• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ విమర్శల వల్లే అవకాశాలు...

ఆ విమర్శల వల్లే అవకాశాలు రాలేదా..?

| హీరోల విషయంలో ఎలా ఉన్నా హీరోయిన్స్ విషయంలో మాత్రం కొన్ని విమర్శలు వారి కెరీర్ మీద ఎఫెక్ట్ పడేలా చేస్తాయి.

By - Tupaki Desk
Update: 2024-07-31 15:30 GMT

హీరోల విషయంలో ఎలా ఉన్నా హీరోయిన్స్ విషయంలో మాత్రం కొన్ని విమర్శలు వారి కెరీర్ మీద ఎఫెక్ట్ పడేలా చేస్తాయి. వారు బయటకు ఎలా కనిపిస్తున్నారు అన్నది కాదు లోపల ఎలా అన్నది వారికి మాత్రమే తెలుస్తుంది. కనిపించే లుక్, వేసుకునే బట్టల వల్ల వారి గురించి తక్కువ చేసి మాట్లాడకూడదు. ముఖ్యంగా గ్లామర్ ఫీల్డ్ లో అవకాశాల కోసం వారికి నచ్చినా నచ్చకపోయినా కొన్ని సార్లు గ్లామర్ గా కనిపించాల్సి ఉంటుంది. కథానాయికగా రాణించాలంటే ఇవన్నీ సహజం ఐతే ఇలాంటి తన జీవితంలో జరిగిన ఒక సందర్భాన్నే చెబుతూ బాధపడ్డారు బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్.


ఎవరైనా తొలి సినిమా స్టార్ ఛాన్స్ వస్తే ఆ సినిమా తర్వాత కెరీర్ సెట్ అవుతుందని ఆశిస్తారు. అందరిలానే సల్మాన్ ఖాన్ తో వీర్ ఛాన్స్ రాగానే జరీన్ ఖాన్ కూడా అదే ఊహించింది. కానీ కట్ చేస్తే సినిమా తర్వాత సీన్ రివర్స్ అయ్యింది. అనుకోని విమర్శలు అమ్మడిని టార్గెట్ చేశాయి. ముందు చెప్పుకున్నట్టుగా ఆమె మనసులో ఏముంది అన్నది ఏమి తెలియకపోయినా స్టార్ సినిమా చేయగానే తలపొగరు అంటూ బాలీవుడ్ మీడియా ఆమెపై ఎక్కేసింది. తన మీద వస్తున్న ఈ వార్తలకు జరీన్ ఖాన్ ఏమి చేయలేకపోయిందట.

ఆ టైం లో చాలా ఇబ్బందిగా అనిపించి ఇంట్లోనే ఉన్నానని.. అసలు బయటకు రావాలని అనిపించలేదని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు జరీన్ ఖాన్. వీర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదు అనిపించుకున్నా ఆ తర్వాత తనకు పెద్దగా అవకాశాలు రాకపోగా అలా ఉంటే కష్టమని వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ వచ్చానని అంటుంది జరీన్ ఖాన్.

ఐతే 2021 లో చివరి సినిమా చేసిన జరీన్ ఖాన్ 14 ఏళ్ల కెరీర్ లో చాలా విషయాలు నేర్చుకున్నానని అంటుంది. తొలి సినిమా టైం లో జూనియర్ కత్రినా కైఫ్ అనే రేంజ్ టాక్ తెచ్చుకున్న ఈ అమ్మడు తర్వాత తర్వాత పెద్దగా ఛాన్సులు రాబట్టుకోలేదు. జరీన్ ఖాన్ తెలుగులో చాణక్య సినిమా చేసింది. గోపీచంద్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఆమె లీడ్ హీరోయిన్ గా నటించింది. ఐతే సినిమా ఫ్లాప్ అవ్వడంతో మళ్లీ ఇటు వైపు తిరిగి చూడలేదు.

Tags:    
  • Zarinekhan 
  • Bollywood 
  • Actress 
  • Filmindustry 
  • Movies 
  • Actresszarinekhan 
  • Chanakya 

Similar News

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS