ఫ్రైడ్ ఫుడ్స్ వల్ల బరువు వేగంగా పెరగడం వెనుక ఫ్యాట్ ట్రాప్ అదేనా?

కానీ, ఇలాంటి ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల చాలా ఈజీగా, వేగంగా బరువు పెరిగిపోతారని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు.

Update: 2026-05-26 22:30 GMT

ఈరోజుల్లో ఎక్కువ మందికి,ముఖ్యం గా పిల్లలకు చికెన్ ఫ్రై, ఫ్రెంచ్ ఫ్రైస్, సమోసాలు లాంటివి చూస్తేనే నోరూరుతుంది. కానీ, ఇలాంటి ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల చాలా ఈజీగా, వేగంగా బరువు పెరిగిపోతారని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. అసలు నూనెలో వేయించిన ఫుడ్స్ తింటే బాడీలో ఏం జరుగుతుంది? బాడీ బరువు ఎందుకు అంత ఫాస్ట్‌గా పెరుగుతుంది? మనం రోజూ పడే ఈ 'ఫ్యాట్ ట్రాప్' వెనకున్న అసలు నిజాలు ఏంటో ఇప్పుడు సింపుల్‌గా తెలుసుకుందాం..

క్యాలరీల కొండ.. ఈ ఫ్రైడ్ ఫుడ్:

ఏదైనా ఒక ఆహారాన్ని నూనెలో వేసి బాగా ఫ్రై చేసినప్పుడు, అది ఆయిల్ మొత్తాన్ని పీల్చేసుకుంటుంది. దీనివల్ల అందులో ఉండే క్యాలరీల సంఖ్య ఒక్కసారిగా డబుల్, ట్రిపుల్ అయిపోతుంది. ఉదాహరణకు ఒక నార్మల్ ఆలుగడ్డను తింటే వచ్చే క్యాలరీల కంటే, దాన్నే నూనెలో వేయించి ఫ్రెంచ్ ఫ్రైస్‌లా తింటే వచ్చే క్యాలరీలు చాలా చాలా ఎక్కువ. ఇవే మనల్ని లావుగా మారుస్తాయి.

తిన్నా కడుపు నిండదు.. ఎందుకంటే?:

ఫ్రైడ్ ఫుడ్స్ లో ఫైబర్ అంటే పీచుపదార్థం అస్సలు ఉండదు. పైగా నూనెలో డీప్ ఫ్రై చేయడం వల్ల అందులో ఉండే మంచి పోషకాలు కూడా నశించిపోతాయి. ఫైబర్ లేకపోవడం వల్ల ఈ ఫుడ్స్ తిన్న కాసేపటికే మళ్లీ ఆకలి వేస్తుంది. కడుపు నిండినట్లు అనిపించక, మనం తెలియకుండానే మరింత ఎక్కువగా తినేస్తాం. దీన్నే 'ఓవర్ ఈటింగ్' అంటారు.

మెటబాలిజం స్లో అయిపోతుంది:

మనం తిన్న ఫుడ్ ఎనర్జీగా మారడాన్ని మెటబాలిజం అంటారు. అయితే ఫ్రైడ్ ఫుడ్స్ లో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ ట్రాన్స్ ఫ్యాట్స్ మన శరీర మెటబాలిజం ప్రాసెస్‌ను బాగా నిదానం చేస్తాయి. ఇక దీనివల్ల మనం తిన్న ఆహారం త్వరగా అరగదు, ఎనర్జీగా మారదు. ఆ అదనపు క్యాలరీలన్నీ కరగకుండా శరీరంలో కొవ్వు రూపంలో పేరుకుపోతాయి.

పొట్ట చుట్టూ కొవ్వు చేరిపోతుంది:

ఇక ఎక్కువగా ఫ్రైడ్ ఐటమ్స్ తినేవాళ్లలో కొవ్వు ఎక్కువగా పొట్ట, నడుము భాగాల్లోనే పేరుకుపోతుంది. ఇది కేవలం బరువు పెంచడమే కాకుండా.. భవిష్యత్తులో గుండె జబ్బులు, డయాబెటిస్ లాంటి పెద్ద పెద్ద హెల్త్ ప్రాబ్లమ్స్‌కు దారి తీస్తుంది. అందుకే దీన్ని ఒక పెద్ద ఫ్యాట్ ట్రాప్ అని చెప్తుంటారు.

నాలుక రుచి కోసం అప్పుడప్పుడు ఫ్రైడ్ ఫుడ్స్ తింటే పర్లేదు కానీ, దాన్నే అలవాటుగా మార్చుకుంటే మాత్రం బరువు పెరగడం ఖాయం. ఆరోగ్యం బాగుండాలన్నా, ఫిట్‌గా ఉండాలన్నా నూనె వస్తువులకు కాస్త దూరంగా ఉండటం మంచిది. ఫ్రైడ్ ఐటమ్స్ ప్లేస్‌లో బాయిల్డ్ లేదా బేక్ చేసిన హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి అంటున్నారు నిపుణులు.

Tags:    

Similar News