కొత్త కష్టం: కేరళను కుట్టేసిన వెస్ట్ నైల్ ఫీవర్

తాజాగా ఆ రాష్ట్రంలో వైరల్ ఫీవర్ బారిన పడింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వెస్ట్ నైల్ ఫీవర్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది.

Update: 2024-05-08 06:30 GMT

దేవుడి భూమిగా చెప్పుకునే కేరళ రాష్ట్రానికి కొత్త కష్టం వచ్చింది. మిగిలిన చాలా రాష్ట్రాలతో పోలిస్తే.. భిన్నమైన జీవన విధానంతో పాటు.. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే కేరళీయుల మీద తరచూ ఏదో విపత్తు పిడుగు పడుతూ ఉంటుంది. తాజాగా అలాంటిదే మరొకటి పడింది. తాజాగా ఆ రాష్ట్రంలో వైరల్ ఫీవర్ బారిన పడింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వెస్ట్ నైల్ ఫీవర్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది.

కేరళలోని పలు ప్రాంతాల్లో ఈ కేసుల సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. ఇంతకూ ఈ వెస్ట్ నైల్ అనేది ఒక వైరల్ ఫీవర్. క్యూలెక్స్ దోమ ద్వారా ఇది మనుషులకు సంక్రమిస్తుంది. ఈ వైరల్ ఫీవర్ బారిన పడినోళ్లకు ఎలాంటి మందులు ప్రత్యేకంగా లేవు. టీకా కూడా లేదు. లక్షణాల ఆధారంగా చికిత్స చేయటం మినహా చేయగలిగింది ఏమీ లేదని చెబుతున్నారు.

ఈ వైరల్ ఫీవర్ బారిన పడినోళ్లకు తీవ్రమైన తలనొప్పి..తల తిరగటం.. జ్వరం.. కండరాల నొప్పులు.. మెమరీ లాస్ లాంటి లక్షణాలు ఉంటాయి. అయితే.. అన్నీ లక్షణాలు అందరికి ఉండకపోవచ్చు. ఈ వైరల్ ఫీవర్ బారిన పడిన పలువురు జ్వరం.. తలనొప్పి.. వాంతులు.. దురద లాంటి లక్షణాల్ని కలిగి ఉంటారు. మొత్తం బాధితుల్లో ఒక్క శాతం బాధితులకు మాత్రం మెమరీ లాస్ అయ్యే ముప్పు పొంచి ఉంటుంది. ఈ వైరల్ ఫీవర్ కారణంగా మరణ ముప్పు కూడా ఉందని చెప్పాలి.

Read more!

ఈ వైరల్ ఫీవర్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ చెబుతున్నారు. జ్వరం లేదంటే వెస్ట్ నైల్ ఇన్ ఫెక్షన్ లక్షణాలతో కనిపిస్తే తక్షణం చికిత్స మొదలు పెట్టాల్సిందిగా హెచ్చరిస్తున్నారు. కేరళలో ఈ ఇన్ ఫెక్షన్ బారిన పడిన వారి ఆరోగ్యం నిలకడగా ఉందంటున్నారు. ఈ వైరల్ ఫీవర్ ను తొలిసారి 1937లో ఉగాండాలో గుర్తించారు. మన దేశంలో మొదటిసారి కేరళలో 2011లో గుర్తించారు. ఆరేళ్ల ఒక బాలుడితో మొదటిసారి ఈ తరహా ఫీవర్ బారిన పడ్డారని చెప్పాలి. ఇదే అబ్బాయి.. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత అంటే 2019లో జ్వరం కారణంగా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. మొత్తంగా తాజా వైరల్ ఫీవర్ కేరళకు ఇబ్బందికరంగా మారిందన్న మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News