్ర విషయానికి వస్తే.. జనసేనకు చెందిన ఓ సీనియర్ నాయకుడు కూడా.. ఈ జాబితాలో ఉండాలని కోరుకుంటున్నారు.
ఇక, కోస్తా జిల్లాలకు చెందిన వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఓ అగ్రవర్ణ సామాజిక వర్గానికి చెందిన సీనియ ర్ రాజకీయ కుటుంబానికి చెందిన ఎమ్మెల్యే సైతం.. తాను కూడా మంత్రిగా అర్హుడినేనని ఘంఠా పథంగా చెబుతున్నారు. ఇలా.. మొత్తం 50మంది ఎమ్మెల్యేలను కలవగా.. సుమారు 22 మంది మంత్రి వర్గంలో చోటు కోసం ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి మంత్రివర్గంలో చోటు ఉన్నదే 26 మందికి. మరి ఇంత మంది కొత్త ముఖాలకు చంద్రబాబు అవకాశం ఇస్తారా? అసలు మంత్రి వర్గప్రక్షాళన చేయాలని అనుకుంటున్నారా? అనేది ప్రశ్నగానే మిగిలింది.