పరోటా తింటున్నారా .. అయితే ఆగండి

పరోటాకు ఫ్యాన్స్ ఎక్కువే. వెజ్, నాన్ వెజ్ కాంబినేషన్ లో పరోటాలు తినడానికి అత్యధిక మంది మొగ్గుచూపుతారు

Update: 2024-05-23 05:30 GMT

పరోటాకు ఫ్యాన్స్ ఎక్కువే. వెజ్, నాన్ వెజ్ కాంబినేషన్ లో పరోటాలు తినడానికి అత్యధిక మంది మొగ్గుచూపుతారు. ముఖ్యంగా ప్రయాణాలలో ఎక్కువగా రాత్రి పూట హోటళ్లలో తొందరగా తినడానికి అందుబాటులో ఉండేది పరోటానే. కానీ పరోటా ఎక్కువగా తినేవారికి మధుమేహం వ్యాధి పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పరోటాలను మైదాపిండితో తయారు చేస్తారు. గోధుమల నుండి తయారు చేసిన గోధుమపిండి నుండి దాని పొట్టు, ఎండో స్పెర్మ్ తొలగించడం ద్వారా మైదాపిండి తయారవుతుంది. గోధుమపిండిలో ఉన్న పోషకాలు, పీచు పదార్థాలు ఎగిరిపోవడంతో గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా చేరి రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది.

శరీరంలో మధుమేహాన్ని కలిగించే ప్రధాన కారకం మైదా. 100 గ్రాముల మైదాలో 351 కేలరీలు ఉంటాయి. ఇందులో 10.3 గ్రాముల ప్రొటీన్, 0.7 గ్రాముల కొవ్వు, 2.76 గ్రాముల పీచు, 74.27 గ్రాముల పిండిపదార్థాలు ఉంటాయి. ఈ పీచు లేని మైదాను తక్కువ తిన్నా వెంటనే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. మందంగా ఉండే పరోటాలు ఉడకడానికి అధిక నూనెను వాడతారు. ఇది గుండె మీద ప్రభావం చూపుతుంది, కాబట్టి పరోటాకు దూరంగా ఉండాలని, ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు దాని వైపు కన్నెత్తి చూడొద్దని చెబుతున్నారు.

Tags:    

Similar News