ఫోన్ దూరం పెడితే.. 2 వారాల్లో బ్రెయిన్లో జరిగేది ఇదే..

ఈ రోజుల్లో పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు చేతిలో స్మార్ట్‌ఫోన్ లేకపోతే ముద్ద దిగదు, నిద్ర రాదు.

Update: 2026-05-23 13:30 GMT

ఈ రోజుల్లో పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు చేతిలో స్మార్ట్‌ఫోన్ లేకపోతే ముద్ద దిగదు, నిద్ర రాదు. అయితే, ఎప్పుడూ ఫోన్ చూస్తూ గడపడం వల్ల మన మెదడు ఎంతలా దెబ్బతింటుందో సరికొత్త పరిశోధనలు వెల్లడించాయి. కేవలం రెండు వారాల పాటు స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ వాడకాన్ని పక్కన పెడితే.. మెదడు పనితీరు మునుపటిలా చురుగ్గా మారుతుందట. అంతేకాదు, మన ఆలోచనా శక్తి ఏకంగా పదేళ్లు వెనక్కి వెళ్లి, అంత యంగ్‌గా మారుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరి ఆ విశేషాలు చూద్దాం..

రీసెర్చ్‌లో తేలింది ఏంటంటే?:

ప్రముఖ సైన్స్ జర్నల్స్‌లో ప్రచురితమైన అధ్యయనాల ప్రకారం, కేవలం రెండు వారాల పాటు ఫోన్ ఇంటర్నెట్‌కు బ్రేక్ ఇచ్చిన వారిలో అద్భుతమైన మార్పులు కనిపించాయి. ఇక వారిలో ఏకాగ్రత పెరగడం, మానసిక ఆందోళన, డిప్రెషన్ లక్షణాలు తగ్గడం గమనించారు. హార్వర్డ్ పరిశోధన ప్రకారం కేవలం ఒక్క వారం ఫోన్ వాడకం తగ్గిస్తేనే యాంగ్జైటీ 16 శాతం, డిప్రెషన్ 25 శాతం వరకు తగ్గిపోయి, ప్రశాంతమైన నిద్ర పట్టింది.

స్మార్ట్‌ఫోన్ ఎందుకు అంత డేంజర్?:

కంప్యూటర్లు, టీవీల కంటే స్మార్ట్‌ఫోన్లు మనల్ని ఎక్కువగా బానిసలను చేస్తున్నాయి. ఎందుకంటే ఫోన్ ఎప్పుడూ మన జేబులోనే ఉంటుంది. తినేటప్పుడు, మాట్లాడేటప్పుడు, చివరకు పడుకునేటప్పుడు కూడా నోటిఫికేషన్లు మనల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటాయి. సోషల్ మీడియా రీల్స్, షార్ట్స్ మనల్ని మైండ్ లేకుండా అలా స్క్రోల్ చేసేలా చేస్తాయి. ఇక దీనివల్ల మన మెదడుకు అస్సలు విశ్రాంతి దొరకడం లేదు. ఇక స్మార్ట్‌ఫోన్‌ను పూర్తిగా వదిలేయాల్సిన అవసరం లేదు, కొన్ని చిన్న మార్పులు చేస్తే చాలు.అవి ..

యాప్స్ దాచేయండి:

ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్, టిక్‌టాక్ వంటి యాప్స్‌ను హోమ్ స్క్రీన్‌పై కాకుండా ఏదైనా ఫోల్డర్ లోపల దాచండి. ఇక కంటికి కనిపించకపోతే ఫోన్ ఓపెన్ చేయాలనే ఆలోచన తగ్గుతుంది.

నోటిఫికేషన్లు ఆఫ్ చేయండి:

షాపింగ్, న్యూస్, సోషల్ మీడియా అలర్ట్స్ పూర్తిగా ఆఫ్ చేయండి. కేవలం ముఖ్యమైన కాల్స్, మెసేజ్‌లు మాత్రమే ఉంచండి.

బెడ్‌రూమ్‌లోకి ఫోన్ వద్దు:

రాత్రి పడుకునే ముందు ఫోన్ స్క్రోల్ చేయడం వల్ల నిద్ర పాడవుతుంది. ఇక అందుకే ఫోన్‌ను బెడ్‌రూమ్ బయట ఛార్జ్ పెట్టండి. అలారం కోసం విడిగా క్లాక్ వాడండి.

ఇటర్నెట్ బ్లాకింగ్ యాప్స్ వాడండి:

మనకు మనంగా ఫోన్ పక్కన పెట్టలేనప్పుడు టెక్నాలజీ సాయం తీసుకోవచ్చు. ఫ్రీడమ్, ఓపల్, స్క్రీన్ జెన్ వంటి యాప్స్ ద్వారా మనకు నచ్చిన సమయాల్లో సోషల్ మీడియా రాకుండా బ్లాక్ చేసుకోవచ్చు. అలాగే ఖాళీ సమయంలో ఫోన్ చూడకుండా.. చిన్నగా నడవడం, పుస్తకాలు చదవడం, వంట చేయడం లేదా ఇంట్లో వాళ్లతో మాట్లాడటం అలవాటు చేసుకోవాలి.

స్మార్ట్‌ఫోన్ అనేది మన అవసరానికి మాత్రమే, దానికి మనం బానిసలు కాకూడదు. ఈ రోజు నుంచే మీ ఫోన్ స్క్రీన్ టైమ్ కాస్త తగ్గించి చూడండి. మీ బ్రెయిన్ ఎంత ఫ్రెష్‌గా, ప్రశాంతంగా మారుతుందో మీకే అర్థమవుతుంది. ఇక హెల్తీ లైఫ్ కోసం ఈ చిన్న డిజిటల్ డిటాక్స్ ప్రయత్నించి చూడండి..

Tags:    

Similar News