• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దేవకీ నందన వాసుదేవ.....

దేవకీ నందన వాసుదేవ.. పిల్ల ప్రేమలో మునిగిపోయాడు

| ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు హనుమాన్ మూవీతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మ కథ అందిస్తుండటం విశేషం.

By - Tupaki Desk
Update: 2024-04-05 12:54 GMT

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా ప్రస్తుతం దేవకీ నందన వాసుదేవ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ సినిమా హీరోతో మంచి హిట్ అందుకున్న అశోక్ నటిస్తున్న ఈ మూవీని గుణ 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు హనుమాన్ మూవీతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మ కథ అందిస్తుండటం విశేషం.


కొన్ని రోజుల క్రితం ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. బురదలో జరిగే ఫైట్‌ సన్నివేశంతో కట్‌ చేసిన ఫస్ట్ యాక్షన్‌ సీక్వెన్స్ ఫుల్ వైరల్ అయింది. యూనిక్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కుతుండగా.. మాస్ అవతార్ లో అశోక్ గల్లా సందడి చేయనున్నారు. సినీ ఆడియన్స్ లో టీజర్ తో మంచి క్యూరియాసిటీ పెంచిన మేకర్స్.. తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు.

నేడు అశోక్ గల్లా పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు విషెస్ చెబుతూ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. "ఏమయ్యిందే గుండెకు, ఆగదు నా అడుగు.. దేవకీ నందన వాసుదేవ నుంచి మెలోడియస్ ఫస్ట్ సింగిల్ ప్రోమో ఇదిగో.. హ్యాపీ బర్త్ డే అశోక్ గల్లా" అంటూ పోస్ట్ చేశారు. ప్రోమోలో అశోక్ గల్లా ఫుల్ హ్యాపీగా ఉండగా.. హీరోయిన్ మానస వారణాసి ఎంతో అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది.

హీరోయిన్ పై ఉన్న రహస్య ప్రేమను హీరో సాంగ్ రూపంలో వర్ణిస్తుండగా.. విజువల్స్ నేచురల్ గా కనిపిస్తున్నాయి. ఇద్దరి ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయని నెటిజన్లు చెబుతున్నారు. జోడీ బాగా కుదిరిందని అంటున్నారు. ఇటీవల కాలంలో అనేక చార్ట్‌ బస్టర్ ఆల్బమ్స్ అందించిన భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అదిరిపోయిందని కామెంట్స్ పెడుతున్నారు. త్వరలోనే ఫస్ట్ సింగిల్‌ కంప్లీట్ సాంగ్ ను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.

సురేష్ గంగుల అందించిన లిరిక్స్ కు తన గాత్రంతో ప్రాణం పోశారు ఈశ్వర్ దత్తు. ఈ సినిమాను లలితాంబిక ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై ప్రొడక్షన్‌ నెం. 1గా ఎన్‌ ఆర్‌ ఐ సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు. గ్రాండ్ ప్రొడక్షన్ డిజైన్‌ తో భారీ ఎత్తున తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. మరి ఈ మూవీ ఎలా ఉంటుందో చూాడాలి.

Full View

What do you think of the #FamilyStar movie?#VijayDeverakonda #MrunalThakur #TheFamilyStar #TheFamilyStarReview #FamilyStarReview #Tupaki

— Tupaki (@tupaki_official) April 5, 2024
Tags:    
  • Tollywood 
  • DevakiNandanaVasudeva 
  • YeamayyindheSongPromo 
  • AshokGalla 
  • BirthdayWishes 
  • HappyBirthdayAshok 
  • VaranasiManasa 
  • BheemsCeciroleo 
  • PrasanthVarma 
  • SaiMadhavBurra 
  • PrasadMurella 
  • ArjunJandyala 
  • LalithambikaProductions 

Similar News

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS