గూగుల్ పిక్సెల్ వాచ్ 2... ధర, ఫీచర్స్ ఇవే!
అవును... గూగుల్ పిక్సెల్ వాచ్ 2 తాజాగా విడుదలైంది. ఈ సందర్భంగా... గత పిక్సెల్ వాచ్ తో పోలిస్తే ఈ సారి చాలా ఫీచర్లను మరింత మెరుగుపర్చినట్లు గూగుల్ తెలిపింది.
ప్రస్తుతం అంతా స్మార్ట్ ఫోన్ లతో పాటు స్మార్ట్ వాచ్ ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పెద్ద పెద్ద కంపెనీలన్నీ పోటీ పడి మరీ రకరకాల స్మార్ట్ వాచ్ లను తయారుచేసి మార్కెట్ లోకి వదులుతున్నాయి. ఇందులో భాగంగా... గూగుల్ పిక్సెల్ వాచ్ 2, భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. పిక్సెల్ 8 సిరీస్ స్మార్ట్ ఫోన్లతో పాటు వీటిని విడుదల చేశారు. ఈ గూగుల్ పిక్సెల్ వాచ్ 2 ఫీచర్స్, ధర, మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం.
అవును... గూగుల్ పిక్సెల్ వాచ్ 2 తాజాగా విడుదలైంది. ఈ సందర్భంగా... గత పిక్సెల్ వాచ్ తో పోలిస్తే ఈ సారి చాలా ఫీచర్లను మరింత మెరుగుపర్చినట్లు గూగుల్ తెలిపింది. క్వాల్ కాం 5100 చిప్ సెట్ తో వచ్చిన ఈ వాచ్ ఈనెల రెండో వారం నుంచి మార్కెట్లో అందుబాటులోకి రానుంది! ఈ పిక్సెల్ వాచ్ 2.. 3డీ కర్వ్‌డ్ ఆల్వేస్ ఆన్ డిస్ ప్లేతో వస్తోంది. దీని మాగ్జిమం బ్రైట్ నెస్ 1,000 నిట్స్ వరకు ఉంటుంది. ఇదే సమయంలో వాచ్ స్క్రీన్ పై కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 కూడా వస్తోంది.
ఇక 2జీబీ ర్యాం, 32జీబీ స్టోరేజ్ తో వస్తోన్న ఈ వాచ్ లో వేర్ ఓఎస్ 4.0 ఔట్ ఆఫ్ బాక్స్ ఓఎస్ ను ఇస్తున్నారు. ఇందులో... అల్టీమీటర్, యాక్సెలరోమీటర్, గైరోస్కోప్, దిక్సూచి, యాంబియెంట్ లైట్ సెన్సర్, బారోమీటర్, మ్యాగ్నెటోమీటర్ వంటి పలు సెన్సార్లు ఉన్నాయి. ఇతర స్మార్ట్ వాచ్ ల తరహాలోనే ఆరోగ్య స్థితిని తెలియజేసే అనేక ఫీచర్లు ఉన్నాయి.
అవును.. ఈ స్మార్ట్ ఫోన్ లో హెల్త్ కి సంబంధించిన పరిస్థితిని తెలియజేసే అనేక ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో భాగంగా... ఆక్సిజన్ మానిటర్, ఈసీజీ మానిటర్, హార్ట్ రేట్, స్కిన్ టెంపరేచర్ వంటి సెన్సర్స్ కూడా ఉన్నాయి. ఇందులో మొత్తం 40 స్పోర్ట్స్ మోడ్ లు అందుబాటులో ఉన్నాయి.
ఇక పిక్సెల్ వాచ్ 2 ఆల్వేస్ ఆన్ డిస్ ప్లేలో ఉంచితే బ్యాటరీ లైఫ్ 24 గంటల వరకు ఉంటుందని గూగుల్ చెబుతుంది. ఈ వాచ్ తో పాటు యూఎస్‌బీ ఛార్జింగ్ కేబుల్ ను ఇస్తున్నారు. ఇక ఈ వాచ్ లో బిల్ట్ ఇన్ మైక్, స్పీకర్, సైడ్ బటన్ ఉన్నాయి. బ్లూటూత్ 5, వైఫై, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.
ఇక ఈ వాచ్ కలర్స్ విషయానికొస్తే... గూగుల్ పిక్సెల్ వాచ్ 2 మ్యాట్ బ్లాక్, షాంపెయిన్ గోల్డ్, సిల్వర్ రంగుల్లో అందుబాటులో ఉంది. ఇక ఈ వాచ్... ఎల్‌టీఈ, వైఫై.. రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అయితే భారత్ లో ఎల్‌టీఈ మాత్రమే విడుదలైంది. దీని ధర రూ.39,900. అక్టోబర్ 13 నుంచి ఇది ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులోకి రానుంది. అయితే, పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో లు కొనుగోలు చేసేవారికి మాత్రం ఈ పిక్సెల్ వాచ్ 2ను ఫ్లిప్ కార్ట్ రూ.19,999కే అందిస్తోంది.