సీనియర్ల ఉత్సాహం మీద జగన్ నీళ్ళు ?
వైసీపీలో సీనియర్లు చాలా మంది ఉన్నారు. వారంతా కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చిన వారు.;
వైసీపీలో సీనియర్లు చాలా మంది ఉన్నారు. వారంతా కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చిన వారు. ఒక విధంగా చెప్పాలీ అంటే కాంగ్రెస్ కల్చర్ ని అలవాటు చేసుకుని రాజకీయం చేస్తున్న వారు. అయితే ఒక జాతీయ పార్టీలో ఎంతో స్వేచ్చను అనుభవించిన వారు వైసీపీ లాంటి ప్రాంతీయ పార్టీలో ఇమడలేకపోయినా రాజకీయ పరిస్థితులు అవసరాలు అనివార్యతలు అన్నీ అర్ధం చేసుకుని సర్దుకుని పోతున్నారు. వైసీపీలో వీరంతా దాదాపుగా పుష్కర కాలం పైగా తమ రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. దీంతో వీరు సీనియర్ మోస్ట్ లీడర్లుగా ఉన్నారు.
సగటు వయసు ఆరు పదులేనా :
ఇక ఏపీలో చూస్తే ఇపుడు టీడీపీలో ఉన్న నాయకుల ఏవరేజ్ ఏజ్ యాభై నుంచి యాభై ఐదు మధ్యన ఆగితే వైసీపీలో మాత్రం సగటు వయసు అరవై నుంచి అరవై అయిదు గా ఉంది అని అంటున్నారు. ఇలా ఎందుకు అంటే టీడీపీ కొత్త వారికి ప్రోత్సాహం ఇస్తోంది. తాజాగా చూస్తే టీడీపీకి చెందిన మొత్తం 135 మంది ఎమ్మెల్యేలలో సగానికి పైగా యూత్ ఉన్నారు యాభై ఏళ్ళ లోపు వారు అత్యధికులు ఉన్నారు. అదే వైసీపీలో చూస్తే పెద్దలే అధికంగా కనిపిస్తున్నారు. వీరితోనే పార్టీని వైసీపీ నడిపిస్తోంది. దాంతో పాటుగా 2029 ఎన్నికల మీద వైసీపీ ఆలోచనలు ఎలా ఉన్నాయో అన్న దాని మీద కూడా చర్చ సాగుతోంది.
వారసులకు నో చాన్స్ :
ఇక వైసీపీలో చాలా మంది సీనియర్లు 2024 ఎన్నికల్లోనే తాము రాజకీయాలకు దూరంగా ఉంటామని చెప్పారని టాక్. అదే సమయంలో తమ వారసులకు టికెట్లు ఇవ్వాలని వారు కోరారని కూడా ప్రచారం సాగింది. కానీ కొన్ని చోట్ల కొందరికి మాత్రమే వైసీపీ అధినేత టికెట్లు ఇచ్చారు. అయితే వైసీపీ నుంచి పోటీ చేసిన వారసులు అంతా ఓటమి పాలు అయ్యారు. దీంతో వైసీపీ అధినాయకత్వం మనసు కూడా మార్చుకుంది అని అంటున్నారు. వారసులకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్కవని అంటున్నారు. మచిలీపట్నంలో చూస్తే మాజీ మంత్రి పేర్ని నాని కుమారుడు కిట్టూ కాకుండా నానే ఇపుడు బాధ్యతలు చూస్తున్నారు అని అంటున్నారు. అలాగే భూమన కరుణాకరరెడ్డి కానీ చెవిరెడ్డి భాస్కరరెడ్డి కానీ వచ్చే ఎన్నికల్లో పోటీకి తయారుగా ఉండాలని అంటున్నారు. అలా కాకపోయినా సీనియర్లుగా వారిని పార్టీ భావించినా కొత్త వారికే సీటు ఇస్తారని ప్రచారం అయితే సాగుతోంది.
చాలా మందికి నిరాశ :
ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి రాయలసీమ దాకా చూస్తే వైసీపీలో చాలా మంది సీనియర్లు వచ్చే ఎన్నికల్లో తాము తప్పుకుని తమ వారసులకు టికెట్లు ఇవ్వాలని కోరుతున్నారని అంటున్నారు అయితే వైసీపీ అధినాయకత్వం మాత్రం ససేమిరా అంటోందని ప్రచారం సాగుతోంది దీంతోనే చాలా మంది సీనియర్లు కినుక వహించి సైలెంట్ అయ్యారని అంటున్నారు తామ వారసులకు రాజకీయ జీవితం ఇవ్వాలని తమ ఇంట్లోనే మరింత కాలం రాజకీయంతో పాటు పదవులు కూడా నిలిచి వెలగాలని కోరుకునే వారికి ఇపుడు అధినాయకత్వం కొత్త ఆలోచనలు కూడా కలవరం రేకెత్తిస్తున్నాయని అంటున్నారు.
కొత్త రక్తం కోసమేనా :
వైసీపీలో కొత్త రక్తం ఎక్కించాలని అధినాయకత్వం భావిస్తోంది అని అంటున్నారు. వైసీపీ పుట్టేనాటికి అనివార్యంగా కాంగ్రెస్ నుంచి చాలా మంది నాయకులను తీసుకున్నారు. దాంతో పార్టీలో కూడా ఆ కల్చర్ బాగానే ఒంటబట్టిందని చెబుతారు. అయితే ఇక మీదట అలా కాకుండా వైసీపీని మరింత కాలం జనంలో నిలిపేందుకు యువతకు కొత్త వారికి చాన్స్ ఇవ్వాలని చూస్తున్నారు అని అంటున్నారు అలా కనుక జరిగితే కనుక వైసీపీ తయారు చేసిన వైసీపీ మార్క్ లీడర్లు వస్తారని పార్టీ ఇబ్బందులో ఉన్నా విధేయత విషయంలో కూడా సవాళ్ళు ఎదురుకావు అన్న ఆలోచనలు ఉన్నాయని అంటున్నారు. మొత్తం మీద చూస్తే 2029 ఎన్నికల నాటికి చాలా కొత్త ముఖాలే వైసీపీలో కనిపిస్తాయని అంటున్నారు. అంతే కాదు 2024 ఎన్నికల్లో టికెట్లు దక్కించుకున్న ఆనేక మంది తమదే ఆ సీటు అని ఏవైనా ఆశలు పెంచుకుంటే మాత్రం వారికి నిరాశ తప్పదనే అంటున్నారు.