తిన్న వెంటనే పడుకోకండి.. భోజనం తర్వాత నడిస్తే ఎన్ని లాభాలో తెలుసా ?
* ఎంత సేపటి తర్వాత నడవాలి: భోజనం తర్వాత నడవడం ముఖ్యం, కానీ తిన్న వెంటనే కాదు.;
పెద్దవాళ్లు ఎప్పుడూ చెబుతుంటారు..భోజనం చేసిన వెంటనే పడుకోకూడదంటారు. సోఫాలో అతుక్కుపోయినట్టు గంటల తరబడి కూర్చోకూడదు. తిన్న తర్వాత కాసేపైనా నడిస్తే జీర్ణక్రియ బాగా అవుతుంది. చాలా రోగాలు దరిచేరవు అని అంటారు.అవును అది నిజమే. కానీ భోజనం తర్వాత నడవడానికి సరైన టైమ్ ఏంటో మీకు తెలుసా? తెలియకపోతే, తిన్న తర్వాత ఎప్పుడు నడవాలి? ఎంతసేపు నడవాలి? అనేది వివరంగా తెలుసుకుందాం.
భోజనం తర్వాత నడవాలనుకుంటే
* ఎంత సేపటి తర్వాత నడవాలి: భోజనం తర్వాత నడవడం ముఖ్యం, కానీ తిన్న వెంటనే కాదు. భోజనానికి, నడవడానికి మధ్య కాస్త గ్యాప్ ఉండాలి. తిన్న తర్వాత మీ శరీరం కనీసం 10-15 నిమిషాలు రెస్ట్ తీసుకోవాలి. అప్పుడే జీర్ణక్రియ మొదలవుతుంది. వెంటనే నడిస్తే కడుపులో నొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది.
* ఎలా నడవాలి: కొంతమంది తిన్న తర్వాత చాలా స్పీడ్‌గా నడుస్తారు. అది తప్పు. భోజనం తర్వాత నడక ఎప్పుడూ నెమ్మదిగా ఒకే వేగంతో ఉండాలి. మీరు నడుస్తూ కూడా సులభంగా మాట్లాడగలిగేంత స్లోగా ఉండాలి. తిన్న వెంటనే ఫాస్ట్‌గా నడిస్తే కడుపులో రక్త ప్రసరణ తగ్గి జీర్ణక్రియకు ఇబ్బంది కలుగుతుంది.
భోజనం తర్వాత నడవడం వల్ల లాభాలు
* భోజనం తర్వాత నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి కంట్రోల్‌లో ఉంటుంది. తిన్న తర్వాత లైట్‌గా నడిచేవాళ్లలో షుగర్ లెవెల్స్ నిలబడి లేదా కూర్చున్న వాళ్ల కంటే నెమ్మదిగా పెరుగుతాయి. అంతేకాదు, ఇన్సులిన్ లెవెల్స్ కూడా బాగా స్థిరంగా ఉంటాయి. తిన్న తర్వాత నడిస్తే జీర్ణం బాగా అవుతుంది. కడుపు ఉబ్బరం కూడా తగ్గుతుంది.బరువు తగ్గాలనుకునే వాళ్లు తప్పకుండా భోజనం తర్వాత నడవాలి. ఇది బరువును కంట్రోల్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. నడవడం వల్ల మీ మూడ్ కూడా బాగుంటుంది. నడిస్తే ఒత్తిడి కలిగించే హార్మోన్లు తగ్గుతాయి. సంతోషాన్ని కలిగించే హార్మోన్లు పెరుగుతాయి. దీనివల్ల మీరు హ్యాపీగా ఉండటమే కాకుండా, నిద్ర కూడా బాగా పడుతుంది. రోజూ తిన్న తర్వాత నడిచే అలవాటు ఉన్నవాళ్లు మంచి పోషకాహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. దీనివల్ల ఆహారంలో ఉండే ప్రోటీన్లు, గ్లైసెమిక్ ఇండెక్స్ ఉత్పత్తులు బాగా అబ్సార్బ్ అయి జీర్ణక్రియకు సహాయపడతాయి. కొన్ని స్టడీస్ ప్రకారం, భోజనం తర్వాత నడవడం రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడంలో చాలా బాగా పనిచేస్తుంది. శరీరంలో గ్లూకోజ్, ఇన్సులిన్ లెవెల్స్‌ను అదుపులో ఉంచుతుంది. దీనివల్ల టైప్ 2 డయాబెటిస్ వంటి రోగాలు రాకుండా కాపాడుకోవచ్చు.
ఆహారం తిన్న వెంటనే పాటించాల్సిన కొన్ని మంచి అలవాట్లు:
* నీళ్లు ఎక్కువగా తాగకుండా కొద్దిగా తాగాలి.
* కొంచెం సేపు రెస్ట్ తీసుకోవాలి.
* తక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవాలి.
* సిగరెట్, మద్యం వంటి అలవాట్లు తగ్గించుకోవాలి.
* తేలికపాటి వ్యాయామాలు చేయాలి.